For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

COVID-19 Vaccine Booster : కోవిద్-19 బూస్టర్ షాట్ అంటే ఏమిటి? వీటిని ఎవరు తీసుకోవాలి?

కరోనా వ్యాక్సిన్ బూస్టర్ అంటే ఏమిటి? అది ప్రభావవంతంగా పని చేస్తుందా? ఆ విశేషాలేంటో తెలుసుకుందాం...

|

యునైటెడ్ స్టేట్స్ అమెరికా(USA)తాజా సమాచారం ప్రకారం, కొత్త డేటా డెవలప్ మెంట్ తర్వాత COVID-19 బూస్టర్ షాట్ల పంపిణీ వచ్చే నెలలో ప్రారంభం కానుంది.

What is COVID-19 Vaccine Booster? is it really effective? All You Need to Know in Telugu

ఎందుకంటే కాలక్రమేణా కరోనా వైరస్ వ్యాక్సిన్ల సామర్థ్యం క్షీణిస్తోంది. CDC డైరెక్టర్ డాక్టర్ రోషెల్ వాలెన్స్కీ FDA యాక్టింగ్ కమిషనర్ డాక్టర్ జానెట్ ఉడ్ కాక్, యుఎస్ సర్జన్ జనరల్ డాక్టర్ వివేల్ మూర్తి, NIH డైరెక్టర్ డాక్టర్ ఫ్రాన్సిస్ కాలిన్, వైట్ హౌస్ చీఫ్ మెడికల్ అడ్వైజర్ డాక్టర్ ఆంథోనీ ఫౌసీ మరియు ఇతర అమెరికా ఆరోగ్య నిపుణులు 18 ఆగస్టు 2021న సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

What is COVID-19 Vaccine Booster? is it really effective? All You Need to Know in Telugu

అమెరికన్ల కోసం COVID-19 వ్యాక్సిన్ బూస్టర్ షాట్ల కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా SARC-CoV-2 సంక్రమణకు వ్యతిరేకంగా రక్షణ అనేది టీకాల ప్రారంభ మోతాదులను అనుసరించి కాలక్రమేణా తగ్గడం ప్రారంభిస్తుందని మరియు డెల్టా వేరియంట్ యొక్క ఆధిపత్యంతో కలిసి, రక్షణను తగ్గించినట్లు ఆధారాల ద్వారా వెల్లడైందని వారు తెలిపారు. ఈ సందర్భంగా కోవిద్-19 వ్యాక్సిన్ బూస్టర్ షాట్లను ఎవరు తీసుకోవాలి? దీన్ని ఎందుకు తీసుకోవాలి? ఇది కరోనా వ్యాక్సిన్ల కన్నా నిజంగా ప్రభావవంతంగా పని చేస్తుందా లేదా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Zydus Cadila's Vaccine: 12 ఏళ్ల పిల్లలకు జైడస్ క్యాడిలా టీకా ఎలా పని చేస్తుందో తెలుసా...Zydus Cadila's Vaccine: 12 ఏళ్ల పిల్లలకు జైడస్ క్యాడిలా టీకా ఎలా పని చేస్తుందో తెలుసా...

COVID-19 వ్యాక్సిన్ బూస్టర్ షాట్ అంటే?

COVID-19 వ్యాక్సిన్ బూస్టర్ షాట్ అంటే?

కోవిద్-19 వ్యాక్సిన్ బూస్టర్ షాట్లను అదనపు కరోనా వైరస్ వ్యాక్సిన్ అని చెప్పొచ్చు. ఇవి మన బాడీలో రోగనిరోధకశక్తిని పెంచడానికి మరియు కొత్త వాటిని డెవలప్ మెంట్ చేయడానికి, ప్రత్యేకించి డెల్టా వేరియంట్ల నుండి కాపాడటానికి ఇవి అద్భుతంగా పని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. 14 మే 2021న ప్రచురించబడిన ఓ అధ్యయనం ప్రకారం, COVID-19 బూస్టర్ కోసం దాదాపు 60 మిలియన్ డోసుల వ్యాక్సిన్లను ఇప్పటికే యునైటెడ్ కింగ్ డమ్ ద్వారా ఆర్డర్లు వచ్చాయి. దీంతో పాటు ఇజ్రాయెల్ వంటి దేశంతో పాటు మరికొన్ని దేశాల్లోనూ వీటిని ప్రారంభించాలని చూస్తున్నాయి.

పిల్లలకు వేసేందుకు..

పిల్లలకు వేసేందుకు..

ఇప్పటివరకు మన దేశంలో 18 ఏళ్ల వయసు ఉన్న వారికి మాత్రమే వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ COVID-19 బూస్టర్ ను 18 ఏళ్లలోపు తక్కువ వయసు ఉన్న పిల్లలకు కూడా వేయొచ్చు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేనందున నిపుణులు దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేరు.

అదనపు మోతాదులు అవసరం లేదు..

అదనపు మోతాదులు అవసరం లేదు..

