For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చలికాలంలో జామపండ్లు తప్పనిసరిగా ఎందుకు తినాలో తెలుసా?

|

యాపిల్ కంటే ఎక్కువ పోషకాలు కలిగిన పండు జామ పండు. ఒక జామ పండులో 9 యాపిల్స్‌తో సమానమైన పోషకాలు ఉంటాయి. రోజూ యాపిల్‌కు బదులు జామపండు తింటే శరీరం దృఢంగా, ఆరోగ్యంగా ఉంటుంది. జామ పండు లోపల మాత్రమే కాదు బయట కూడా చాలా రుచిగా ఉంటుంది మరియు ఇది అనేక ముఖ్యమైన ఆరోగ్య సమస్యలకు మంచిది. ప్రధానంగా యాపిల్ కంటే జామ చౌకగా ఉంటుంది.

ఈ సీజన్లో ఎక్కడ చూసినా జామకాయలే కనిపిస్తున్నాయి కాబట్టి. విరివిగా, చౌకగా దొరికే ఈ జామకాయలు విలువలేనివని అనుకోకూడదు. విలువైన పండ్లలో వుండే న్యూట్రీషియన్స్ ఈ జామలోనూ అధికంగా ఉంటాయి. ఇవి ఎక్కువకాలం దొరుకుతూ ఉంటాయి. అంతే కాకుండా వీటిని ఇండ్లలో కూడా పెంచుకునే చెట్టుగా ఎంతో పేరు తెచ్చుకున్నది. జామపండ్లు ఆరోగ్యానికీ అధిక లాభాన్ని చేకూరుస్తాయి. ఈ పండ్ల ముక్కలపై మిరియాలపొడి, ఉప్పు చల్లుకుని తింటే ఆరోగ్యానికి మరింత దోహదం చేస్తాయి. కానీ ఎవరికి నచ్చిన విధంగా వారు వీటిని తింటూ ఉంటారు. వీటితో జామ్‌ లు ఐస్‌క్రీమ్స్ సలాడ్స్ వంటివి తయారు చేసుకోవచ్చు. జామపళ్ళలో 'సి' విటమిన్ పుష్కలంగా వుంటుంది. అపరిమిత పోషకాల నిలయం జామ. అనారోగ్యాన్ని దరిచేరనీయని జామ. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. కనుకనే దోరగా, దోరగా ఉన్న జామకాయను చూసిన వెంటనే తినేయాలనుకొనే వారుండరంటే అతిశయోక్తి కాదు. కొందరికి పచ్చి కాయలు నచ్చితే, మరి కొందరికి పండుపైనే మనసు. ఏదేమైనా పిల్లలనుండి పెద్దలవరకూ ఇష్టపడేది జామకాయనే.విటమిన్‌ సి ఎక్కుగా దొరికే వాటిలో ఉసిరికాయలకు ధీటుగా జామను చెప్పుకోవచ్చు.

Reasons Why You Must Eat Guava In Winter Season In Telugu

అపరిమిత పోషకాల నిలయం జామ. అనారోగ్యాన్ని దరిచేరనీయని జామ. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. కనుకనే దోరగా, దోరగా ఉన్న జామకాయను చూసిన వెంటనే తినేయాలనుకొనే వారుండరంటే అతిశయోక్తి కాదు. కొందరికి పచ్చి కాయలు నచ్చితే, మరి కొందరికి పండుపైనే మనసు. ఏదేమైనా పిల్లలనుండి పెద్దలవరకూ ఇష్టపడేది జామకాయనే.విటమిన్‌ సి ఎక్కుగా దొరికే వాటిలో ఉసిరికాయలకు ధీటుగా జామను చెప్పుకోవచ్చు. కమలాకన్నా ఐదు రెట్లు ఇందులో విటమిన్‌ సి ఉంటుంది. నిమ్మ, నారింజలలో కంటే నాలుగు నుంచి పది రెట్లు ఎక్కువగా వుంటుంది.

కానీ చాలా మంది చలికాలంలో జామపండు తినకుండా ఉంటారు. దీనికి కారణం జామపండు తింటే జలుబు చేస్తుంది. అయితే జామ పండులో పీచు, విటమిన్ సి, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు.. వంటివి పుష్కలంగా ఉంటాయి కాబట్టి రోజూ ఒక్క జామ పండును చలికాలంలోనే కాదు.. ప్రస్తుతం చాలా మంది వేధిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. చలికాలంలో రోజూ జామపండు తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

జామపండులో మినరల్స్‌తో పాటు విటమిన్ సి కూడా ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. ప్రధానంగా ఇందులో ఉండే విటమిన్ బి బ్యాక్టీరియల్ మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది.

మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది

మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది

ప్రస్తుతం చాలా మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. జామకాయ ఈ సమస్యకు ముగింపు పలకడానికి సహాయపడుతుంది. ఎందుకంటే జామలోని గింజలు బలమైన భేదిమందుగా పనిచేస్తాయి మరియు డైటరీ ఫైబర్ అధికంగా ఉంటాయి. కాబట్టి మీకు మలబద్ధకం సమస్య ఉంటే, రోజూ ఒక జామ పండు తినండి. దీని వల్ల గ్యాస్ట్రైటిస్ క్రమబద్ధమై మలబద్ధకం సమస్య దూరమవుతుంది.

మధుమేహాన్ని నివారిస్తుంది

మధుమేహాన్ని నివారిస్తుంది

మధుమేహ వ్యాధిగ్రస్తులకు జామ ఉత్తమ పండు. ఎందుకంటే జామలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. అదనంగా, జామ పండులో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయిలు ఎల్లప్పుడూ నియంత్రణలో ఉండేలా చేస్తుంది.

ఒత్తిడిని దూరం చేస్తుంది

ఒత్తిడిని దూరం చేస్తుంది

మీరు ఎక్కువగా ఒత్తిడికి లోనవుతున్నారా? దీన్ని తగ్గించడానికి సులభమైన మరియు ఉత్తమమైన మార్గం కోసం చూస్తున్నారా? అయితే జామపండు తినండి. ఎందుకంటే జామలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇది కండరాల ఒత్తిడిని తగ్గిస్తుంది. కాబట్టి రోజూ జామ పండు తినడం ద్వారా మనస్సును ఒత్తిడి లేకుండా మరియు ప్రశాంతంగా ఉంచుకోవచ్చు.

బరువు తగ్గడంలో సహాయపడుతుంది

బరువు తగ్గడంలో సహాయపడుతుంది

ప్రధానంగా జామ బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో ప్రొటీన్లు, ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువును అదుపులో ఉంచుతాయి మరియు థైరాయిడ్ జీవక్రియను నియంత్రించడంలో సహాయపడతాయి.

English summary

Reasons Why You Must Eat Guava In Winter Season In Telugu

Here are some reasons why you must eat guava in winter season. Read on to know more...
Desktop Bottom Promotion