Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
రక్తంశుద్దికావాలంటే ఈ ఎనిమిది రకాల ఆహారాలు తినాలి, రక్తం పెరగాలన్నా రోజూ అవే తినాలి
వాటిని తినడం వల్ల రక్తంలోని అదనపు కొవ్వులు కరిగిపోతాయి. అలాగే శరీరంలో ఉండే హానికరమైన రసాయనాలు, వ్యర్థాలు మొత్తం కూడా బయటకు వెళ్తాయి.
ప్రతి ఒక్కరికీ రక్తం చాలా అవసరం. బాడీలోని ఆక్సిజన్, హార్మోన్లు, చక్కెర, కొవ్వులు, కణాలు లాంటివి మీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అయితే రక్తం సహజంగా శుద్ది అవుతూ ఉంటే చాలా మంచిది. అలా కావాలంటే మీరు కొన్ని రకాల సూచనలు పాటించాలి.
ఇక మీ రక్తంలో ఉండే మలినాల వల్ల మీరు చాలా సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది. మొటిమలు, మచ్చలు, చర్మం పొడి బారడంలాంటి సమస్యలకు గురవుతారు. రక్తం శుద్ది అయితే చాలా రకాల అనారోగ్యాల నుంచి తప్పించుకోవొచ్చు.

పలు చర్మవ్యాధుల బారిన పడకుండా
తలనొప్పి, వికారంగా ఉండడం, పలు చర్మవ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చు. రక్తం స్వచ్చంగా ఉంటే శరీరంలోని ప్రధాన అవయవాల పని తీరు కూడా బాగుంటుంది. కిడ్నీలు, గుండె, కాలేయం, ఊపిరితిత్తులు వంటి వాటి పనితీరు బాగుంటుంది. మరి రక్తం శుద్ది అయి మంచి రక్తం బాడీకి అందాలంటే తరుచుగా మీరు 8 ఈ ఆహారపదార్థాలను తీసుకుంటూ ఉండాలి.

బ్రోకలీ
బ్రోకలీ శరీర నుంచి విషపదార్థాలను మొత్తం కూడా బయటకు పంపగలదు. అలాగే రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇందులో కాల్షియం, విటమిన్ సి, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, పొటాషియం, మాంగనీస్ తదితర పోషకాలుంటాయి. బ్రోకలీని రోజూ ఉపయోగిస్తే యాంటీఆక్సిడెంట్స్ పెరుగుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

2. తాజా పండ్లు
యాపిల్స్, రేగు, బేరి, జామ తదితర తాజా పండ్లలో పెక్టిన్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వాటిని తినడం వల్ల రక్తంలోని అదనపు కొవ్వులు కరిగిపోతాయి. అలాగే శరీరంలో ఉండే హానికరమైన రసాయనాలు, వ్యర్థాలు మొత్తం కూడా బయటకు వెళ్తాయి.
అలాగే టమోటాల్లో ఉండే లైకోపీన్ గ్లూటాథయోన్ కూడా శరీరంలోని వ్యర్థాలను, రసాయనాలను తొలగిస్తుంది. ఇక కాలేయం ఆరోగ్యంగా ఉండేందుకు మీరు తరుచూ స్ట్రాబెర్రీస్, బ్లాక్ బెర్రీస్, క్రాన్బెర్రీస్ వంటి పండ్లను తింటూ ఉండాలి.

3. గ్రీన్ లీఫ్ కూరగాయలు
గ్రీన్ లీఫ్ కూరగాయలు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో చాలా రకాల పోషకాలుంటాయి. పాలకూర, తోటకూర, గోంకూరలాంటివిఆవపిండి ఆకుకూరల నుండి ఎంచుకోండి. ఈ ఆకుకూరలు శరీరానికి కావాల్సిన మంచి రక్తాన్ని అందిస్తాయి.

4. బీట్రూట్
బీట్రూట్ ద్వారా చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
కాలేయంవాపును తగ్గించే గుణాలు ఇందులో ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్, నైట్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. బీట్రూటు రసం శరీరంలో హాని కలిగించే వాటిపై పోరాడగల శక్తి ఉంటుంది. అలాగే రక్తాన్ని శుద్ది చేస్తుంది.

5. బెల్లం
చక్కెరకు ప్రత్యామ్నాయంగా బెల్లాన్ని ఉపయోగిస్తే చాలా మంచిది. దీనివల్ల రక్తం శుద్ధి అవుతుంది. అలాగే జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారించగలదు. శరీరంలో వ్యర్ధాలను తొలగించగలదు. బెల్లంలో ఉండే ఐరన్ రక్తంలో హిమోగ్లోబిన్ ను పెంచగలదు. మంచి రక్తాన్ని బాడీకి అందించగల శక్తి బెల్లానికి ఉంటుంది.

6. నీరు
రోజూ శరీరానికి అవసరమైనంత నీరు తాగుతూ ఉండాలి. లేదంటే చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటారు. రక్త శుద్ధికి నీరు కూడా చాలా ఉపయోగపడుతుంది. అలాగే శరీరంలో హానికరమైన మలినాలు మొత్తం బయటకు వెళ్లేందుకు కూడా నీరు బాగా తోడ్పడుతుంది. రక్తశుద్ది కోసం రోజూ రాత్రిపూట ఒక రాగి పాత్రలో కొంత వెచ్చని నీటిని నిల్వ చేసి మరుసటి రోజు ఉదయం పరగడుపున తాగాలి.

7. పసుపు
పసుపు కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. కాలేయం సక్రమంగా పని చేసేందుకు పసుపు ఎంతో బాగా తోడ్పడుతుంది. బాడీలోపల ఏ సమస్య తలెత్తకుండా ఉండేందుకు పసుపు చాలా అవసరం. ఇన్పెక్షన్స్ తలెత్తకుండా చూసే గుణాలు పసుపులో ఉంటాయి. పాలలో పసుపు కలుపుకుని తాగితే ఎర్ర రక్త కణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అందువల్ల రోజూ పాలలో పసుపు కలుపుకుని తాగండి.

8. నిమ్మకాయ
కాస్త వేడి నీటిలో నిమ్మరసాన్ని కలుపుకుని తాగితే చాలా మంచిది. ఇలా రెగ్యులర్ గా చేస్తే శరీరంలోని అధిక కొవ్వు మొత్తం త్వరగా కరిగిపోతుంది. అంతేకాదునిమ్మకాయలలో విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. అవన్నీ కూడా రక్తాన్ని శుభ్రపరుస్తాయి. ఈ 8 ఆహారపదార్ధాలను డైలీ తీసుకుంటే మంచిది.



Click it and Unblock the Notifications