For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తస్మాత్ జాగ్రత్త! కేరళ నుండి కమ్ముకొస్తున్న కరోనా వైరస్.. దాని నుండి ఎలా తప్పించుకోవాలంటే...

ఈ భయంకరమైన వైరస్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందుతోందనే పుకార్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే నిపా లాంటి ఘోరమైన వ్యాధి నుండి బయటపడిన మనము కరోనా నుండి కూడా కచ్చితంగా బయటపడగలం.

|

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ప్రస్తుతం భారతదేశానికి పాకింది. విదేశాల నుండి తిరిగి వస్తున్న వారిలో చాలా మందికి ఈ వ్యాధి సోకిందని తెలుస్తోంది. నిన్ననే కేరళ రాష్ట్రంలో తొలి కరోనా వైరస్ కేసు నమోదైనట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ధారించింది. అయితే అక్కడ పరిస్థితి అదుపులోనే ఉందని ఆ రాష్ట్ర మంత్రి చెప్పారు. ఇదిలా ఉండగా మన తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్నిచోట్ల ఈ కరోనా వైరస్ భూతం కలకలంపై వదంతులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.

Coronavirus Case Reported In Kerala

తాజాగా కాకినాడలో పది మందికి ఈ వైరస్ సోకిందని, నలుగురు సైతం చనిపోయారని వాట్సాప్ లోప్రచారం జరుగుతోంది. చైనా నుండి వచ్చిన విద్యార్థులకు ఈ వ్యాధి సోకినట్లు ప్రచారం జరుగుతోంది. అంతే కాదు అవనిగడ్డ, గుంటూరు జిల్లాల్లోనూ ఇలాంటి వదంతులు వినిపించాయి. అయితే ఇదంతా అవాస్తవం అని వైద్యులు చెబుతున్నారు.

Coronavirus Case Reported In Kerala

ఏది ఏమైనా కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఈ వైరస్ నుండి తప్పించుకోవచ్చని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అందుకోసం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. వాటి లక్షణాలు ఏమిటో.. ఈ వైరస్ సోకకుండా ఏమి చేయాలో తెలుసుకోవాలని సూచించింది. ఈ సందర్భంగా ఈ కరోనా వైరస్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం...

అలర్ట్! కరోనా వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే...

మార్గదర్శకాలివే..

మార్గదర్శకాలివే..

కరోనా వైరస్ గురంచి ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. అవేంటో చూడండి..

* ప్రస్తుత పరిస్థితుల్లో ఎవ్వరూ చైనా దేశానికి వెళ్లకూడదు.

* చైనాలోని భారతీయులు వారి ఆరోగ్య పరిస్థితిని తరచుగా తనిఖీ చేయాలి.

* విమానాశ్రయంలో అంబులెన్సులు అందుబాటులో ఉన్నాయి.

* 24 గంటలు వైద్యులు, నర్సులు, సిబ్బంది ఉంటారు.

* కరోనా వైరస్ సోకిన వారి కోసం ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు.

* వ్యక్తిగత రక్షణ పరికరాలు మరియు మాస్కులు సైతం సిద్ధంగా ఉన్నాయి.

మనుషుల్లోనే కాదు..

మనుషుల్లోనే కాదు..

ఈ కరోనా వైరస్ భూతం కేవలం మనుషుల్లోనే కాకుండా పశువులు మరియు ఇతర పెంపుడు జంతువుల నుండి కూడా సోకవచ్చు. ఈ వైరస్ ముందుగా జలుబుతో ప్రారంభమవుతుంది. ఇది ప్రాణాంత న్యూమోనియాగా మారే అవకాశం కూడా ఉంది. తరచూగా తుమ్ములు వస్తుంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్ ను సంప్రదించాలి.

చైనాలోని వుహాన్ లో..

చైనాలోని వుహాన్ లో..

