For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గజగజ వణికిస్తోన్నచలి: ఈ చలికాలంలో హైపోథర్మియాతో జర జాగ్రత్త ! నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం

|

దేశంలో చలి తీవ్రత అధికంగా ఉంది. అలాగే మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర తెలంగాణలో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంది. అత్యల్ప ఉష్ణోగ్రతలు 10 నుండి 12కి పడిపోయాయి. చలికాలంలో పగలు ఉష్ణోగ్రతల కంటే రాత్రి ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోవడం వల్ల శరీర ఉష్ణోగ్రతలు కూడా తగ్గిపోతాయి. పగలు కఠిమనమైన శీతల గాలులు వీస్తుంటే, రాత్రి గడగడ వణికించే పరిస్థితి. ఇది తెలుగు రాష్ట్రాల పరిస్థితులు.

Extrem Cold in AP and Telangana: Know Hypothermia symptoms, causes and prevention in telugu

ఈ చలికాలంలో డిసెంబర్ లో కంటే జనవరిలో చలి తీవ్రత అధికమైంది. గజగజ వణికించే చలితో పాటు, మంచు కూడా కురుస్తోంది.దాంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు . ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఈ పరిస్థితిలో ఎవరైనా బయటకు వెళ్లే వారు అల్పోష్ణస్థితికి (హైపోథర్మియా)కు గురుఅవుతారు. దాంతో శరీర ఉష్ణోగ్రత హానికర స్థాయికి చేరుకుంటే అల్పోష్ణస్థితిగా (హైపోథర్మియా)గా పేర్కొంటారు. దీనికి గురైన వ్యక్తులు ఎక్కువ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ఈ పరిస్థితి తీవ్రమైతే ప్రాణాలకు ప్రమాదం. హైపోథర్మియాకు గురైన వారిలో కనిపించే లక్షణాలు ఈ క్రింది విధంగా ఉంటాయి.

హైపోథర్మియా లక్షణాలు

హైపోథర్మియా లక్షణాలు

1. వణుకు

2. అమోమయం

3. మాట్లాడడంలో ఇబ్బంది

4. మగత

5. కండరాలు పట్టేయడం

పసికందులు, పిల్లల్లో ఇవీ లక్షణాలు..

పసికందులు, పిల్లల్లో ఇవీ లక్షణాలు..

1. శరీర ఉష్ణోగ్రత 97.5 ఫారెన్‌హీట్ కంటే తక్కువకు పడిపోవడం.

2. సాధారణంగా భిన్నంగా ఏడవడం

3. బద్ధకం

4. శరీరంపై ఎర్రటి దద్దుర్లు, వాపు

5. శ్వాస తీసుకోవడం ఇబ్బందులు

6. తినలేకపోవడం, తాగలేకపోవడం .

నివారణ మార్గాలివే..

నివారణ మార్గాలివే..

1. ఇంటి వెలుపల అతిశీతల వాతావరణంలో ఎక్కువ సమయం గడపొద్దు. ఒకవేళ బయటకు వెళ్లినా ఎక్కువసేపు ఉండకపోవడం మంచిది.

2. తక్కువగా బరువుతో వదులుగా, వేడిగా ఉంచే దుస్తులు ధరించాలి. శరీరాన్ని బాగా కవర్ చేయండి. ముఖ్యంగా చెవులు, మెడ .. చేతులు .. కాళ్ళు.. వాతావరణానికి బహిర్గతం కాకుండా చూసుకోండి.

3. బ్లడ్ సర్క్యూలేషన్‌ను తగ్గించే అవకాశమున్న బిగుసు దుస్తులు ధరించ వద్దు.

4. అధిక చెమటను కలిగించే కార్యకలాపాలను చేయకుండా ఉండండి, దీని కారణంగా శరీర ఉష్ణోగ్రత పడిపోతుంది.

5. చెవులు, ముఖం, చేతులు, పాదాలను రక్షించుకోండి. హ్యాట్, గ్లోవ్స్, బూట్లు ధరించి రక్షణ పొందొచ్చు.

 నివారణ మార్గాలు

నివారణ మార్గాలు

6. విపరీతమైన చలి నుంచి ఊపిరితిత్తుల రక్షణ కోసం ముఖాన్ని కవర్ చేసుకోవాలి

7. ద్రవ పదార్థాలు ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. నాన్-ఆల్కాహాల్, కేఫిన్ రహిత ద్రవపదార్థాలు తాగాలి.

8. శీతాకాలంలో తేలికపాటి.. బహుళ లేయర్డ్ దుస్తులను ధరించండి. ఇవి గాలి నేరుగా శరీరంలోకి చేరకుండా నిరోధించే విధంగా ఉండాలి.

9. ఆహారంలో సూప్, టీ.. ముతక తృణధాన్యాలు తినండి. అవి శరీరానికి వెచ్చదనాన్ని తెస్తాయి.. చలి ప్రభావాన్ని తగ్గిస్తాయి.

10.శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే తేనె, అల్లం, పసుపు, తులసి .. బెల్లం వంటి వాటిని మీ ఆహారంలో చేర్చుకోండి.

English summary

Extrem Cold in AP and Telangana: Know Hypothermia symptoms, causes and prevention in telugu

Extrem Cold in AP and Telangana: Know Hypothermia symptoms, causes and prevention in telugu
Desktop Bottom Promotion