For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు తగ్గడానికి పసుపు వాడకం: నిజంగా ఈ పద్ధతి పనిచేస్తుందా?

|

పసుపు ఇంటిల్లిపాదికి ఒక ఆయుర్వేద ఔషధం. మసాలా దినుసుగా నిత్యం వంటల్లో వాడే ఈ అద్భుతమైన ఔషధం అనేక వ్యాధులను నివారిస్తుంది. ఇందులో మంట వాపులు తగ్గించే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది మరియు అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలకు ఔషధ రూపంలో సహాయపడుతుంది. ఆర్థరైటిస్, అల్జీమర్స్ వ్యాధి మరియు కొన్ని రకాల క్యాన్సర్ వంటి ఇతర వ్యాధులకు కూడా పసుపును ఉపయోగిస్తారు. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులు కూడా పసుపు బరువు తగ్గడానికి సహాయపడుతుందని గమనించవచ్చు. కానీ పసుపు నిజంగా బరువు తగ్గడానికి మీకు సహాయపడుతుందా? లేదా? అన్న సమాధానం కోసం నేటి కథనాన్ని చదవండి:

కుర్కుమిన్

కుర్కుమిన్

పసుపును పసుపు రంగులోకి మార్చే కర్కుమిన్ అనే పోషకం దీని ఔషధ లక్షణాలకు కూడా కారణంగా ఉంది. ఈ కర్కుమిన్ పోషకం పసుపులో అత్యంత శక్తివంతమైన పోషకం, ఇది మంట, వాపుల నుండి ఉపశమనం కలిగించే వ్యాధి నిరోధక లక్షణాలు మరియు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. బరువు తగ్గడానికి కర్కుమిన్ మీకు ఎలా సహాయపడుతుందన్న వివరణతో ఈ ఆరు కారణాలను నేటి వ్యాసంలో వివరించడం జరిగింది..

కొవ్వు జీవరసాయన పనితీరును నియంత్రిస్తుంది

కొవ్వు జీవరసాయన పనితీరును నియంత్రిస్తుంది

కర్కుమిన్ శరీర ఆరోగ్యాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది మరియు ఊబకాయాన్ని నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రోగ నిరోధక లక్షణాలను కలిగి ఉన్న ఇతర సుగంధ ద్రవ్యాలు మరియు మూలికలతో కలిపి కర్కుమిన్ ఉపయోగించినప్పుడు, ఈ గుణాలు మరింత శక్తివంతమైనది పనిచేసి వేగంగా బరువు తగ్గడాన్ని సహాయపడుతుంది. ఊబకాయం లేదా స్థూలకాయంకు కారణమయ్యే కొవ్వు కణాలు పరిపక్వత చెందకుండా ఈ పోషకాలు నిరోధిస్తాయి, అవసరమైన స్థాయిలో కొవ్వు ఉన్నప్పటికీ బరువు పెరగకుండా నిరోధిస్తాయి.

కర్కుమిన్ మరొక పాత్ర

కర్కుమిన్ మరొక పాత్ర

బరువు తగ్గడంలో కర్కుమిన్ మరొక పాత్ర ఏంటంటే ఇది శరీరంలో ఉండే తెలుపు కొవ్వును గోధుమ కొవ్వుగా మార్చడం చేస్తుంది. తెల్ల కొవ్వు అంటే చర్మం కింద, ముఖ్యమైన అవయవాల చుట్టూ మరియు ముఖ్యంగా నడుము వద్ద నిల్వ చేరిన కొవ్వు. ఊబకాయానికి ఈ తెల్లటి కొవ్వు ప్రధాన కారణం. నేటి కార్యాచరణకు అవసరమైన కొవ్వు బ్రౌన్ ఫ్యాట్. ఇది గ్లూకోజ్‌తో కలిసి శరీరంలో శక్తిగా ఉపయోగించబడుతుంది. అందువల్ల బ్రౌన్ ఫ్యాట్ అనేది శారీరక శ్రమతో తినే కొవ్వు మరియు బరువు పెరగడాన్ని నిరోధించడమే కాకుండా కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గిస్తుంది మరియు ఊబకాయం తగ్గిస్తుంది.

మంట, వాపులతో పోరాడుతోంది

మంట, వాపులతో పోరాడుతోంది

శరీరంలో మంట, వాపులు మరియు ఊబకాయం రెండూ ఒకదానికొకటి అంటిపెట్టుకున్నస్నేహితులు వంటివి. మంట చాలా ఎక్కువగా ఉంటే ఇది శరీరం యొక్క రసాయన లక్షణాలను మారుస్తుంది, జీవరసాయన పనితీరును మారుస్తుంది మరియు అవాంఛిత ఆహార పదార్థాలపై ఆకర్షణ పెరిగి ఊబకాయాన్ని పెంచుతుంది. దాని ఫలితంగా స్థూలకాయం పెరుగుతోంది. తేలికపాటి నుండి మితమైన మంట యొక్క ప్రాబల్యం పెరుగుతుంది.

పసుపు ఈ సమస్యకు కారణమైన ఫ్రీ రాడికల్స్, సమస్యకు ముఖ్యంగా కారణమయ్యే మూలాన్ని తొలగిస్తాయి. ఇది ఇప్పటివరకు ఊబకాయం వల్ల కలిగే నష్టాన్ని కూడా సరిచేస్తుంది.

