For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ధాన్యాలు: రకాలు, న్యూట్రీషియన్ బెనిఫిట్స్ మరియు సైడ్ ఎఫెక్ట్స్

|

పప్పు ధాన్యాలు, లెగ్యూమ్స్ కుటుంబంలోని మొక్కల విత్తనాలుగా ఉంటాయి. ఇవి వివిధ పరిమాణాల్లో, ఆకారాలు మరియు రంగుల్లో ఉంటూ, అధిక స్థాయిలో ప్రోటీన్, ఫైబర్, మరియు వివిధ రకాల విటమిన్లతో కూడుకుని ఉంటాయి. మరియు అవసరమైన మొత్తంలో అమైనో ఆమ్లాలను కూడా కలిగి ఉండి, మీ శరీర విధులకు సహాయకారిగా ఉంటాయి. పప్పు ధాన్యాలు, యాంటీ క్యాన్సర్ లక్షణాలను కలిగి ఉండే సపోనిన్స్, ఫైటోకెమికల్స్ మరియు టానిన్లను కూడుకుని మీ ఆహారంలో అత్యుత్తమ నాణ్యతను అందివ్వగలుగుతుంది. సెలైక్ డిసీజ్, మలబద్దకం, ఊబకాయం వంటి సమస్యలకు ఉత్తమంగా పనిచేస్తుంది. గర్భధారణ సమయంలో మరియు తరువాత తల్లులకు అవసరమైన ఫోలేట్ మరియు ఐరన్ స్థాయిలు అధిక మొత్తాలలో ఉండటం వల్ల పప్పు ధాన్యాలు తీసుకోవలసిందిగా గర్భిణీ స్త్రీలకు సలహా ఇవ్వబడుతుంది.

అనేక రకాలలో ఉండే ఈ పప్పు ధాన్యాలను, ఒక నియంత్రిత పద్ధతిలో ఉపయోగించిన ఎడల, శరీరానికి ఎంతో మేలును చేకూర్చగలవని చెప్పబడింది. మనకు అందుబాటులో ఉండే కొన్ని సాధారణ పప్పు దినుసుల రకాలలో కందిపప్పు, పెసరపప్పు, ముడి సెనగలు మొదలైనవి ఉన్నాయి.

ఈ పప్పు దినుసుల గురించిన మరిన్ని పోషక ప్రయోజనాలను తెలుసుకునేందుకు వ్యాసంలో ముందుకు సాగండి.

పప్పు దినుసుల రకాలు, వాటిలోని ఖనిజాలు, పోషకాల ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు :

1. శనగ పప్పు :

1. శనగ పప్పు :

భారతీయ వంటకాల్లో శనగ పప్పుకు ఉండే ప్రాధాన్యత అందరికీ తెలిసిందే. వాస్తవానికి వంటలలో ప్రధానమైన పదార్థంగా ఉంటుందని చెప్పవచ్చు. శాస్త్రీయంగా సిసర్ అరిటీనమ్ ఎల్ అని వ్యవహరించబడుతుంది. శనగ పప్పు పోషకభరితమైనది. ఇది ఫైబర్, జింక్, కాల్షియం, ప్రోటీన్ మరియు ఫోలేట్లో అధికంగా ఉంటుంది. మీ రోజువారీ ఆహారంలో ఈ శనగ పప్పును తరచుగా జోడించుకోవడం మూలంగా శరీర ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. జీవక్రియలను పెంచడంలో ఉత్తమంగా సహాయపడుతుంది.

బరువు తగ్గడంలో శనగ పప్పులోని పీచు పదార్ధాలు జీర్ణక్రియలకు ఎంతగానో సహాయం చేస్తాయి, అంతేకాకుండా మధుమేహం నివారించడంలో కూడా అత్యత్తమ ప్రభావాన్ని కలిగి ఉంటుందని చెప్పబడింది. ఇది మీ రక్తపోటును నియంత్రించడంలో, జ్ఞాపకశక్తిని పెంపొందించడంలో మరియు హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పబడింది. ఇందులోని సెలీనియం నిక్షేపాలు క్యాన్సర్ నివారణ చికిత్సకు గల సామర్ధ్యాన్ని కలిగి ఉందని చెప్పబడింది. వీటితో పాటు, మహిళల్లో హార్మోన్ స్థాయిలను క్రమబద్దీకరించడం, మూత్రపిండాలలో మరియు పిత్తాశయాలలో రాళ్లను తొలగించడం వంటి అంశాలలో కూడా సహాయపడతాయి.

