For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లావాటి పర్సును వెనక జేబులో పెట్టుకుంటున్నారా? వెంటనే ఆ అలవాటు మానుకోండి

ఫ్యాట్ వాలెట్ సిండ్రోమ్‌ను వాలెట్ సయాటికా, పిరిఫార్మిస్ సిండ్రోమ్, వంటి పేర్లతో పిలుస్తారు. వాలెట్ ను వెనక జేబులో పెట్టుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి. ఆ సమస్యలను ఎలా నివారించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

|

డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, కరెన్సీ నోట్లు, కాగితాలు, చిల్లర, పాస్‌పోర్టు ఫోటోలు ఇలా అవసరమున్నా లేకపోయినా ఎన్నింటినో వాలెట్‌లో పెట్టేసే.. ఆ లావాటి వాలెట్‌ను వెనక జేబులో పెట్టుకుంటారు. ఆ పర్సును ప్రయాణించేటప్పుడు, ఆఫీసుల్లో గంటల కొద్దీ కూర్చుని పని చేస్తున్నప్పుడు కూడా అలాగే పెట్టుకుంటారు. ఇలా లావుపాటి పర్సును వెనక జేబులో పెట్టుకుని గంటల తరబడి కూర్చోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. బ్యాక్ పెయిన్, పిరుదుల్లో నొప్పి, మోకాలు, అరికాళ్ల నొప్పి, తిమ్మిరి లాంటి సమస్యలు వస్తాయి. దీనినే ఫ్యాట్ వాలెట్ సిండ్రోమ్ అంటారు.

Fat wallet syndrome symptoms and remedies in Telugu

ఫ్యాట్ వాలెట్ సిండ్రోమ్‌ను వాలెట్ సయాటికా, పిరిఫార్మిస్ సిండ్రోమ్, వంటి పేర్లతో పిలుస్తారు. వాలెట్ ను వెనక జేబులో పెట్టుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి. ఆ సమస్యలను ఎలా నివారించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్యాట్ వాలెట్ సిండ్రోమ్ అంటే ఏంటి?

ఫ్యాట్ వాలెట్ సిండ్రోమ్ అంటే ఏంటి?

లావుపాటి వాలెట్ వెనక జేబులో పెట్టుకోవడం వల్ల నాడీ కండరాల స్థితి, వాలెట్ తుండి అనగా తొడ వెనక భాగంలో నరాలు, పిరిఫార్మిస్ కండరాలకు కుదించుకుపోతాయి. వాలెట్ పెల్విస్‌లో బరువులో అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది దీర్ఘకాలంలో పిరిఫార్మిస్ కండరాలకు ఒత్తిడి కలిగిస్తుంది. అలా సయాటిక్ నరాలు కుదించుకుపోతాయి.

ఫ్యాట్ వాలెట్ సిండ్రోమ్ లక్షణాలు:

ఫ్యాట్ వాలెట్ సిండ్రోమ్ లక్షణాలు:

  • కూర్చోవడం లేదా డ్రైవింగ్ చేసేటప్పుడు నొప్పు
  • కాలు మీద సూదులు గుచ్చినట్లుగా నొప్పు
  • కాలులో సెన్సేషన్
  • పాదంలో తిమ్మిరి
  • నడవడంలో ఇబ్బంది
  • ఫ్యాట్ వాలెట్ సిండ్రోమ్ చికిత్స:

    ఫ్యాట్ వాలెట్ సిండ్రోమ్ చికిత్స:

    లక్షణాలు మొదలయ్యాక వైద్యులను సంప్రదించాలి. పూర్తి తనిఖీ తర్వాత అసలు కారణం ఏమిటో వైద్యులు తేలుస్తారు. అయితే మీరు లావుపాటి వాలెట్ వాడుతున్నట్లయితే దానిని తొలగించడం నుండి చికిత్స ప్రారంభించాలి. లావాటి వాలెట్ తప్పనిసరిగా వెంటే ఉంచుకోవాల్సి వస్తే మాత్రం ముందు జేబులో, నడుముకు వేలాడదీసుకునే చిన్న పాకెట్‌లో వాలెట్ పెట్టుకోండి.

    నొప్పి ఇబ్బంది పెడుతుంటే పెయిన్ కిల్లర్స్ వాడొచ్చు. అయితే పెయిన్ కిల్లర్స్ చాలా మంది వైద్యుల సూచన లేకుండానే వాడుతుంటారు. అలా వాడే వారు వాటిని 2 లేదా 3 రోజుల కంటే ఎక్కువ రోజులు వాడకూడదు. 3 రోజుల దాటినా నొప్పి బాధిస్తుంటే డాక్టర్ ను సంప్రదించాలి.

    వాలెట్‌ను వీలైనంత వరకు వాడకపోవడం మంచిది. క్రెడిట్ కార్డుల సంఖ్యను తగ్గించాలి. డెబిట్ కార్డులకు బదులు యూపీఐ, ఆన్‌లైన్ పేమెంట్స్ చేయండి, కాగితాలను ఫోనులో ఫోటో తీసి పెట్టుకోండి. ఇతర వివరాలను ఫోనులో నమోదు చేసుకోండి. దీని వల్ల వాలెట్‌ల ఉపయోగాన్ని చాలా వరకు తగ్గించవచ్చు.

    మరిన్ని సూచనలు:

    మరిన్ని సూచనలు:

    • మీది కూర్చుని చేసే ఉద్యోగం అయితే గంట గంటలకు పైకి లేచి కొద్ది సేపు అటు ఇటూ నడవడం అలవాటు చేసుకోవాలి.
    • ఎక్కువ సేపు ఒకే భంగిమలో కూర్చోవద్దు.
    • ఎక్కువగా నీరు తాగాలి.
    • కూర్చునే సమయంలో వెనక జేబులో ఉండే వాలెట్, కర్చీఫ్ లాంటివి తీసేసి కూర్చోవాలి.
    • కూర్చునే చేసే వ్యాయామాలు సాధన చేయాలి.
    • క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
    • మంచి ఆహారపు అలవాట్లు చేసుకోవాలి.

English summary

Fat wallet syndrome symptoms and remedies in Telugu

read this to know Fat wallet syndrome symptoms and remedies in Telugu
Story first published:Wednesday, January 25, 2023, 13:45 [IST]
Desktop Bottom Promotion