For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సాక్సులు వేసుకుని నిద్రపోతే మంచిదేనా? ఇలా చేస్తే వచ్చే ప్రయోజనాలు చాలానే ఉన్నాయా, తెలుసుకోండి మరి

|

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం శరీరం మరియు మెదడు యొక్క ఆరోగ్యకర పనితీరుకై, కంటి నిండా సరైన నిద్ర అవసరం. శరీరం నిద్రకు ఉపక్రమించినా కూడా, అంతర్గత అవయవాలు అలుపెరగక రాత్రoతటా పని చేస్తాయి. క్రమంగా, మరుసటి రోజు నిద్ర మేల్కొన్న తర్వాత, మీ మెదడు మరింత స్పష్టంగా ఆలోచించడం మొదలుపెడుతుంది. అంతేకాకుండా మెదడు పనితీరు మెరుగుపడి, వేగంగా ఆలోచించడం, ఫోకస్ పెరగడం జరుగుతుంది. సరైన నిద్రలేని వారి మెదడు, క్రమంగా ఆలోచనా స్థాయిలను కూడా కోల్పోతుందని మనకు తెలియనిది కాదు. కావున కంటి నిండా నిద్ర అనేది అత్యంత ముఖ్యమైనదిగా ఉంటుంది. మెరుగైన నిద్ర కోసం, రాత్రిపూట సాక్స్లు ధరించడం ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని చెప్పబడింది.

 

నేషనల్ స్లీప్ ఫౌండేషన్ ప్రకారం, నిద్ర సమయంలో మీ పాదాలు వెచ్చగా ఉన్న పక్షంలో మీరు లోతైన నిద్రను పొందగలరు కూడా. మీ అడుగులు చల్లగా ఉన్న ఎడల, రక్తప్రవాహం తగ్గుదలకు గురై, నిద్రాభంగాన్ని కలిగిస్తాయి.

ఉత్తమంగా సూచించబడుతుంది

ఉత్తమంగా సూచించబడుతుంది

కావున మంచి నిద్ర కోసం, పడకకు ఉపక్రమించునప్పుడు, సాక్స్ ధరించడం అలవాటు చేసుకోవడం ఉత్తమంగా సూచించబడుతుంది. ఈ అలవాటు శరీర అంతర్గత ఉష్ణోగ్రత నియంత్రణలో సహాయపడుతుంది. నిద్రకు ఉపక్రమించేముందు సాక్స్ ధరించే పెద్దలు వేగంగా మరియు ఘాడమైన నిద్రలోకి వెళ్తున్నారని కూడా ఒక అధ్యయనంలో తేలింది.

రాత్రి 4 గంటల సమయంలో అత్యల్ప ఉష్ణోగ్రత

రాత్రి 4 గంటల సమయంలో అత్యల్ప ఉష్ణోగ్రత

ఒక వ్యక్తి యొక్క అంతర్గత శరీర ఉష్ణోగ్రత రాత్రి 4 గంటల సమయంలో అత్యల్ప ఉష్ణోగ్రత వద్దకు చేరుకుంటుంది. క్రమంగా నిద్రకు ఆటంకంగా మారుతుంది. ఈ స్థాయిలు వ్యక్తి వ్యక్తికీ మారుతున్న నేపధ్యంలో, కొందరు తీవ్రమైన నిద్రలేమి సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. కావున మీ పాదాలను వెచ్చగా ఉంచడం ద్వారా రక్త నాళాల మీద ఎటువంటి ప్రతికూల ప్రభావమూ పడకుండా జాగ్రత్తపడవచ్చు. దీనిని వాసోడిలేషన్ (రక్తనాళాల వ్యాకోచం) గా పిలువబడుతుంది. రక్త ప్రవాహం పెరగడం మూలంగా, చర్మం నుండి ఉష్ణోగ్రత బయటకు వస్తూ, శరీర ఉష్ణోగ్రతను ఆరోగ్యకర స్థితిలో ఉంచుతుంది.

నిద్రపోతున్నప్పుడు సాక్స్ వినియోగించడం శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది ?
 

నిద్రపోతున్నప్పుడు సాక్స్ వినియోగించడం శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది ?

