For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Ashwagandha Benefits: చర్మ సమస్యల నుండి మెదడు పనితీరు వరకు అశ్వగంధతో ఎన్నో ప్రయోజనాలు

అశ్వగంధ మూలికా ఆయుర్వేదంలో చాలా ముఖ్యమైనది. అనేక ఔషధ గుణాలు కలిగిన ఈ మూలికను ఇండియన్ జిన్సెంగ్ అని కూడా అంటారు. అశ్వగంధ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది చర్మ సౌందర్యానికి ఉపయోగపడుతుంది. అలాగే జ్ఞాపక శక్తినీ మెరుగ

|

Ashwagandha Benefits: అశ్వగంధ(Withania Somnifera) మూలికా ఆయుర్వేదంలో చాలా ముఖ్యమైనది. అనేక ఔషధ గుణాలు కలిగిన ఈ మూలికను ఇండియన్ జిన్సెంగ్ అని కూడా అంటారు. అశ్వగంధ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది చర్మ సౌందర్యానికి ఉపయోగపడుతుంది. అలాగే జ్ఞాపక శక్తినీ మెరుగుపరుస్తుంది.

అశ్వగంధ ప్రయోజనాలు:

అశ్వగంధ ప్రయోజనాలు:

1. అశ్వగంధ చిత్త వైకల్యంతో బాధపడే వారిలో జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అశ్వగంధ తీసుకుంటే మతిమరుపుకు దోహదం చేసే కణాలను కట్టడి చేస్తుంది. అలా జ్ఞాపక శక్తి కోల్పోకుండా సహాయపడుతుంది.

2. అశ్వగంధ క్రమం తప్పకుండా తీసుకుంటే ఒత్తిడి, ఆందోళన, నిరాశ నిస్పృహల నుండి బయటపడవచ్చు. ఇది మెదడులోని కొన్ని న్యూరో ట్రాన్స్ మీటర్ల (ఎసిటైల్కోలిన్) స్రావానికి సహాయపడుతుంది. మానసిక స్థితి మెరుగుపరచడానికి, మనస్సును, శరీరాన్ని విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగపడుతుంది.

3. అల్జీమర్స్ డిమెన్షియా ఉన్న రోగులకు రోజూ అశ్వగంధ పెడితే గుర్తించే ఫలితాలు కనిపిస్తాయి. అల్జీమర్స్, డిమెన్షియాలను నియంత్రించే యాంటీ కన్వల్సెంట్ గుణాలు అశ్వగంధలో ఉంటాయి.

డిప్రెషన్ మరియు నాడీ వ్యవస్థ సమస్యలను తరిమికొడుతుంది

డిప్రెషన్ మరియు నాడీ వ్యవస్థ సమస్యలను తరిమికొడుతుంది

1. అశ్వగంధ డిప్రెషన్ కు మరియు పాజిటివ్ మైండ్ సెట్ కు కొనసాగించడం కష్టమని భావించే వారికి విస్తృతంగా సహాయపడుతుంది. దీని ద్వారా మనస్సుకు విశ్రాంతి మరియు ప్రశాంతత లభిస్తుంది.

2. అశ్వగంధ నాడీ వ్యవస్థ, ఎండోక్రైన్ గ్రంథులు మరియు రోగనిరోధక వ్యవస్థ మధ్య సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ఇది శరీరం మరియు మనస్సుపై దీర్ఘకాలిక ఒత్తిడిని తగ్గిస్తుంది.

ఫ్రీ రాడికన్స్ నుండి శరీరం దెబ్బతినకుండా కాపాడుతుంది

ఫ్రీ రాడికన్స్ నుండి శరీరం దెబ్బతినకుండా కాపాడుతుంది

1. అశ్వగంధలో వివిధ జీవ రసాయనాలు, ఆల్కలాయిడ్స్ ఉంటాయి. అవి శరీరంలో బలమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పని చేస్తాయి. అశ్వగంధ వేగంగా కణాల పునరుత్పత్తి మరియు పునురుజ్జీవనానికి కూడా సహాయపడుతుంది. అంతే కాదు, ఇది వృద్ధాప్య సంకేతాలను ఆలస్యం చేయడంలో సహాయపడుతుంది. చర్మాన్ని మృదువుగా, తేమగా, ముడతలు లేకుండా ఉంచుతుంది.

