For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజూ రాత్రి ఈ టీకి నిమ్మరసం+తేనె కలిపి తాగితే బరువు తగ్గుతారు, మలబ్దకం సమస్య ఉండదు, ఇంకా...

రోజూ రాత్రి ఈ టీకి నిమ్మరసం+తేనె కలిపి తాగితే బరువు తగ్గుతారు, మలబ్దక సమస్య ఉండదు, ఇంకా...

|

సుగంధ ద్రవ్యాలలో ఒకటైన జీలకర్ర కేవలం వంటలో మాత్రమే ఉపయోగించబడదు. ఇందులో అనేక ఔషధ గుణాలు కలిగి ఉన్నందున దీన్ని ఆయుర్వేదంలో ప్రధాన పదార్ధంగా ఉపయోగించబతున్నది. జీలకర్ర వంటలకు మంచి రుచిని, మంచి ఫ్లేవర్ ను అందిఇవ్వడమే కాదు, ఇది శరీరంలోకి వెళ్లి అనేక అద్భుతాలను చేస్తుంది. అంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది.

కేవలం వంటల్లో మాత్రమే జీలకర్రను వాడటం కాకుండా, జీలకర్రను టీ రూపంలో తయారుచేసి సేవిస్తే ,శరీరంలో పరిష్కారం కానీ అనేక ఆరోగ్య సమస్యలను నివారించుకోవచ్చు. అందుకు మీరు ఏం చేయాలంటే? ఒక గిన్నె తీసుకుని అందులో ఒక గ్లాసు నీళ్లు పోసి, ఒక టీస్పూన్ జీలకర్ర వేసి బాగా ఉడికించాలి. ఈ జీరా వాటర్ లేదా జీలకర్ర కషాయం లేదా జీరా టీని రెగ్యులర్ తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుందని మన అందరికీ తెలుసిన విషయమే.

Benefits Of Drinking Jeera Water With Lemon And Honey At Night Before Bed

కానీ ఈ జీరా వాటర్ కు నిమ్మరసం మరియు తేనె కలిపి టీ సేవిస్తే అద్భుత ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా రోజూ రాత్రి పడుకునే ముందు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా? ఈ వ్యాసం జీలకర్ర టీ తయారుచేసే పద్ధతి మరియు ప్రయోజనాలను వివరిస్తుంది. కాబట్టి, ఈ వ్యాసాన్ని చదవడం ద్వారా ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోండి.

జీలకర్రలోని పోషకాలు

జీలకర్రలోని పోషకాలు

జీలకర్ర చూడటానికి అతి చిన్న పరిమాణంలో ఉన్నా పోషకాలు మాత్రం పుష్కలంగా ఉంటాయి. ఇందులో మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, భాస్వరం, విటమిన్ సి మరియు విటమిన్ ఎ పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలు ప్రతి ఒక్కటి ఆరోగ్యకరమైన శరీరాన్ని నిర్వహించడానికి సహాయపడుతాయి.

జీలకర్ర టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

బరువు తగ్గుతారు

బరువు తగ్గుతారు

రోజూ రెగ్యులర్ గా ఈ జీలకర్ర టీ తాగితే శరీర బరువు తగ్గుతుంది. ఈ టీలోని జీలకర్ర మరియు నిమ్మకాయ శరీరంలో జీవక్రియలను ప్రోత్సహిస్తాయి, కొవ్వుల స్తబ్దతను తగ్గిస్తాయి మరియు వేగంగా బరువు తగ్గడానికి మీకు సహాయపడతాయి. కాబట్టి ఊబకాయంతో బాధపడుతున్న వారు, రోజూ రాత్రి పడుకునే ముందు రెగ్యులర్ గా ఈ జీరాటీ తాగండి. ఉత్తమ ఫలితాలు పొందాలంటే ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో ఈ టీ త్రాగాలి.

శరీరంలోని టాక్సిన్స్ తొలగింపబడుతాయి

శరీరంలోని టాక్సిన్స్ తొలగింపబడుతాయి

రోజూ రాత్రి రెగ్యులర్ గా ఈ టీ తాగడం వల్ల శరీరం నుండి అదనపు టాక్సిన్స్ తొలగించి శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవచ్చు. శరీరం లోపల టాక్సిన్(విషపదార్థాలు) లేకపోతే అవయవాల పనితీరు మెరుగ్గా ఉంటుంది. ముఖ్యంగా ఈ టీ రక్తాన్ని కూడా శుభ్రపరుస్తుంది.