జీవరసాయన సమస్యలకు వ్యతిరేకంగా పోరాడుతుంది

జీవరసాయన సమస్యలకు వ్యతిరేకంగా పోరాడుతుంది

సాధారణంగా అధిక బరువు ఉన్నవారికి ఈ సమస్య ఉంటుంది. తత్ఫలితంగా వీరి శరంరలో అధిక స్థాయిలో ట్రైగ్లిజరైడ్స్, శరీరంలో కొవ్వు, అధిక రక్తపోటు, తక్కువ రక్తంలో గ్లూకోజ్, తక్కువ కొలెస్ట్రాల్ మరియు పేలవమైన ఇన్సులిన్ ఉన్నాయి. అందువల్ల, ఈ ఇబ్బంది ఉన్నవారు బరువు తగ్గడానికి ఆరోగ్యకరమైన ఆహారం తినడంతో పాటు సాధ్యమైనంత వ్యాయామం చేయడయం వల్ల సులభంగా బరువు తగ్గరు.

అధ్యయనంలో కనుగొన్నట్లు

అధ్యయనంలో కనుగొన్నట్లు

ఒక అధ్యయనం కనుగొనడిన ప్రకారం ఈ ఇబ్బందితో బాధపడుతున్న కొందరు ఊబకాయగ్రస్తులకు పరిమితమైన కుర్కుమిన్ అంశాలున్నా ఆహారాలను క్రమంగా తినమని సూచించబడ్డాయి. ఫలితంగా వీరు బరువు తగ్గడం చాలా వేగంగా జరిగింది. శరీర కొవ్వు తగ్గడం, నడుము చుట్టుప్రక్కల ఉన్న కొవ్వు కరగడం మరియు ఎత్తుకు తగ్గ బరువు నిర్వహించబడినట్లు కనుగొనపబడినది. ఈ అధ్యయనం పసుపు వినియోగం శరీరం యొక్క అనేక విధులను నియంత్రించగలదని నిరూపించింది.

మానసిక ఒత్తిడిని తగ్గించగలదు

మానసిక ఒత్తిడిని తగ్గించగలదు

మానసిక ఒత్తిడి కూడా బరువు పెరగడానికి ఒక కారణం. డిప్రెషన్ మరియు ఆందోళనలు అధిక మోతాదు కార్టిసాల్ అనే స్రావాన్ని పెరిగేలా ప్రేరేపిస్తాయి, ఇది శరీరం బరువు పెరగడానికి నేరుగా బాధ్యత వహిస్తుంది. కర్కుమిన్ ఈ కార్టిసాల్ స్థాయిని తగ్గించి మెదడుపై ప్రతికూల ప్రభావాల నుండి రక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

పికోస్ సంబంధిత బరువు పెరుగకుండా రక్షిస్తుంది

పికోస్ సంబంధిత బరువు పెరుగకుండా రక్షిస్తుంది

పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పిసిఒఎస్) తో మహిళల శరీరం బరువు పెరగడం చాలా ఎక్కువ మరియు పికోసియాతో(Polycystic ovary syndrome (PCOS) బాధపడుతున్న మహిళల బరువును నియంత్రించడం చాలా కష్టం. కానీ పసుపులో ఉండే యాంటీయాక్సిడెంట్, యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఈ బరువును ఈరోగ్యకరంగా నిర్వహించడానికి సహాయపడతాయి.

పసుపును తినే పద్ధతి

పసుపును తినే పద్ధతి

ప్రతిరోజూ పసుపు తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మీరు మీ రెగ్యులర్ గా తినే ఆహారాలకు పసుపును జోడించవచ్చు. పసుపు జోడించిన పాలు లేదా టీతో పాటు మీకు ఇష్టమైన పండ్ల రసం మరియు కాఫీ తాగవచ్చు. కానీ ఒక రోజులో మొత్తం పరిమాణం మూడు గ్రాములకు మించకూడదు.

హెచ్చరిక

హెచ్చరిక

పసుపు మాత్రమే బరువు తగ్గడానికి సహాయపడదు. అందుకని, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగిన ఇతర ఆహారాలు కూడా తీసుకోవాలి. అలాగే, ఆరోగ్యకరమైన ఆహారం తినడం మరియు అనవసరమైన ఆహారాన్ని నివారించడం వంటి అన్ని అవసరమైన చర్యలను అనుసరించడం ద్వారా మాత్రమే బరువు తగ్గడం సాధించవచ్చు.

సలహా

సలహా

కుర్కుమిన్ మన శరీరం గ్రహించలేని అన్ని లక్షణాలను కలిగి ఉంది. కానీ మిరియాలు లోని ఫైబర్ అనే పోషకాంశ కర్కుమిన్ షోశించే సామర్థ్యాన్ని పెంచుతుంది. కాబట్టి పసుపు మరియు మిరియాలు రెండింటినీ జోడించి తినవచ్చు. మార్కెట్లో లభించే కర్కుమిన్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఔషధాల పరిమాణానికి సంబంధించిన శక్తిని పెంచే సామర్థ్యానికి కలిగి ఉన్నది.

English summary

Turmeric for weight loss: Does it really work?

Turmeric, the golden spice, has anti-inflammatory properties and can manage and prevent many health conditions including, arthritis, Alzheimer’s and even cancer. People who keep up with all the weight loss fads surely must have heard of turmeric as a good weight loss ingredient.
Story first published: Monday, October 14, 2019, 17:45 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more