2. కందులు :

2. కందులు :

కాజనస్ కాజన్ అని శాస్త్రీయ నామంగా ఉండే ఈ కందులు, లెగ్యూమ్స్ కుటుంబానికి చెందినవిగా ఉంటాయి. మిగిలిన పప్పు దినుసులతో పోల్చి చూసినప్పుడు, ప్రోటీన్కు మేలైన మూలంగా కందులు ఉంటాయి అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఖనిజాలు సమృద్ధిగా ఉండే ఈ కందులలోని ఫోలేట్ కంటెంట్ కారణంగా అనీమియాని నిరోధించడానికి కూడా సహాయపడుతుందని చెప్పబడింది. అంతేకాకుండా ఇది సోడియం, పొటాషియం, భాస్వరం, జింక్ మొదలైన అనేక ఖనిజాలకు మంచి మూలంగా ఉంటుంది. ఈ కందులను వినియోగించడం ద్వారా, శరీర కణాలు, కణజాలం, కండరాలు మరియు ఎముకలు ఏర్పడటానికి, మరియు వాటి వృద్ధికి ఎంతగానో ఉపకరిస్తుంది. వీటిలో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ మీ జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది.

లెగ్యూమ్స్లో ఎటువంటి నిర్ధిష్ట దుష్ప్రభావాలు లేనప్పటికీ, వీటిని అధికంగా తీసుకోవడం మూలంగా కడుపు ఉబ్బరం, మరియు అపానవాయువు సమస్యలు ఏర్పడడానికి దారితీయవచ్చు.

3. ముడి పెసలు :

3. ముడి పెసలు :

శాస్త్రీయంగా విజ్ఞ రేడియోటా అని పిలవబడే ఈ ముడి పెసలు మొక్కల ఆధారిత వివిధ పోషకాలకు అత్యుత్తమ వనరుగా ఉంటుంది. ప్రోటీన్ యొక్క అధిక మూలంగా ఉండే ఈ ముడి పెసలు కూడా మంచి మొత్తాలలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఫైటో న్యూట్రియంట్స్ లక్షణాలను కలిగి ఉంటాయి. పీచు, నియాసిన్, ఇనుము, మెగ్నీషియం మరియు ఇతర పోషకాలను అధిక స్థాయిలో కలిగి ఉండటం మూలంగా బరువు తగ్గడంలో రోగనిరోధక శక్తి స్థాయిలు కోల్పోకుండా నియంత్రించే లక్షణాలతో కూడుకుని ఉంటాయి. ముడిపెసలను తరచుగా తీసుకోవడం మూలంగా, ఇది రక్తపోటును తగ్గించడంలో, అజీర్తి, క్యాన్సర్, PMS లక్షణాలు మరియు టైప్ 2 డయాబెటిస్ వంటి అనారోగ్య పరిస్థితులతో పోరాడడంలో సహాయపడతాయి. అంతేకాకుండా మీ చర్మం మరియు జుట్టు నాణ్యతను మెరుగుపరచడంలో ప్రభావవంతంగా ఉంటుంది.

అయితే, కిడ్నీ మరియు గాల్ బ్లాడర్ రుగ్మతలు ఉన్న వ్యక్తులు దీనికి కొంత దూరంగా ఉండవలసి ఉంటుంది. దీనికి కారణం, అటువంటి అనారోగ్య పరిస్థితులు కలిగిన వ్యక్తుల కాల్షియం శోషణలో ఇవి విఘాతం కలిగిస్తాయని చెప్పబడింది.

