For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Foods For Healthy Lungs: ఊపిరితిత్తుల ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాల్లో రోజుకు ఏదో ఒక్కటి తినండి చాలు..

|

పెరుగుతున్న పర్యావరణ కాలుష్యం మరియు ధూమపానం చేసేవారి సంఖ్య గణనీయంగా పెరిగినందున, ఊపిరితిత్తుల ఆరోగ్యం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మీరు ధూమపానం చేయకపోయినా, వివిధ కారణాల వల్ల వాయు కాలుష్యం అనేక రెట్లు పెరుగుదల ఊపిరితిత్తులకు తీవ్రమైన ముప్పుగా ఉంటుంది, ఇది తీవ్రమైన శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది. శరీరం కలుషితమైన గాలికి గురైన తర్వాత, ఆక్సిజన్‌తో పాటు చాలా విషపదార్ధాలు మరియు ఇతర హానికరమైన వాయువులను పీల్చుకుంటారు. ఇది ఊపిరితిత్తుల చుట్టూ శ్లేష్మం అభివృద్ధి చేస్తుంది, దాంతో శ్వాసలో భారము మరియు చిరాకు అనుభూతిని ఇస్తుంది. ఈ శ్లేష్మం శ్వాసకోశ ఆరోగ్యాన్ని మరింత దిగజార్చే వ్యాధికారక మరియు సూక్ష్మజీవులను పట్టుకునే అవకాశం ఉంది. ఆరోగ్యకరమైన శరీరం మరియు మంచి ఆరోగ్యం కోసం స్పష్టమైన, శ్లేష్మం లేని ఊపిరితిత్తులు మరియు వాయుమార్గాల ద్వారా ప్రారంభించబడే ఆరోగ్యకరమైన శ్వాసకోశ వ్యవస్థను కలిగి ఉండటం చాలా ముఖ్యం. కలుషితమైన గాలి మరియు టాక్సిన్స్‌కు గురికావడం వల్ల గుండె మరియు ఊపిరితిత్తులపై ఒత్తిడి పెరుగుతుంది, ఇది శరీరంలో ఆక్సిజన్ సరఫరాను మరింత ప్రభావితం చేస్తుంది, దాంతో హృదయ సంబంధ వ్యాధులు మరియు శ్వాసకోశ రుగ్మతలకు గురయ్యేలా చేస్తుంది,ఇంకా ఇది మిమ్మల్ని ఉబ్బసం, బ్రోన్కైటిస్ మరియు కొన్ని రకాల క్యాన్సర్లు కూడా గురిచేస్తుంది.

COPD, తీవ్రమైన వాయుమార్గ రుగ్మత, వృద్ధులలో మరణానికి రెండవ అత్యంత సాధారణ కారణం. గుండె జబ్బులు, ఉబ్బసం, వృద్ధులు మరియు గర్భిణీ స్త్రీలకు కాలుష్యానికి గురికాకుండా ఉండటం చాలా అవసరం. నగరంలోని ఎంత జాగ్రత్తగా నివసించేవారైనా ఇప్పటికే కాలుష్య ముసుగులు ధరించి ఉన్నారు, ఇంటి లోపలే ఉండడం మరియు ఎయిర్ ప్యూరిఫైయర్లను ఉపయోగించడం వంటి కొన్ని నివారణ చర్యలను అవలంబిస్తుండగా, గాలిలోని టాక్సిన్స్‌తో పోరాడటానికి మరొక సమర్థవంతమైన మరియు సులభమైన పద్ధతి అనుసరించవచ్చు.

Eat these foods to keep your lungs healthy,

కాలుష్యం యొక్క హానికరమైన ప్రభావాలను సమతుల్యం చేయడంలో మరియు ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడంలో ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వాస్తవానికి, మీ రోజువారీ ఆహారంలో ఈ ఆహారాలను చేర్చడం ద్వారా ఊపిరితిత్తుల నుండి టాక్సిన్స్ (విషాన్ని) ఫిల్టర్ చేయడానికి సహాయపడుతుంది. మన శరీరంలో ఊపిరితిత్తులు అత్యంత ముఖ్యమైన అవయవం. కాబ్టి వాటి రక్షించుకోవడానికి మనం చేయగలిగినదంతా చేయాలి.

ఈ వ్యాసంలో, ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచే కొన్ని ఆహార పదార్థాలను మనం చూడబోతున్నాం. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి మరియు వాయు కాలుష్యం మరియు ధూమపానం ప్రభావాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఈ ఆహారాలను ప్రతిరోజూ ఆహారంలో చేర్చుకోవాలి. మీ ఊపిరితిత్తులను సహజంగా శుభ్రపరచడంలో మీకు సహాయపడే 9 ఆహారాల జాబితా ఇక్కడ ఉంది...

గ్రీన్ టీ

గ్రీన్ టీ

ధూమపానం ద్వారా పొగ పీల్చడం వల్ల ఊపిరితిత్తులు ఇన్ఫ్లమేషన్ కు గురి కావడం చాలా సహజం. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పొగను లోపలికి పీల్చడం వల్ల ఊపిరితిత్తులు పాడకుండా కాపాడటానికి ఈ గ్రీన్ టా సహాయపడుతుంది.