మలబద్దకాన్ని నయం చేస్తుంది

మలబద్దకాన్ని నయం చేస్తుంది

మీరు మలబద్దకంతో బాధపడుతున్నారా? అలా అయితే, రాత్రిపూట నిద్రించే ముందు ఒక గ్లాసు జీలకర్రటీ తాగాలి. ఇది మలబద్ధకం సమస్యను వెంటనే పరిష్కరిస్తుంది. నిజానికి, ఈ పానీయం ఉదయం అలారం లాగా మిమ్మల్ని మేల్కొలుపుతుంది.

రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది

రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది

జీలకర్రలోని ఐరన్ రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తుంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి ఇనుము సహాయపడుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి మరియు వ్యాధులు త్వరగా సంక్రమించకుండా ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

 రక్తహీనత మెరుగుపడుతుంది

రక్తహీనత మెరుగుపడుతుంది

జీలకర్ర టీ సహజంగా రక్తహీనత సమస్యను నయం చేస్తుంది. ఐరన్ లోపం వల్ల రక్తహీనత వస్తుంది. కాబట్టి మీరు రోజూ ఒక గ్లాసు జీలకర్ర టీ తాగితే మీరు మీశరీరంలో ఐరన్ స్థాయిలను పెంచుకోవచ్చు , తద్వారా రక్తహీనత సమస్యను తొలగించుకోవచ్చు.

శ్లేష్మం(కఫం) తొలగించుకోవడానికి మంచి ఔషదం

శ్లేష్మం(కఫం) తొలగించుకోవడానికి మంచి ఔషదం

మీరు క్రమం తప్పకుండా జలుబు మరియు దగ్గుతో బాధపడుతున్నారా? ఇది ఛాతీ ప్రాంతంలో శ్లేష్మం(కఫం) పెరగడాన్ని నిరోధిస్తుంది మరియు నిరంతర దగ్గు నుండి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది.

ఆరోగ్యకరమైన కాలేయం

ఆరోగ్యకరమైన కాలేయం

జీలకర్ర శరీరం నుండి విషాన్ని తొలగించడానికి ఉత్తమమైన పానీయం. ఈ రెగ్యులర్ టీని ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల పిత్త ఉత్పత్తిని నివారించే మరియు కాలేయ ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడుతుంది.

జీలకర్ర టీ తయారుచేసే విధానం

జీలకర్ర టీ తయారుచేసే విధానం

కావలసినవి:

* జీలకర్ర - 1 టేబుల్ స్పూన్

* నిమ్మకాయ - సగం

* తేనె - రుచికి సరిపడా

* నీరు - 1 1/4 గ్లాసు

విధానం:

విధానం:

* ఒక పాన్ లోకి 1 1/4 గ్లాసు నీరు పోసి, జీలకర్ర వేసి బాగా ఉడకబెట్టండి. నీళ్లు రంగు మారే వరకు సన్నని మంటపై ఉడికించాలి

* తరువాత దీనిని స్టౌ మీద నుండి పక్కకు దించాలి, దీనిని ఒక గ్లాసులోకి వడపోయాలి, ఈ వడపోసిన జీరా వాటర్ కి నిమ్మకాయలో సగ భాగం పిండి, రుచికి సరిపడా తేనె కలపండి. అంతే మీ సిరప్ టీ సేవించడానికి సిద్ధం.!

* ఈ టీని ఎలా తయారుచేయాలి, ఎలాంటి బెనిఫిట్స్ పొందుతారో తెలుసుకున్నారుగా, ఇక ఆలస్యం చేయకుండా జీరా టీని ఈ రాత్రికే ట్రై చేద్దామా..

English summary

Benefits Of Drinking Jeera Water With Lemon And Honey At Night Before Bed

Here are some benefits of drinking jeera water with lemon and honey at night before bed. Read on...
Desktop Bottom Promotion