4. మినపప్పు :

4. మినపప్పు :

మినపప్పుని శాస్త్రీయంగా విజ్ఞముంగో అని కూడా అంటారు. దీని వల్ల కలిగే లాభాల కారణంగా, దీనిని జీర్ణక్రియలు మెరుగుపడటానికి మరియు రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించదానికి ఆయుర్వేద వైద్యంలో కూడా దీనిని ఉపయోగించడం జరుగుతుంటుంది (వివిధ ఇతర ప్రయోజనాల నేపధ్యంలో). లెగ్యూమ్స్లో ఉండే పీచు పదార్ధాలు జీర్ణక్రియ ప్రక్రియలను మెరుగుపరచడానికి సహాయపడుతుంది, మధుమేహాన్ని నిర్వహిస్తుంది మరియు మలబద్ధకం, డయేరియా, తిమ్మిరి లేదా ఉబ్బరం వంటి జీర్ణాశయ సంబంధ సమస్యల నుండి ఉపశమనానికి సహాయపడుతుంది. అంతేకాకుండా మీ ఎముకలు పటిష్టంగా ఉండేందుకు సహాయపడుతుంది. ఇది మీ నాడీ వ్యవస్థను బలోపేతం చేయడంలో మరియు కండరాలను నిర్మించడానికి కూడా సహాయకారిగా ఉంటుంది. అంతేకాకుండా ఈ లెగ్యూమ్స్ గర్భధారణ సమయంలో లాభదాయకంగా పరిగణించబడుతుంది.

మినపప్పును ఎక్కువగా తీసుకోవడం కూడా సరికాదు. ఒకవేళ స్థాయిని మించి తీసుకోవడం జరుగుతుంటే, శరీరంలో యూరిక్ ఆమ్లం స్థాయిలు సైతం పెరుగుతూ, పిత్తాశయ రాళ్లు లేదా గౌట్ వంటి సమస్యలతో బాధపడే వ్యక్తులకు మరిన్ని దుష్ప్రభావాలను కలుగజేస్తుంది.

5. కిడ్నీ బీన్స్ (రాజ్మా) :

5. కిడ్నీ బీన్స్ (రాజ్మా) :

రాజ్మా అని సాధారణంగా పిలవబడే వీటికి ఉన్న మరోపేరు కిడ్నీబీన్స్. దీని శాస్త్రీయ నామం ఫాసియోలస్ వల్గారిస్ అని చెప్పబడింది. ఫైబర్, కాల్షియం, సోడియం మరియు వివిధ ఇతర పోషకాలతో కూడుకుని ఉన్నందువలన కిడ్నీ బీన్స్ బరువు తగ్గడంలో కూడా ఉత్తమంగా సహాయం చేయగలదని చెప్పబడింది. కిడ్నీ బీన్స్లో ఉండే ఫైబర్ కంటెంట్ గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించేలా సహాయపడుతుంది. కిడ్నీ బీన్స్ తరచుగా తీసుకోవడం మూలంగా క్యాన్సర్, లివర్ వ్యాధుల ప్రమాదం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. ఇవి జీర్ణక్రియలను మెరుగుపరిచే, ఎముకలు మరియు దంతాలు ఏర్పడటానికి, చర్మ ఆరోగ్యం మరియు జుట్టు నాణ్యత కోసం ప్రయోజనకరంగా ఉంటాయి. ఫోలిక్ యాసిడ్ నిక్షేపాలు అధికంగా ఉన్న కారణంగా గర్భిణీ స్త్రీలకు కిడ్నీ బీన్స్ అత్యంత ఉత్తమమైన పోషకాహారంగా చెప్పబడుతుంది. అలాగే, ఇవి హైపర్ టెన్షన్ ను నివారించడంలో, జ్ఞాపక శక్తికి మరియు డీటాక్సిఫికేషన్ కోసం సహాయపడతాయి.

ఈ కిడ్నీ బీన్స్ అన్నిరకాల ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ, కిడ్నీ బీన్స్ అధికంగా సేవించడం మూలంగా అపానవాయువు సమస్యలు మరియు అలెర్జీ ప్రతిచర్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి.

