For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హీమోగ్లోబిన్ తక్కువైతే ప్రమాదమే..కార్డియాక్ అరెస్ట్ కు కారణం అవుతుంది. కాబట్టి, ఈ ఆహారాలు తినండి..

హీమోగ్లోబిన్ తక్కువైతే ప్రమాదమే..కార్డియాక్ అరెస్ట్ కు కారణం అవుతుంది. కాబట్టి, ఈ ఆహారాలు తినండి..

|

హిమోగ్లోబిన్ అనేది మన శరీరంలో ఎర్ర రక్త కణాలలో ఉండే ప్రోటీన్ . ఇది మన శరీరంలోని అవయవాలకు మరియు కణజాలాలకు ఆక్సిజన్ ను సరఫరా చేస్తుంది. కాబట్టి, రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి గురించి మనందరికీ తెలుసు. ఇది మన శరీరంలోని అవయవాలు మరియు కణజాలాల నుండి మీ ఊపిరితిత్తులకు తిరిగి కార్బన్ డయాక్సైడ్ ను రవాణా చేస్తుంది. అయితే ఇది శరీరంలో తగ్గిపోయినప్పుడు మీకు కలిగే ప్రమాదాల గురించి చాలా మందికి తెలియదు. హిమోగ్లోబిన్ స్థాయి సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉన్నప్పుడు, అది చాలా ప్రమాదకరమైన పరిస్థితిని కలిగిస్తుంది. మీ హిమోగ్లోబిన్ స్థాయి సాధారణం కంటే తక్కువగా ఉందని హిమోగ్లోబిన్ పరీక్ష వెల్లడి చేస్తే, మీకు ఎర్ర రక్త కణాల సంఖ్య (రక్తహీనత) తక్కువగా ఉందని అర్థం. ఫలితంగా రక్తహీనత వంటి సమస్యలు పెరుగుతాయి. ఇది శరీరంలో ఇది తగినంతగా లేని వ్యక్తులు తరచుగా అలసట మరియు మైకముతో బాధపడుతుంటారు.

iron rich foods that can help you to boost hemoglobin levels in telugu

మీకు రక్తహీనత ఉంటే, అది శరీరంలోని అవయవాలన్నింటికి రక్త ప్రసరణను తగ్గిస్తుంది. ఫలితంగా, ఆక్సిజన్ స్థాయిలు కూడా తగ్గుతాయి. ఇది తరచుగా మీ గుండె, కాలేయం మరియు మూత్రపిండాల అవయవాలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఈ సమస్య సాధారణ మహిళలలు మరియు గర్భిణీ స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది. కానీ మీ శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు కొన్ని ఆహారాలను మన రోజువారి ఆహారంలో చేర్చుకోవాలి. అవి ఏంటో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ చూద్దాం.

నువ్వులు

నువ్వులు

నువ్వులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. నువ్వుల్లో పోషకాంశాలు ఎక్కువ వాటిలో ఐరన్, కాపర్, జింక్, సెలీనియం, విటమిన్లు బి6, విటమిన్ ఇ మరియు ఫోలేట్ పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల, మీ రోజువారీ ఆహారంలో నల్ల నువ్వులను చేర్చుకోవడం వల్ల మీ శరీరంలో హిమోగ్లోబిన్ పరిమాణం పెరుగుతుంది మరియు శరీరంలో ఇనుము శోషణను ప్రోత్సహిస్తుంది. 1 టేబుల్ స్పూన్ నల్ల నువ్వులను వేయించి కొద్దిగా తేనెతో లేదా బెల్లం కలుపుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఐరన్ లెవల్స్ పెంచడంలో సహాయపడుతుంది. దాంతో శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.

మొలకెత్తిన శెనగలు

మొలకెత్తిన శెనగలు

మన ఆరోగ్య సంరక్షణ విషయంలో శెనగలు పాత్ర తక్కువేమీ కాదు. ఇది మీ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ మొత్తాన్ని పెంచడానికి కూడా సహాయపడుతుంది. దాని కోసం మీరు మొలకెత్తిన శెనగలను సలాడ్‌ చేసి తినవచ్చు. స్నాక్స్ రూపంలో మీరు ఎప్పుడైనా ఈ సలాడ్ తినవచ్చు. కూరల్లో వాడవచ్చు. మొలకెత్తినవి తినవచ్చు. ఇందులో ప్రోటీన్ మరియు కార్బోహైడ్రేట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. నిత్యం తినే వారు జాగ్రత్తగా ఉండాలి. పొట్టు ఉన్న గింజలు గ్యాస్ కు కారణం అవుతుంది. ఇంకా చిన్నపాటి జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.

