For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

COVID-19కు ముందు, తర్వాత.. కరోనా వేళ.. ఈ శ్వాస వ్యాయామాలతో కచ్చితమైన ఫలాలు..!!

కరోనా కాలంలో ఈ ఉత్తమ శ్వాస వ్యాయామ పద్ధతులను ఫాలో అయితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా.

|

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఎంతగా కలవరపెడుతుందో తెలిసిందే. మరీ ముఖ్యంగా మన దేశంలో ప్రతి ఒక్కరికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

Best Breathing Exercises for COVID-19: Before, During, and After Infection in Telugu

రోజురోజుకు కోవిద్-19 భూతం విలయ తాండవం చేస్తోంది. మన దేశంలో చాలా మంది కరోనా సోకిన తర్వాత ఊపిరాడక ప్రాణాలొదులుతున్నారు. చాలా మంది చనిపోకపోయినా.. ఈ కరోనా మహమ్మారి ఊపిరితిత్తులపైనే ఎక్కువ ప్రభావం చూపుతోంది.

Best Breathing Exercises for COVID-19: Before, During, and After Infection in Telugu

ఈ నేపథ్యంలో దీని నుండి సులభంగా బయటపడాలంటే ఈ శ్వాస వ్యాయమాలు చేస్తే చాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ బ్రీతింగ్ ఎక్సర్ సైజులపై మీరు కూడా ఓ లుక్కేయండి...

World Immunization Week 2021: ఇమ్యూనిటీ గురించి ఈ వాస్తవాలు తెలుసా...
నాసిక శ్వాస ప్రాణయామం..

నాసిక శ్వాస ప్రాణయామం..

ఈ శ్వాస వ్యాయమ పద్ధతినే నాడో శోధన ప్రాణయామం అని కూడా పిలుస్తారు. ఈ పద్ధతిలో శ్వాస వ్యాయామం చేయడం వల్ల మీకు ప్రెజర్ తగ్గుతుంది. మీ మెదడు పనితీరు మెరుగుపడటంలో కూడా ఇది సహాయపడుతుంది. దీని ప్రకారం, నేలపై స్ట్రయిట్ గా కూర్చోవాలి. ఆ తర్వాత కాసేపు నెమ్మదిగా ఊపిరి పీలుస్తూ వదులుతూ ఉండాలి. ఒక చేతిని కాలిపై పెట్టి.. మరో చేతి బోటన వేలితో ముక్కును మూసి.. ఆ తర్వాత నెమ్మదిగా ఊపిరి పీలుస్తూ వదులుతూ ఉండాలి.

శ్వాస వ్యాయామాలు..

శ్వాస వ్యాయామాలు..

శ్వాసపై ద్యాస ఉంచి ఊపిరి తీసుకోవడం మూలంగా శరీరానికి కావాల్సిన ప్రాణవాయువుని ఎక్కువ మోతాదులో తీసుకుని జీవక్రియలో ఉత్తేజితమవుతాయి. లోతుగా శ్వాసని తీసుకోవడం వల్ల ఆక్సీజన్ మరింత సరఫరా అవుతుంది. అంతేకాదు శ్వాస వ్యాయామాల వల్ల మనకు తెలీకుండా శరీర జీవక్రియలకు నిరంతరం జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రతిరోజూ కొంత సమయం వెచ్చించి శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల శరీర జీవక్రియలకు కావాల్సినంత ప్రాణవాయువును అందించగలుగుతాం.

బొడ్డు శ్వాస నియమం..

బొడ్డు శ్వాస నియమం..

బొడ్డు శ్వాస వ్యాయామానికే ఉదర శ్వాస వ్యాయామం అని కూడా అంటారు. దీన్ని పొట్టతో చేస్తారు. డయాఫ్రాగ్మాటిక్ శ్వాస పూర్తి ఆక్సీజన్ మార్పిడిని ప్రోత్సహిస్తుంది. ఈ రకమైన శ్వాస గుండె యొక్క స్పందనను తగ్గిస్తుంది. ఇది బిపిని కూడా కంట్రోల్ చేస్తుంది. అంతేకాదు బ్యాలెన్స్ కూడా చేస్తుంది. అంతేకాకుండా, ఉదర శ్వాస సడలింపు, ఒత్తిడి తగ్గించడంలో సహాయం చేస్తుంది. ఎలా చేయాలంటే.. మీ మోకాలు తలకింద ఒక దిండు ఉంచుకోవాలి. ఒక చేతిని పొట్టపై పెట్టుకుని, మరో చేతిని గుండె మీద పెట్టాలి. అనంతరం మీ ముక్కు ద్వారా ఊపిరి పీలుస్తూ వదులుతూ ఉండాలి. దీని ప్రభావం పొట్టపై పడేలా చూసుకోవాలి.