6. అలసందలు లేదా బొబ్బర్లు :

6. అలసందలు లేదా బొబ్బర్లు :

శాస్త్రీయంగా వీటిని విజ్ఞ ఉంగిక్యులతగా వ్యవహరించబడుతుంది. లెగ్యూమ్స్ కుటుంబంలో అత్యంత లాభదాయకమైన మరియు పుష్టికరమైన దినుసుగా పరిగణించబడుతుంది. ఇది ప్రోటీన్, పీచు, ఇనుము, భాస్వరం వంటి ఖనిజాలకు మంచి మూలంగా ఉంటుంది. మీ రోజువారీ ఆహారంలో ఈ అలసందలను చేర్చడం వల్ల మీ దేహానికి అత్యంత లాభదాయకమైన పౌష్టికాహారాన్ని అందించగలిగిన వారవుతారు, క్రమంగా శారీరిక బలాన్ని పెంపొందించడంలో తోడ్పడుతుంది. అంతేకాకుండా, ఈ అలసందలు శరీరంలో కొలెస్ట్రాల్ను తగ్గించడానికి మరియు రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతూ అనీమియా నివారించడంలో మరియు మీ చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఉత్తమంగా దోహదపడుతుంది మరియు మీ చర్మం, జుట్టు మరియు కండరాలను బలోపేతం చేస్తుంది. ఇది ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీని కూడా ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా మీ ఎముక బలాన్ని పెంచుతుంది.

దీని కారణంగా తీవ్రమైన దుష్ప్రభావాలు లేనప్పటికీ, అతిగా తీసుకోవడం మూలంగా జీర్ణ సంబంధ పరిస్థితులు, మరియు అపాన వాయువు సమస్యలు ఏర్పడవచ్చు.

7. మసూరి పప్పు :

7. మసూరి పప్పు :

పోషకాలు మరియు ప్రోటీన్ల చౌక వనరుగా మసూరి పప్పు ఉంటుంది. దీనిని లెన్స్ క్యులినారిస్ అని శాస్త్రీయంగా పేర్కొనడం జరుగుతుంది. ఇవి పీచు, ఇనుము, మెగ్నీషియంలలో సమృద్ధిగా ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించే ఈ దినుసులు అధికమైన పోషకాల గనిగా ఉంటుంది. వీటిని తరచుగా నియంత్రిత వినియోగంలో ఆహార ప్రణాళికలో జోడించుకోవడం మూలంగా క్యాన్సర్ ఆగమనాన్ని నిరోధించడానికి ఉత్తమంగా సహాయపడుతుంది. ఫ్లేవోనాల్స్ మరియు ప్రోసైయానిడిన్ వంటి పాలీఫెనోల్స్ ఉత్తమమైన యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉండి, నాడీ మండలం సవ్యంగా పనిచేసేలా దోహదపడుతాయి. ఐరన్ అద్భుతమైన మూలంగా ఉన్న కారణాన అలసటతో పోరాడటానికి కూడా సహాయపడతాయి. అంతేకాకుండా, కండరాలు మరియు కణాల నిర్మాణానికి సహాయపడుతుంది. మరియు గర్భిణీ స్త్రీలకు మంచి పోషకాహారంగా కూడా ఉంటుంది. ఇది మీ శరీరంలోని ఎలక్ట్రోలైట్ యాక్టివిటీని పెంచుతూ, మీ ఎనర్జీ లెవల్స్ సరిగ్గా ఉండేలా దోహదపడుతుంది. అయితే వీటిని అధికంగా వినియోగించడం కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు దారితీస్తుంది.

గమనిక : ఎటువంటి పప్పు దినుసులు, కాయ ధాన్యాలు తృణధాన్యాలు, చిక్కుళ్ళు అయినా నియంత్రిత ధోరణిలోనే అనుసరించవలసి ఉంటుంది. వీటిని అధికంగా సేవించినచో, కడుపు ఉబ్బరం, అపానవాయువు వంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మరియు ఎటువంటి అనారోగ్య పరిస్థితులను మీరు కలిగిఉన్న ఎడల, మీ న్యూట్రిషనిస్టు లేదా వైద్యుని సలహా మేరకే వీటిని అనుసరించాలని నిర్ధారించుకోండి. ఒక్కోసారి వీటి అధిక వాడకం, ఇతరత్రా దుష్ప్రభావాలకు దారితీస్తుంది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Pulses: Types, Nutritional Benefits And Side Effects

Pulses are the edible seeds of plants in the legume family. They are high in protein, fibre, and various vitamins, and provide amino acids for your bodily functions.
Story first published: Thursday, March 21, 2019, 14:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more