ఈ అధ్యయనంలో సిడిసిలో మే నెలలో చేసిన ఒక ప్రకటనను పరిశీలిస్తే.. ‘COVID-19 బూస్టర్ మోతాదుల అవసరం మరియు సమయం ఇంకా నిర్ణయించబడలేదు. ఈ సమయంలో అదనపు మోతాదులు కూడా సిఫార్సు చేయబడలేదు'. ఏదేమైనా అమెరికాలో ఇటీవల కోవిద్-19 కేసులలో 99 శాతం కారణమైన డెల్టా వేరియంట్ వ్యాప్తిని చూసి, చివరకు వచ్చే నెల సెప్టెంబర్లో ప్రారంభమయ్యే బూస్టర్ షాట్ల కోసం అమెరికా ఒక ప్రకటన జారీ చేసింది.

ఇవి అవసరమేనా?

ఇవి అవసరమేనా?

COVID-19 బూస్టర్లు అవసరమా అంటే.. ప్రతి సంవత్సరం కాలానుగుణంగా డెవలప్ చెందుతున్న వైవిధ్యాల నుండి రక్షణ కోసం అందించబడే ఫ్లూ వంటి కొన్ని అంటు వ్యాధులకు బూస్టర్ షాట్లు సాధారణంగా ఉపయోగించబడతాయి. కరోనా సంక్రమణకు వ్యతిరేకంగా, రోగనిరోధక శక్తిని పెంచడానికి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి టెటానస్ ఇవ్వబడుతుంది. ప్రస్తుతం, సాక్ష్యం ఆధారిత డేటా లేకపోవడం వల్ల COVID-19 కోసం బూస్టర్ షాట్లు అవసరమా? కాదా అనే విషయం ఇంకా అస్పష్టంగానే ఉంది.

ప్రాథమిక నివేదిక ఏం చెబుతోంది..

ప్రాథమిక నివేదిక ఏం చెబుతోంది..

ఏది ఏమైనప్పటికీ.. టీకాల బూస్టర్ షాట్లు సెల్యూలర్ మరియు హ్యుమరల్ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయని కొన్ని ప్రాథమిక నివేదికల ద్వారా తెలుస్తోంది. ప్రత్యేకించి వయసు కారణంగా కొత్త COVID-19 వేరియంట్ల నుండి, కరోనా మళ్లీ రాకుండా, పెద్ద వయసు వారికి, మొత్తం జనాభాలో వ్యాక్సిన్లు ఇంకా వేయని వారికి ఈ బూస్టర్ షాట్లను వేయాలని సూచించబడలేదు. అయితే టాప్-అప్ డోస్ ప్రధానంగా యుఎస్ వంటి దేశాల కోసం సంవత్సరం ప్రారంభంలో టీకా డ్రైవ్ ప్రారంభించింది.

ఏ టీకాలు బూస్టర్ షాట్లుగా ఇవ్వబడతాయి?

ఏ టీకాలు బూస్టర్ షాట్లుగా ఇవ్వబడతాయి?

ఇప్పటివరకు ఆక్స్ ఫర్డ్/ఆస్ట్రాజెనెకా కోవిషీల్డ్ మరియు ఫైజర్ బయోటెక్ వ్యాక్సిన్లు బూస్టర్ షాట్లుగా ఇవ్వాల్సిన వ్యాక్సిన్ల జాబితాలో ఉన్నాయి. ఈ వ్యాక్సిన్లు కొన్ని దేశాల్లో రెండు డోసులు ప్రజలకు ఇవ్వబడ్డాయి. అయితే మూడో డోసుకు సంబంధించి.. ఇంకా స్పష్టత రాలేదు.

మన దేశంలో ఎప్పుడు?

మన దేశంలో ఎప్పుడు?

మన దేశంలో వ్యాక్సిన్ బూస్టర్ షాట్ల కోసం ప్రచారాన్ని ప్రారంభించడంపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు. దీనికి కారణం అమెరికా మాదిరిగా కాకుండా, మన దేశంలో డెల్టా వేరియంట్ కేసులు చాలా తక్కువగా ఉన్నాయి. పైగా మన దేశంలో ఇంకా కోట్లాది మందికి టీకాలు వేయాల్సి ఉంది. దీని కారణంగా వ్యాక్సిన్ ప్రభావ వ్యవధిపై ఎలాంటి సమాచారం లేదు.

ఎవరు నిర్ధారించారు?

ఎవరు నిర్ధారించారు?

అమెరికాలో పెరుగుతున్న కేసులు, హాస్పిటలైజేషన్ మరియు మరణాలను చూసి దేశంలో టీకా బూస్టర్ షాట్ల నిర్వహణను ప్రారంభించబోతున్నారు. అయితే కొత్త అధ్యయనం ప్రకారం, అవసరమైతే తమ ప్లానులో మార్పులు చేసుకోవడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారు. అలాగే వ్యాక్సిన్ ప్రభావం, ఉన్న మరియు డెవలప్ అవుతున్న వేరియంట్లకు రక్షణ మరియు అధిక రక్షణ కోసం బూస్టర్ షాట్ ప్రభావం వంటి ప్రశ్నలకు సమాధానాలు ఇప్పటికీ అస్పష్టంగానే ఉన్నాయి. దీనిపై మరింత పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది.

English summary

What is COVID-19 Vaccine Booster? is it really effective? All You Need to Know in Telugu

What is COVID-19 Vaccine Booster in Telugu : covid-19 booster shot really effective against different variants of Coronavirus, why and who should take covid vaccine booster shot. Know more.
Desktop Bottom Promotion