For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

World Heart Day 2021: మీ గుండె బలహీనంగా ఉందని తెలిపే సంకేతాలివే...

|

మన గుండె పదిలంగా ఉందా లేదా అనే విషయాన్ని మనం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. అయితే గుండెకు సంబంధించి ఏదైనా సమస్య కలిగినప్పుడు తెలుసుకోవడం ఎలా? ఎందుకంటే హార్ట్ హెల్త్ కు సంబంధించిన సంకేతాలు అంత సులభంగా బయటపడవు.

అంతేకాదు ఎల్లప్పుడూ గుండె నొప్పి ప్రమాదకరంగా కూడా ఉండదు. అయితే సినిమాల్లో మాత్రం హార్ట్ ఎటాక్ వచ్చినా.. హార్ట్ సంబంధించిన ఏదైనా పెయిన్ వచ్చినా మనుషులు వెంటనే కింద పడిపోతారు. అలాంటి గుండె సమస్యలకు సంబంధించిన లక్షణాలు సులభంగా కనిపించవు.

ఈ నేపథ్యంలో మీ హార్ట్ హెల్దీగా లేదనేందుకు కొన్నిసంకేతాలు ఉన్నాయని.. వాటిని పెన్ స్టేట్ హెర్షీ హార్ట్ మరియు వాస్కులర్ ఇన్ స్టిట్యూట్ లోని కార్డియాక్ కాథెటరైజేషన్ లాబొరేటరీ డైరెక్టర్ చార్లెస్ ఛాంబర్స్ మాట్లాడుతూ 'మీ గుండెకు సంబంధించిన పరిస్థితుల గురించి మీకు ఏమి తెలియకపోతే వీటిని ఒకసారి పరిశీలించమని' సూచించారు. ప్రత్యేకించి 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారు, అధిక బరువు లేదా షుగర్, హై బిపి, ఎక్కువ కొవ్వుతో బాధపడుతుంటే మీరు మీ హార్ట్ హెల్త్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా మీ గుండె బలహీనంగా ఉందని తెలిపే కొన్ని లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

World Heart Day 2021 : గుండెపోటు రాకుండా ఉండాలంటే గుడ్లు తినాలంట...!

గురక..

గురక..

మనలో చాలా మంది నిద్ర పోతున్నప్పుడు గురక పెట్టడం చాలా సహజం. అయితే మీరు అసాధారణంగా పెద్దగా గురక పెట్టడం, ఊపిరి ఆడటంలో సమస్యలు లేదా ఊపిరి సరిగా ఆడకపోవడం అనేది స్లీప్ అప్నియాకు సంకేతం. ఆ సమయంలో మీరు నిద్రిస్తున్నప్పుడు కొన్ని క్షణాల పాటు శ్వాస తీసుకోవడం ఆపేస్తారు. ఇది మీ గుండెపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. మీకు కూడా ఇలాంటివి జరిగితే, మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

అప్పుడు మీరు హాయిగా నిద్రపోయేందుకు, మీ శ్వాసను సున్నితంగా చేయడానికి మీకు CPAP యంత్రం అవసరం కావొచ్చు.

చెమట రావడం..

చెమట రావడం..

మనలో కొందరికి ఉక్కపోత లేకపోయినప్పటికీ.. బాడీలో నుండి చెమట బయటకు వచ్చేస్తుంది. ముఖ్యంగా చల్లని వాతావరణంలోనూ స్పష్టమైన కారణం లేకుండా చెమట బయటకు వస్తే.. అది మీ గుండె పోటు రావడానికి సంకేతం. ఇలాంటి లక్షణాలు మీకు ఎప్పుడైనా కనిపిస్తే.. వెంటనే ఆసుపత్రికి వెళ్లడానికి 102 లేదా 108కి కాల్ చేయండి. వారు మీకు సహాయపడొచ్చు.

నిరంతరం దగ్గు..

నిరంతరం దగ్గు..

చాలా సందర్భాల్లో మీ గుండె సమస్యకు ఇది సంకేతం కాదు. అయితే మీకు గుండెకు సంబంధించిన జబ్బులు లేదా గుండెకు సంబంధించిన ఏదైనా ప్రమాదం ఉందని తెలిస్తే, దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.మీరు దగ్గే సమయంలో తెలుపు లేదా గులాబీ రంగులో శ్లేష్మం ఉత్పత్తి అయితే అది మీ గుండె బలహీనతను సూచిస్తుంది. మీ హార్ట్ బాడీ అవసరాలను తీర్చలేనప్పుడు ఇది సంభవిస్తుంది. దీని వల్ల రక్తం ఊపిరితిత్తుల్లోకి తిరిగి ప్రవహిస్తుంది. కాబట్టి ఆలస్యం చేయకండి. మీ దగ్గుకు వాస్తవ కారణమెంటో వైద్యుడిని అడిగి తెలుసుకోండి.

ఈ చిన్న మార్పులతో గుండె పోటు వచ్చే అవకాశం ఉండదు...

గుండె స్పందన..

గుండె స్పందన..

మీ నాడీ లేదా మీరు ఉత్సాహంగా ఉన్నప్పుడు మీ గుండె స్పందన అప్పుడప్పుడు పెరుగుతున్నప్పుడు లేదా తగ్గినప్పుడు మీ గుండె కొంత వేగంగా కొట్టుకోవడం సహజం. అయితే మీ గుండె కొన్ని సెకన్ల కన్నా ఎక్కువగా కొట్టుకుందని మీకు అనిపిస్తే లేదా అది తరచుగా జరిగితే మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

ఎడమ చేతి నొప్పి..

ఎడమ చేతి నొప్పి..

హార్ట్ ఎటాక్ కు సంబంధించిన మరో ముఖ్యమైన లక్షణం ఏంటంటే.. మీ ఎడమ చేయి తరచుగా నొప్పి వేస్తుంటే.. ఈ చేతుల నొప్పి ఛాతీ నొప్పి వరకు వ్యాపించడం కూడా గుండె బలహీనంగా ఉందని సూచించే సంకేతాల్లో ఒకటి.

పాదాలు, కాళ్ల వాపు..

పాదాలు, కాళ్ల వాపు..

మీ గుండె రక్తాన్ని సరిగ్గా ప్రసరణ చేయడం లేదని తెలిపే సంకేతం ఇది. మీ గుండెకు తగినంత వేగంగా రక్తం సరఫరా కాలేనప్పుడు, రక్తం సిరల్లోకి తిరిగొచ్చి వాపునకు గురవుతుంది. గుండె బలహీనంగా ఉండటం వల్ల మూత్రపిండాలు శరీరం నుండి అదనపు నీరు మరియు సోడియంను తొలగించడం కష్టతరం అవుతుంది. దీని వల్ల మీ పాదాలు మరియు కాళ్లు వాపునకు దారి తీస్తాయి.

వరల్డ్ హార్ట్ డే ఎప్పుడు జరుపుకుంటారు?

ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 29వ తేదీన వరల్డ్ హార్ట్ డే జరుపుకుంటారు.

English summary

Most Common Signs of an Unhealthy Heart in Telugu

Let’s discuss the signs of an unhealthy heart so we can learn to spot them.
Story first published: Wednesday, September 29, 2021, 11:38 [IST]