ఎండుద్రాక్ష మరియు ఎండు ఖర్జూరాలు

ఎండుద్రాక్ష మరియు ఎండు ఖర్జూరాలు

ఆరోగ్యపరంగా ఈ రెండూ ముందుంటాయి. ఎండుద్రాక్ష మరియు ఖర్జూరంలో ఐరన్, మెగ్నీషియం, కాపర్, విటమిన్ ఎ మరియు సి పుష్కలంగా ఉంటాయి, ఇవి మన శరీరంలో హిమోగ్లోబిన్ స్తాయిలను పెంచుతాయి మరియు మీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఎండుద్రాక్ష మరియు ఖర్జూరం శరీరంలోకి ఐరన్ శోషణకు చాలా సహాయపడుతుంది. కాబట్టి, మీరు రోజుకు 3 నుండి 5 ఖర్జూరాలు మరియు ఒక టీస్పూన్ ఎండుద్రాక్షను రోజూ తినవచ్చు. నీటిలో నానబెట్టిన ఎండుద్రాక్షను రోజూ ఉదయాన్నే తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. ఇది మీ హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ రెండు డ్రై ఫ్రూట్స్ అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో సహాయపడతాయి.

బీట్‌రూట్

బీట్‌రూట్

బీట్‌రూట్ చాలా మందికి ఇష్టమైనది. కానీ కొందరికి నచ్చకపోవచ్చు. అయితే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న కూరగాయ మరొకటి లేదని చెప్పొచ్చు. బీట్‌రూట్‌లో ఐరన్, కాపర్, ఫాస్పరస్, మెగ్నీషియం మరియు విటమిన్లు బి1, బి2, బి6, బి12 మరియు సి పుష్కలంగా ఉన్నాయి. బీట్‌రూట్ ను రెగ్యులర్ గా తింటుంటే మీ శరీరంలో ఎర్ర రక్త కణాల (RBC) ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది. మీ రోజువారి ఆహారంలో దుంపలను వివిధ రకాలుగా చేర్చవచ్చు. అందులో సలాడ్‌గా, కూరలో లేదా బీట్ రూట్ హల్వా ఇలా మీకు నచ్చిన విధంగా ఉపయోగించవచ్చు. లేదా బీట్‌రూట్ జ్యూస్‌ని తయారు చేసి రోజూ తాగవచ్చు. ఇది అనేక ఆరోగ్య సమస్యలను పరిష్కరిచడానికి మీ శరీరంలో హిమోగ్లోబిన్ మొత్తాన్ని పెంచడంలో కూడా సహాయపడుతుంది.

మునగ ఆకులు

మునగ ఆకులు

మునగ ఆకులు చాలా మందికి ఇష్టమైన ఆహారం. అయితే ఇది మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో చాలా మందికి తెలియదు. కానీ మునగ ఆకులు మన ఆరోగ్యానికి మాత్రమే కాకుండా హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో కూడా సహాయపడతాయి. మునగ ఆకులలో విటమిన్ ఎ, సి, మెగ్నీషియం మరియు ఐరన్ కూడా మంచి మొత్తంలో ఉంటాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో 1 టీస్పూన్ మునగ ఆకుల రసాన్నితీసుకోవాలని కూడా సిఫార్సు చేయబడింది. ఇది కాకుండా మీరు రోజూ మునగాకును ఏదో ఒక రూపంలో తీసుకోవచ్చు. ఇవన్నీ శరీరంలోఐరన్ శోషణకు సహాయపడతాయి మరియు హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతాయి.

English summary

Iron Rich Foods That Can Help You To Boost Hemoglobin Levels in Telugu

Here in this article we are sharing the iron rich foos that can help you to boost your low hemoglobin level in telugu. Take a look.
Story first published:Monday, January 30, 2023, 18:30 [IST]
Desktop Bottom Promotion