For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ అంటే ఏంటి? ఇది ఆందోళనను తగ్గిస్తుందా?

బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లు చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అవి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సుకు ప్రయోజనకరంగా ఉంటాయి. అవి ఒత్తిడిని తగ్గిస్తాయి. విశ్రాంతి తీసుకునేందుకు ప్రేరేపిస్తాయి. శ్వాస వ్యాయామాల వల్ల

|

బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లు చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అవి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సుకు ప్రయోజనకరంగా ఉంటాయి. అవి ఒత్తిడిని తగ్గిస్తాయి. విశ్రాంతి తీసుకునేందుకు ప్రేరేపిస్తాయి. శ్వాస వ్యాయామాల వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగుపడుతుంది.

What is 4-7-8 breating technique? Can it reduce anxiety in Telugu

4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ అంటే ఏంటి?

ఈ శ్వాస వ్యాయామంలో మొదట 4 సెకన్ల పాటు శ్వాస తీసుకోవాలి. 7 సెకన్ల పాటు శ్వాస బిగబట్టుకోవాలి. తర్వాత 8 సెకన్ల పాటు శ్వాస వదలాలి. అందుకే దీనిని 4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ అంటారు. ప్రాచీన యోగా నుండి ఈ టెక్నిక్ ను అభివృద్ధి చేశారు. శ్వాసపై నియంత్రణను అభివృద్ధి చేయడంలో ఈ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది. ఉదయం వేళ 4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. రాత్రి పడుకునే ముందు చేయడం వల్ల చక్కగా నిద్ర పడుతుంది. అలాగే ఈ టెక్నిక్ రోజులో ఎప్పుడైనా చేయవచ్చు.


4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ ప్రయోజనాలు:

డిప్రెషన్, యాంగ్జయిటీ తగ్గుతుంది:
ఈ బ్రీతింగ్ టెక్నిక్ వల్ల శ్వాసపై పట్టు వస్తుంది. ఈ శ్వాస వ్యాయామం చేయడం వల్ల డిప్రెషన్, యాంగ్జయిటీ తగ్గుతుంది.

మెరుగైన నిద్ర:
నిద్రలేమితో బాధపడుతున్న వ్యక్తులు పడుకునే ముందు 20 నిమిషాల పాటు ఈ శ్వాస వ్యాయామాన్ని చేయడం వల్ల నిద్ర నాణ్యత పెరుగుతుందని పరిశోధకులు గుర్తించారు.

ఒత్తిడి తగ్గుతుంది:
నెమ్మదిగా శ్వాస తీసుకోవడం వల్ల హృదయ స్పందన రేటు తగ్గుతుంది. రక్తపోటు తగ్గుతుంది. ఈ బ్రీతింగ్ టెక్నిక్ వల్ల ఒత్తిడి స్థాయి తగ్గిపోతుంది.

నొప్పిని ప్రాసెస్ చేసే సామర్థ్యం పెరుగుతుంది:
4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ ప్రాక్టీస్ చేయడం వల్ల శ్వాసపై నియంత్రణ వస్తుంది. నొప్పిని ప్రాసెస్ చేసే సామర్థ్యం పెరుగుతుంది.

4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ ఎలా చేయాలి:

  1. మంచి ప్రదేశంలో కూర్చోవాలి.
  2. నోరు మూయుండి
  3. ఇప్పుడు ముక్కు ద్వారా 4 సెకన్ల పాటు శ్వాస తీసుకోవాలి.
  4. తర్వాత 7 సెకన్ల పాటు శ్వాస బిగబట్టుకోవాలి.
  5. చివరగా 8 సెకన్ల పాటు శ్వాస వదలాలి.
  6. తిరిగి మొదటి నుండి ప్రారంభించాలి. 4 సెకన్ల పాటు శ్వాస తీసుకోవాలి.

English summary

What is 4-7-8 breating technique? Can it reduce anxiety in Telugu

read this to know What is 4-7-8 breating technique? Can it reduce anxiety in Telugu
Story first published:Sunday, January 29, 2023, 14:10 [IST]
Desktop Bottom Promotion