మానవ శరీరం యొక్క సగటు శరీర ఉష్ణోగ్రత 98.6 డిగ్రీల ఫారెన్హీట్, కానీ 24 గంటల వ్యవధిలో ఈ ఉష్ణోగ్రత 1 నుండి 2 డిగ్రీల తేడాను కలిగి ఉంటుంది.

ఒక వ్యక్తి యొక్క శరీర ఉష్ణోగ్రత సిర్కాడియన్ రిథం మీద ఆధారపడి ఉంటుంది. ఇది వ్యక్తి నిద్రా విధానాలను, సరళిని నియంత్రణలో కలిగి ఉంటుంది.

శరీర ఉష్ణోగ్రత నెమ్మదిగా పెరుగుతుంటుంది

శరీర ఉష్ణోగ్రత నెమ్మదిగా పెరుగుతుంటుంది

ఒకరోజులో, శరీర ఉష్ణోగ్రత నెమ్మదిగా పెరుగుతుంటుంది. ఆ క్రమంలో భాగంగా శరీర ఉష్ణోగ్రతలు మధ్యాహ్న సమయంలో శిఖరాగ్రానికి చేరుతాయి. క్రమంగా ప్రజలు ఉష్ణోగ్రతను అనుభూతి చెందడం జరుగుతుంది. ఆపై రాత్రి సమయంలో, శరీర ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం కారణంగా, వ్యక్తి అలసటకు గురై నిద్రకు లోనయ్యేలా చేస్తుంది. మీరు నిద్రపోతున్నప్పుడు, ఈ శరీర ఉష్ణోగ్రత 1 నుండి 2 డిగ్రీల వరకు తగ్గుతుంది. ఇది శరీర ఇతరత్రా శారీరక విధులకు శక్తిని ఆదా చేసేందుకు గల సంకేతంగా ఉంటుంది. మీరు సాక్సులతో నిద్రపోతున్నప్పుడు, ఈ ఉష్ణోగ్రత బయలాజికల్ చక్రం నిర్వహించడంలో మరింత సహాయపడుతుంది.

Most Read :ఈ ట్రిక్స్ పాటిస్తే డబ్బు మిగులుతుంది, లేదంటే ఎంత సంపాదించినా అప్పులపాలవుతారు

రాత్రిపూట సాక్స్లను ధరించడానికి సూచించదగిన ఇతర కారణాలు :

రాత్రిపూట సాక్స్లను ధరించడానికి సూచించదగిన ఇతర కారణాలు :

1. రక్త ప్రసరణ ప్రోత్సహిస్తుంది

అడుగులు మరియు కాళ్ళలో తక్కువ రక్త ప్రసరణ ఉన్న నేపధ్యంలో, సిరల్లో వాపు మొదలై, క్రమంగా కాలి నొప్పికి కూడా దారితీస్తుంది. కొందరికి కాలి తిమ్మిర్లు కూడా రావడం జరుగుతుంటుంది. అంతేకాకుండా పాదాలు కూడా చల్లగా మారుతాయి. కావున రాత్రి వేళల్లో శుభ్రమైన కాటన్ సాక్సులను ధరించడం ద్వారా, మీ పాదాలలో రక్త ప్రసరణ సజావుగా జరిగి, క్రమంగా వెచ్చదనం పొందుతుంది.

2. వేడి ఆవిర్లు కలుగకుండా సహాయపడుతుంది.

2. వేడి ఆవిర్లు కలుగకుండా సహాయపడుతుంది.

దీనిని హాట్ ఫ్లాషెస్ అని వ్యవహరిస్తారు కూడా. ముఖ్యంగా ఈ సమస్యను ఆడవారు ఎదుర్కొంటూ ఉంటారు, అదికూడా వారి మెనోపాజ్ దశలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. ఈ పరిస్థితి తలెత్తినప్పుడు, శరీరంలో అధికంగా ఉష్ణోగ్రతలు పెరగడం, ఆవిర్లు, చమటలు రేకెత్తడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రాత్రివేళ ధరించే సాక్సులు ప్రధానంగా శరీర ఉష్ణోగ్రతలని క్రమబద్దీకరిస్తుంది. క్రమంగా అధిక ఉష్ణోగ్రతకు లోనుకాకుండా, కాపాడగలుగుతుంది. ఫలితంగా ఆవిర్లు కూడా తగ్గుముఖం పడుతాయి.