ఈ కరోనా వైరస్ భూతం 2019లో చైనా దేశంలోని వుహన్ నగరం నుండి ఇతర దేశాలకు కూడా పాకింది. ఈ వైరస్ జంతువుల నుండి మానవులకు మరియు మనుషుల నుండి ఇతర మనుషులకు వేగంగా వ్యాపిస్తుంది. అందుకే ఈ వ్యాధి సోకిన వ్యక్తితో ఎలాంటి సంబంధాలు పెట్టుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.

<strong>డేంజర్: చికిత్స చేయకపోతే కరోనావైరస్ ప్రాణాలను తీస్తుంది..</strong>డేంజర్: చికిత్స చేయకపోతే కరోనావైరస్ ప్రాణాలను తీస్తుంది..

కరోనా వైరస్ ప్రధాన లక్షణాలు..

కరోనా వైరస్ ప్రధాన లక్షణాలు..

ఈ కరోనా వైరస్ ను గుర్తించడం మరియు వాటిని నిర్ధారించడం అనేది చాలా ముఖ్యం. ఈ వ్యాధి ప్రధాన లక్షణాలేంటో ఒకసారి చూద్దాం.

* జ్వరం (శరీర ఉష్ణోగ్రత 38 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి)

* దగ్గు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది

* కడుపులో అసౌకర్యంగా అనిపించటం

* తలనొప్పి

* తరచుగా తుమ్ములు

ఈ పనులు చేయకూడదు..

ఈ పనులు చేయకూడదు..

ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తుందో ముందుగానే తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఈ వ్యాధి సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

* ఈ వ్యాధి సోకిన వ్యక్తితో కలసి పని చేయకూడదు

* ఈ వ్యాధి సోకిన వారితో కలిసి ఒకే ఇంట్లో కూడా ఉండకూడదు

* వారి ముక్కును తాకకూడదు

* వారి నోటిని కూడా ముట్టుకోకూడదు

ఈ పనులు చేయాలి...

ఈ పనులు చేయాలి...

ఈ వ్యాధి రాకుండా ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

* సబ్బుతో లేదా మంచి నీటితో మీ చేతులను తరచుగా శుభ్రం చేసుకోవాలి.

* మీ చేతులను సుమారు 20 సెకన్ల పాటు కడిగేందుకు ప్రయత్నించాలి.

* ఉతికిన రుమాలునే వినియోగించండి.

* బట్టల వినియోగంలోనూ జాగ్రత్తలు పాటించాలి.

* కరోనా వైరస్ రోగికి సంబంధించిన వాటిని అస్సలు తాకరాదు.

* ఆ రోగి నోరు, ముక్కు, కళ్లు, చేతులు వంటి వాటికి దూరంగా ఉండాలి.

అప్రమత్తంగా ఉండండి..

అప్రమత్తంగా ఉండండి..

ఈ భయంకరమైన వైరస్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందుతోందనే పుకార్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే నిపా లాంటి ఘోరమైన వ్యాధి నుండి బయటపడిన మనము కరోనా నుండి కూడా కచ్చితంగా బయటపడగలం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే తప్పుడు ప్రచారాలపై ఆధారపడకుండా మీకు మీరే జాగ్రత్తగా ఉండండి.

బాధ్యతయుతంగా..

బాధ్యతయుతంగా..

మనం కచ్చితమైన సమాచారాన్ని మాత్రమే నమ్మాలి. బాధ్యతాయుతమైన మూలాల నుండి వచ్చిన సమాచారాన్ని మాత్రమే విశ్వసించండి. తప్పుడు ప్రచారాలను అస్సలు నమ్మవద్దు. ఎందుకంటే మన చుట్టూ ఇంకా అంత భయంకరమైన పరిస్థితులు అయితే రాలేదు. కాబట్టి ముందస్తు జాగ్రత్తలు పాటించండి. ఆనందంగా ఉండండి.

English summary

Coronavirus Case Reported In Kerala; How To Protect Yourself From Coronavirus

Coronavirus Reported in Kerala, check out the Coronavirus prevention and treatment in telugu. Read on.
Story first published:Friday, January 31, 2020, 12:21 [IST]
Desktop Bottom Promotion