 నీళ్ళు

నీళ్ళు

నీటి కంటే ఏది మంచిది? మీ శరీరం చక్కగా పనిచేయడానికి నీరు ఉత్తమ మార్గం, ఆరోగ్యానికి సంబంధించిన అన్ని సమస్యలకు ఒక నివారణ నీరు తీసుకోవడం. ఈ పర్యావరణ పరిస్థితులలో నీరు మరియు ద్రవాలు తీసుకోవడం గతంలో కంటే ఇప్పుడు చాలా అవసరం. శరీరం నుండి అన్ని విషపదార్థాలను సహజంగా బయటకు పంపబడానికి నీరు అత్యంత ప్రభావవంతమైన సాధనం. కాబట్టి రోజూ ఆరు నుంచి ఎనిమిది గ్లాసుల నీరు త్రాగాలి.

పసుపు

పసుపు

పసుపు చాలాకాలంగా వైద్యంలో ఉపయోగించబడింది. దానిలోని అన్ని ఔషధ లక్షణాలకు కారణం కర్కుమిన్. దీని యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు క్యాన్సర్‌కు వ్యతిరేకంగా ప్రభావవంతంగా ఉంటాయి, పసుపు జలుబు మరియు దగ్గుకు ప్రభావవంతమైన చికిత్స, ప్రధానంగా దాని శోథ నిరోధక లక్షణాల వల్ల. పసుపు తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులలోని మంటను తగ్గించడానికి సహాయపడుతుంది మరియు ఊపిరితిత్తుల్లో శ్లేష్మం ఏర్పడకుండా విచ్ఛిన్నం చేస్తుంది.

అల్లం

అల్లం

అల్లం చాలా నమ్మదగిన ఇంటి నివారణ. ఈ అల్లం ఉబ్బసం, జలుబు మరియు రక్తపోటును నియంత్రిస్తుంది. మీ ఊపిరితిత్తులను శుభ్రంగా ఉంచడానికి, ఊపిరితిత్తుల చుట్టూ ఏర్పడిన శ్లేష్మాన్ని విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది మరియు సులభంగా శ్వాస తీసుకోవడానికి సహాయపడుతుంది. ఇది వాయుమార్గాలు మరియు శ్వాస మార్గాలలో మంటను కూడా తగ్గిస్తుంది.

యాపిల్స్

యాపిల్స్

రోజుకు ఒక్క యాపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదు., అది నిజం చేయడానికి మరోసారి ఈ లిస్ట్ లోనికి వచ్చింది. ఆపిల్‌లో విటమిన్ సి, ఇ, బీటా కెరోటిన్, యాంటీ-ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉన్న యాపిల్ ను మీ ఆహారంలో చేర్చడం గతంలో కంటే ఇప్పుడు చాలా అవసరం, ఎందుకంటే ఇది ఊపిరితిత్తుల వాపును తగ్గించడంలో సహాయపడుతుంది మరియు ఇతర హృదయ సంబంధ వ్యాధులను కూడా దూరంగా ఉంచుతుంది.

టమోటోలు

టమోటోలు

టమోటోలు మన రోజువారీ ఆహారాల్లో తప్పనిసరిగా ఉపయోగించే కూరగాయ, అంతే కాదు, ఇది ఊపిరితిత్తుల ఆరోగ్యానికి గొప్పది, ఎందుకంటే వీటిలో ఉండే అనేక అంశాలు ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. టొమాటాలు శ్వాసకోశ వాయుమార్గాలలో శుభ్రం చేయడానికి కూడా సహాయపడుతుంది, తద్వారా, ఉబ్బసం మరియు ఇతర శ్వాసకోశ రుగ్మతలు వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

బెల్లం

బెల్లం

గాలిలో ఉన్న విషవాయువులను విషపదార్థాలను ఎదుర్కోవటానికి బెల్లం యుగయుగాలుగా ఉపయోగిస్తున్నారు. ప్రమాదకర పరిశ్రమలలో పనిచేసే వారికి అక్కడ వాతావరణంలో కాలుష్యాన్ని ఎదుర్కోవడం కోసమని ప్రతి రోజూ వారికి కొద్దిగా బెల్లం ఇస్తుంటారు. దాని వల్ల శ్వాసలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ రోజుల్లో కేవలం పరిశ్రమల వల్లే కాదు ఇతర కారణాల వల్ల కూడా కాలుష్యం బాగా పెరిగిపోతున్నది కాబట్టి, ప్రతి రోజూ కొద్దిగా బెల్లం తినడం మంచిది. కాబట్టి, ప్రతిరోజూ బెల్లం తినడం వల్ల శరీరంలో ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది మరియు గాలిలోని కాలుష్య కారకాలు వల్ల కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చు.

తులసి

తులసి

బాసిల్ లేదా తులసిని ‘మూలికల్లో రాణి’గ అని మరియు ‘వండర్ హెర్బ్’గఅని కూడా పిలుస్తారు. తులసి మొక్క గాలిని శుద్ధి చేస్తుంది మరియు దానిని విష రహితంగా చేస్తుంది. అలా కాకుండా, తులసిలో యాంటీఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ పుష్కలంగా ఉన్నాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి మరియు పొగ వల్ల ఊపిరితిత్తులకు కలిగే నష్టాన్ని తగ్గించడానికి అద్భుతంగా పని చేస్తాయి. తులసి వాయుమార్గాలు మరియు ఊపిరితిత్తులలో రద్దీ మరియు అడ్డంకులను తగ్గించడం ద్వారా శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

English summary

Eat these foods to keep your lungs healthy

Diet plays an important role in balancing the harmful effects of pollution and keeping the lungs healthy and fit. In fact, including these foods in your daily diet can help in filtering out the toxins from the lungs. Lungs form the centre of our respiratory systems and as the air quality index rises at an alarming rate. We must do everything we can do to protect the essential organ. Here's a list of 7 foods that will help you cleanse your lungs naturally.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more