Most Read : నా బాయ్ ఫ్రెండ్ మా అమ్మను కూడా అనుభవించాడు

3. మంచి లైంగిక సంబంధాన్నిప్రోత్సహిస్తుంది

3. మంచి లైంగిక సంబంధాన్నిప్రోత్సహిస్తుంది

గ్రోనిన్జెన్ విశ్వవిద్యాలయ పరిశోధకుల ప్రకారం రాత్రిపూట సాక్స్లను ధరించే జంటలు వాస్తవానికి సంతోషకరమన మరియు ఉద్వేగపూరితమైన సెక్స్ జీవితాన్ని కలిగి ఉంటారని తేల్చారు.

4. రేనాడ్స్ వ్యాధి యొక్క లక్షణాలను తగ్గిస్తుంది

4. రేనాడ్స్ వ్యాధి యొక్క లక్షణాలను తగ్గిస్తుంది

రేనాడ్స్ వ్యాధి యొక్క లక్షణాలలో ఒకటి, చేతులు మరియు కాళ్ళు అతి శీతలంగా మారడం. ఇది చర్మంలోని రక్తనాళాలను ప్రభావితం చేసే ఒక తీవ్రమైన వ్యాధి. మరియు చేతులు మరియు కాళ్ళకు రక్త ప్రవాహం తగ్గి శరీర ఉష్ణోగ్రతలు కూడా క్రమంగా తగ్గుముఖం పడుతుంటాయి. కావున ఈ వ్యాధితో భాదపడుతున్న వ్యక్తులు, తమ పాదాలకు సాక్స్ ధరించడం మూలంగా, తిమ్మిరులు తగ్గుముఖం పట్టి, పాదాలు వెచ్చగా ఉంచడంలో దోహదం చేస్తాయి.

నిద్రకు ఉపక్రమించే ముందు ఏ రకమైన సాక్స్ ధరించాలి?

నిద్రకు ఉపక్రమించే ముందు ఏ రకమైన సాక్స్ ధరించాలి?

నిద్రకు ఉపక్రమించే ముందు కాష్మెరే లేదా ఉన్ని వంటి సహజ సిద్దమైన మృదువైన సాక్స్ ధరించడం ఉత్తమం. అంతేకాకుండా కాటన్ సాక్స్లను కూడా ధరించవచ్చు. కాని ఆ సాక్సులు బిగుతుగా లేవని నిర్ధారించుకోండి.

ఎందుకంటే బిగుతుగా ఉన్న సాక్సులు రక్త ప్రసరణను తగ్గిస్తుంది. కావున మృదువైన, శుభ్రమైన తేలికపాటి సాక్సులను వినియోగించడం ఉత్తమం. ఇవి మీ పాదాలకు సరైన వెచ్చదనాన్ని ఇస్తాయి. కావున మృదువైన మరియు సౌకర్యవంతమైన సాక్స్ ధరించడం మంచిది. కంప్రెషన్ సాక్స్ ధరించే ముందు వైద్యుని సంప్రదించండి.

Most Read : వ్యాధులన్నింటినీ నయం చేయగల తిప్పతీగ, ఆయుర్వేద ఔషధ గని తిప్పతీగ

మీ పాదాలను వెచ్చగా ఉంచడం ద్వారా

మీ పాదాలను వెచ్చగా ఉంచడం ద్వారా

నిద్రవేళలో మీ పాదాలను వెచ్చగా ఉంచడం ద్వారా శరీరానికి సరైన విశ్రాంతిని అందివ్వగలుగుతారు. మరియు త్వరగా నిద్రలోకి జారుకుంటారు. శరీరంలో ఉష్ణోగ్రత నియంత్రించబడుతుంది కావున, నిద్ర నాణ్యత కూడా పెరుగుతుంది. ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి.

ఇటువంటి అనేక ఆసక్తికర, ఆరోగ్య, జీవనశైలి, మాతృత్వ, శిశు సంబంధ, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Benefits of Sleeping with Socks On

Why Should You Sleep With Your Socks On
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more