ఉజ్జయి ప్రాణాయామం..

ఉజ్జయి ప్రాణాయామం..

ఈ రకమైన శ్వాస వ్యాయామం చేయడం వల్ల మీకు ఏకాగ్రత మెరుగుపడుతుంది. మీ బాడీ టెంపరేచర్ ను కంట్రోల్ చేస్తుంది. దీంతో పాటు లంగ్స్ పనితీరును కూడా ప్రోత్సహిస్తుంది. ఈ వ్యాయామం ఎలా చేయాలంటే.. మీ కళ్లు మూసుకుని, వెన్నెముక తటస్థంగా ఉంచే ఏదైనా ధ్యానం యొక్క భంగిమలో నేలపై కూర్చోవాలి. తర్వాత మీ నోటి ద్వారా శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా వదలాలి. మీ లంగ్స్ నిండా గాలి పీల్చుకుని, తర్వాత నెమ్మదిగా వదలడం వంటివి చేయాలి.

కపల్ భతి ప్రాణాయామం..

కపల్ భతి ప్రాణాయామం..

దీని ప్రకారం, మీరు నెమ్మదిగా శ్వాస తీసుకుని వదలాలి. పొట్ట దగ్గర బిగపట్టి.. దీన్ని చేయాలి. మీ లంగ్స్ నుండి గాలి బయటకు వెళ్లడానికి ఇది సహాయపడుతుంది. ఏకాగ్రత స్థాయిని పెంచడానికి కూడా ఇది దోహద పడుతుంది. మీరు ఊపిరితిత్తుల కండరాలను బలోపేతం చేయడానికి ఈ రకమైన ప్రాణయామం అద్భుతమైనది. దీని ప్రకారం, మీ వెన్నెముక నిటారుగా ఉంచి కూర్చోవాలి. ముక్కు ద్వారా శ్వాస తీసుకోవాలి. మీరు ఊపిరి పీల్చుకునే సమయంలో పొట్టను వెన్నెముక వైపు బిగపట్టాలి. ఇలా ప్రతిరోజూ నిరంతరంగా పదిసార్లు చేసి.. ఆ తర్వాత నెమ్మదిగా ఊపిరి పీల్చుకోవాలి.

కోవిద్-19 నివారణకు..

కోవిద్-19 నివారణకు..

శ్వాస వ్యాయామాల వల్ల కోవిద్-19 రాకుండా ఆపలేం. కానీ మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం లేదా వ్యాక్సిన్ల వల్ల కొంత ఉపయోగం ఉంటుంది. అయితే శ్వాస వ్యాయామాల వల్ల మీ ఊపిరితిత్తులు బలోపేతం అవుతాయి. ఇది మీ శ్వాస కోశ వ్యవస్థపై కోవిద్-19 యొక్క ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఓ అధ్యయనం ప్రకారం, పెదవుల శ్వాస వంటి శ్వాస పద్ధతులు శ్వాస ఆడకపోవడాన్ని తగ్గిస్తాయని కనుగొన్నాయి. శ్వాస వాయామాల వల్ల లంగ్స్ వెంటిలేషన్ కూడా మెరుగుపడుతుందని తేలింది.

ఏరోబిక్ ఎక్సర్ సైజ్..

ఏరోబిక్ ఎక్సర్ సైజ్..

మీరు త్వరగా ఊపిరి పీల్చుకునే శక్తివంతమైన వ్యాయామం యొక్క ఏదైనా రూపం, సారాంశంలో శ్వాస వ్యాయామం. దీని వల్ల మీరు చురుకైన నడక, పరుగు, ఈత లేదా హ్రుదయ స్పందన రేటు మరియు శ్వాస రేటును పెంచే ఏదైనా కార్యాచరణను కలిగి ఉంటుంది. ఇందుకోసం మీరు క్రమం తప్పకుండా శ్వాస వ్యాయామం చేయాలి. ఇది మీ లంగ్స్ హెల్త్ కు దోహదం చేస్తుంది. ఒకవేళ మీకు కరోనా సోకినట్లయితే, ఆరోగ్యకరమైన ఊపిరితిత్తులు కోవిద్-19కు వ్యతిరేకంగా మీ ఉత్తమ రక్షణ కావచ్చు.

English summary

Best Breathing Exercises for COVID-19: Before, During, and After Infection in Telugu

Here we are talking about the best breathing exercises for COVID-19: Before, during, and after infection in telugu. Have a look
Desktop Bottom Promotion