For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Memory Boosters: వీటిని తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.. వీటిని తింటే ఉన్నది దొబ్బుతుంది

మనం మన మెదడు పట్ల శ్రద్ధ వహిస్తూ, కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను పాటిస్తూ, రోజూవారి వ్యాయామాలను అనుసరించడం ద్వారా జ్ఞాపక శక్తిని మెరుగుపరుచుకోవచ్చు.

|

Memory Boosters: చాలా మంది తమకు జ్ఞాపక శక్తి తక్కువ అవుతోందని, చిన్న చిన్న విషయాలు కూడా గుర్తుంచుకోలేక పోతున్నామని చెబుతుంటారు. ముఖ్యంగా పిల్లల్లో తాము చదివింది గుర్తుండటం లేదని వాపోతుంటారు.

Memory-boosting and influencing foods in Telugu

మనం మన మెదడు పట్ల శ్రద్ధ వహిస్తూ, కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను పాటిస్తూ, రోజూవారి వ్యాయామాలను అనుసరించడం ద్వారా జ్ఞాపక శక్తిని మెరుగుపరుచుకోవచ్చు.

జ్ఞాపకశక్తులు మూడు రకాలు:

జ్ఞాపకశక్తులు మూడు రకాలు:

మనుషులు కొన్ని విషయాలు ఎప్పటికీ మరచిపోలేరు. కొన్ని విషయాలను కొన్ని రోజుల తర్వాత మర్చిపోతుంటారు. మరికొన్నింటిని 10 నిమిషాల లోపే మర్చిపోతుంటాం. అందుకే నిపుణులు జ్ఞాపక శక్తిని మూడు రకాలుగా విభజించారు.

1. షార్ట్‌టర్మ్ మెమరీ

2. వర్కింగ్ మెమరీ

3. లాంగ్ టర్మ్ మెమరీ

షార్ట్‌టర్మ్‌ మెమరీ:

కొంత సమయం వరకే గుర్తుండే విషయాలు షార్ట్ టర్మ్ మెమరీ కిందకు వస్తాయి. ఫోన్‌కు ఓటీపీ వచ్చిందనుకోండి. దానిలో ఉండే సంఖ్యలను కాసేపటి వరకు గుర్తుంచుకుంటాం. కానీ తర్వాత ఆ సంఖ్యను గుర్తుకుతెచ్చుకోవడానికి ట్రై చేసినా గుర్తుకురావు.

వర్కింగ్ మెమరీ:

వర్కింగ్ మెమరీ ఏదైనా పనిలో మనం నిమగ్నం అయినప్పుడు వాడే జ్ఞాపక శక్తి. మాట్లాడటం, రాయడం, వేరే పనులు చేస్తున్న సమయంలో గుర్తుకు తెచ్చుకునే సమాచారం అన్నమాట.

లాంగ్ టర్మ్ మెమరీ:

పేరులో ఉన్నట్లుగానే కొన్ని విషయాలను సుదీర్ఘ కాలం పాటు గుర్తు పెట్టుకుంటాం. బాల్యంలో జరిగిన కొన్ని విషయాలు ఎప్పటికీ గుర్తుండి పోతాయి. చిన్నప్పుడు జరిగిన కొన్ని సంఘటనలు మన మెదళ్ల నుండి ఏమాత్రం చెదిరిపోవు.

ఈ ఆహారపదార్థాల తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది

ఈ ఆహారపదార్థాల తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది

1. అవొకాడో

అవొకాడోలో మెదడులోని రక్తం గడ్డ కట్టడాన్ని నివారించే పోషకాలు ఉంటాయి. అవొకాడోలని విటమిన్-కె ఎక్కువగా ఉంటుంది. ఫోలేట్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఈ పోషకాలు మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి.

2. బ్లూబెర్రీస్

2. బ్లూబెర్రీస్

బెర్రీస్ లో ఆమ్లజనకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరచడంలో సాయపడతాయి. మెదడు కణాల వాపు తగ్గించడానికి బెర్రీస్ చక్కగా సహాయపడతాయి.

3. గుడ్లు

3. గుడ్లు

గుడ్లలోని కొలైన్ న్యూరో ట్రాన్స్మిటర్లకు చాలా అవసరం. పాస్పోలిపిడ్స్ గుడ్డులో అధికంగా ఉంటాయి. ఇవి మెదడుకు, నాడీ వ్యవస్థకు చాలా అవసరం.

4. వాల్‌నట్స్

4. వాల్‌నట్స్

జ్ఞాపక శక్తి మెరుగు పడేందుకు వాల్‌నట్స్ తినాలని చాలా మంది చెబుతూనే ఉంటారు. ఇందులోని ఒమేగా-౩ ఫ్యాటీ యాసిడ్స్ మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచడానికి, చురుకుగా పని చేయడానికి సహాయపడతాయి. అలాగే న్యూరాన్ల మధ్య సమాచారం వేగంగా వెళ్లేలా ఉపయోగపడతాయి. వాల్‌నట్స్‌లో మాంగనీస్, ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది.

5. రెడ్‌వైన్‌

5. రెడ్‌వైన్‌

మెదడుకు రక్త ప్రసరణను మెరుగుపరిచే పాలిఫెనోల్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. మెదడు షార్ప్‌గా పనిచేసేందుకు రెడ్ వైన్‌లోని పోషకాలు పని చేస్తాయి.

6. డైరీ ప్రొడక్ట్స్

6. డైరీ ప్రొడక్ట్స్

పాల ఉత్పత్తుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. కాల్షియం ఎక్కువగా ఉండే పాలు, పాల పదార్థాలు తినడం వల్ల మెదడు కణపోషణకు చాలా బాగా సహాయపడతాయి. ప్రత్యేకంగా పెరుగులో ఉండే అమైనో యాసిడ్స్ మెదడుకు ఎంతో ఉపయోగపడతాయి. ఇవి మెమరీ పెంచడానికి సహకరిస్తాయి.

ప్రాసెస్డ్ ఫుడ్:

ప్రాసెస్డ్ ఫుడ్:

ఎక్కువ కాలం నిల్వ ఉంచిన ఆహారాలను తీసుకుంటే జ్ఞాపక శక్తి తగ్గుతుందని పలు అధ్యయనాల్లో తేలింది. ప్రాసెస్డ్ ఫుడ్ మెమరీ శక్తి మీద ప్రతికూల ప్రభావం చూపుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. జంక్ ఫుడ్, ప్రాసెస్డ్, ఆల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల జ్ఞాపకశక్తిలో సమస్యలు వస్తాయి. అలాగే ఆకలి మీద కూడా నియంత్రణ ఉండదు.

శుద్ధి చేసిన ఆహారాలు, చక్కెరలు ఎక్కువగానూ, పండ్లు, కూరగాయలు, ఫైబర్ తక్కువ తీసుకుంటే అల్జీమర్స్ వంటి నాడీ క్షీణత జబ్బుల ప్రమాదం పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

English summary

Memory-boosting and influencing foods in Telugu

read on to know Memory-boosting and influencing foods in Telugu
Story first published:Tuesday, December 6, 2022, 13:00 [IST]
Desktop Bottom Promotion