For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిద్రపోవడానికి ముందు చేయకూడని పనులు

|

నిద్ర వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి అనారోగ్యం నిద్రతో ముడిపడి ఉంటుంది. సరిగ్గా నిద్రపోకపోతే కలిగే దుష్ప్రభావాలు అన్నీ ఇన్నీ కావు. రాత్రుళ్లు కంటినిండా నిద్రపోతేనే ఉదయం రిఫ్రెష్‌గా మేల్కొంటారు.

Things you should never do before bed in Telugu

కొంతమందికి చక్కని నిద్ర కలలా మిగిలిపోతుంది. రాత్రి సమయంలో నిద్ర పోవడానికి చాలా కష్టపడతారు. బెడ్‌పై అటు ఇటు దొర్లుతూ దొర్లుతూ ఎప్పటికో కానీ నిద్రలోకి జారుకోరు. అయితే నిద్ర సరిగ్గా పట్టకపోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

1. మొబైల్, ల్యాప్‌టాప్‌ చూస్తూ ఉండటం

1. మొబైల్, ల్యాప్‌టాప్‌ చూస్తూ ఉండటం

మొబైల్, ల్యాప్‌టాప్‌ స్క్రీన్ల నుండి బ్లూ లైట్ వెలువడుతుంది. ఈ బ్లూ లైట్ వల్ల నిద్ర మబ్బు పోతుంది. డిజిటల్ స్క్రీన్‌ల నుండి వెలువడే నీలం, తెలుపు కాంతి మెదడును మెలటోనిన్ విడుదల చేయకుండా అడ్డుకుంటుంది. ఇది మీరు సరైన సమయానికి నిద్రపోకుండా చేస్తుంది. ఈ హార్మోన్ లేనప్పుడు, వ్యక్తి నిద్రపోవడం కష్టంగా మారుతుంది. రాత్రిపూట నీలి కాంతికి గురికావడం వల్ల నిద్ర ప్రభావం అవుతుంది. స్థూలకాయం, క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. రాత్రి పూట బ్లూ లైట్ వల్ల రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

2. కాఫీ, టీ తాగడం

2. కాఫీ, టీ తాగడం

నైట్ డ్యూటీ చేసే వారికి కాఫీ, టీ బెస్ట్ ఫ్రెండ్స్ వంటివి. అయితే నిద్ర పోవాలనుకునే వారికి ఇవి ఏమంత మంచివి కావు. కాఫీ లేదా టీ తాగడం వల్ల ఇందులో ఉండే కెఫీన్ శరీరంలోని అడ్రినలిన్ మరియు శక్తి స్థాయిలను పెంచుతుంది. ఇది నిద్ర పోకుండా చేస్తుంది.

కెఫిన్ మెదడు ద్వారా ఉత్పత్తి చేయబడిన అడెనోటిస్ అనే రసాయనాన్ని కూడా అడ్డుకుంటుంది. ఇది మిమ్మల్ని నిద్రపోయేలా చేస్తుంది. కెఫిన్ నిద్రపోవడంలో ఇబ్బందిని కలిగిస్తుంది. ఒకవేళ నిద్ర పట్టినా మధ్య మధ్యలో మెలకువ వచ్చేలా చేస్తుంది.

3. కొవ్వు పదార్థాలు తినడం

3. కొవ్వు పదార్థాలు తినడం

కొందరు లేట్ నైట్ భోజనం చేస్తుంటారు. మరికొందరు నిద్రపోయే ముందు అల్పాహారం చేస్తుంటారు. అయితే ఈ అలవాట్ల వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. కొవ్వు పదార్థాలు లేదా అర్ధరాత్రి స్నాక్స్ తినడం నిద్ర నాణ్యతను ప్రభావితం చేస్తుంది. పడుకునే ముందు కొవ్వు అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల REM నిద్రలో గడిపే సమయాన్ని తగ్గించవచ్చు.

4. స్మోకింగ్

4. స్మోకింగ్

స్మోకింగ్ ఆరోగ్యానికి హానిరం. ధూమపానం ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు ధూమపానం కారణం అవుతుంది. కొంత మందికి భోజనం చేసిన తర్వాత సిగరెట్ తాగడం అలవాటు ఉంటుంది. అలా రాత్రి సమయంలోనూ భోజనం తర్వాత సిగరెట్ తాగితే త్వరగా నిద్ర పట్టదు. గంటల తరబడి మెలకువగా ఉంచుతుంది. రాత్రి సమయంలో స్మోకింగ్ చేయడం వల్ల నిద్రలేమి సమస్యల వస్తుంది.

5. హారర్ కంటెంట్ చూడటం లేదా చదవడం

5. హారర్ కంటెంట్ చూడటం లేదా చదవడం

కొందరికి హారర్ సినిమాలన్నా, నవలలు అన్నా ఇష్టం ఉంటుంది. ఇలాంటి భయానక కంటెంట్ చూసే వారికి లేదా చదివేవారికి నిద్రపోవడం కష్టంగా ఉంటుంది. హారర్ చిత్రాలు చూడటం వల్ల శరీరంలో ఆడ్రినలిన్ ఉత్పత్తి అవుతుంది. ఈ హార్మోన్ నిద్రపట్టకుండా అడ్డుకుంటుంది. అలాగే నిద్రలో పీడకలలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి కలల వల్ల నిద్ర నాణ్యత దెబ్బ తింటుంది.

English summary

Things you should never do before bed in Telugu

read on to know Things you should never do before bed in Telugu
Story first published:Tuesday, December 13, 2022, 20:05 [IST]
Desktop Bottom Promotion