2. అశ్వగంధ రూట్ పౌడర్ శరీరంలో ఉత్పత్తి అయ్యే ఫ్రీ రాడికల్స్ ను కట్టడి చేయడానికి సహాయపడతాయి. ఇది హానికరమైన యూవీ కిరణాలు లేదా విషపూరితమైన ఆహారం తీసుకోవడం వల్ల కలిగే వేగవంతమైన ఆక్సీకరణ నష్టం నుండి శరీరాన్ని రక్షిస్తుంది.

వాపు, నొప్పిని తగ్గిస్తుంది

వాపు, నొప్పిని తగ్గిస్తుంది

1. శరీరంలో ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ ను ప్రేరేపించే హిస్టమైన్ ల విడుదలను నియంత్రించడం ద్వారా శరీరంలోని ఏ భాగాన్ని అయినా వాపు తగ్గించడానికి అశ్వగంధ సహాయపడుతుంది.

2. క్యాన్సర్ వంటి సమస్యలలో, వేగంగా కణాల పెరుగుదల సమీపంలోని అవయవాలకు వ్యాపిస్తుంది. అశ్వగంధ ప్రాణాంతక క్యాన్సర్ కణాల పెరుగుదను నిరోధించడమే కాకుండా, అవి మరింతగా వ్యాప్తి చెందకుండా నిరోధిస్తాయి.

3. కీమో థెరపీ లేదా రేడియోథెరపీ చేయించుకుంటున్న రోగులు దెబ్బతిన్న కణాల త్వరిత పునరుత్పత్తి కోసం ఈ మూలికను తీసుకోవాలి.

4. శరీరానికి తగిలే గాయాలు త్వరితగతంగా నయం కావడానికి అశ్వగంధ తోడ్పడుతుంది.

5. అశ్వగంధలో ప్లాంట్ స్టెరాల్స్ శరీరంలోని వాపుపై స్టెరాయిడ్ లాంటి ప్రభావాన్ని చూపిస్తాయి.

6. అశ్వగంధ ఆర్థరైటిస్ నొప్పికి కూడా సహాయపడతాయి. కీళ్ల నొప్పులను తగ్గించే గుణం అశ్వగంధకు ఉంది.

వ్యాధినిరోధక వ్యవస్థ

వ్యాధినిరోధక వ్యవస్థను మరింత మెరుగు పరడంతో అశ్వగంధ చూర్ణంలో ఉన్న అతి ముఖ్యమైన ప్రయోజనం. మనుషుల శరీరంలోని రక్తం ఆక్సిజనరేట్ అయి.. ఇతర వ్యాధులు సోకకుండా పోరాడుతుంది.

యాంటీ ఇన్ల్ఫమేటరీ

యాంటీ ఇన్ల్ఫమేటరీ అశ్వగంధ చూర్ణంలో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉంటాయి. కాబట్టి.. ఇది ఎఫెక్టివ్ పెయిన్ కిల్లర్ లా పనిచేస్తుంది. కాబట్టి కీళ్ల నొప్పులు వంటి రకరకాల నొప్పులు తగ్గిస్తుంది. అశ్వగంధ చూర్ణం తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులతో బాధపడేవాళ్లకు ఉపశమనం కలుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్

యాంటీ ఆక్సిడెంట్

అశ్వగంధ చూర్ణంలో బయోకెమికల్ పదార్థాలు ఉండటం వల్ల.. అవి యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేస్తాయి. అశ్వగంధంపై తాజా లాబొరేటరీ పరీక్షలలో ఈ విషయాన్ని వెల్లడించారు.

English summary

Skin and memory benefits of Ashwagandha in Telugu

read on to know Skin and memory benefits of Ashwagandha in Telugu
Story first published:Thursday, December 1, 2022, 17:19 [IST]
Desktop Bottom Promotion