Just In
- 14 min ago
ఇంట్లో మీ రక్తపోటును తనిఖీ చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన 7 విషయాలు
- 4 hrs ago
సోమవారం దినఫలాలు : ఉద్యోగులు ఈరోజు పనిని సకాలంలో పూర్తి చేయడంలో విఫలమవుతారు...!
- 17 hrs ago
రాత్రుల్లో లోదుస్తులు ధరించకుండా ఒక వారం పాటు నిద్రించండి,ఏం జరుగుతుందో చూడండి, ఆశ్చర్యపోతారు
- 19 hrs ago
ముఖాన్ని అందంగా మార్చడానికి ఐస్ క్యూబ్ ఫేషియల్ మసాజ్
Don't Miss
- Finance
మార్చి తర్వాత రూ.5, రూ.10, రూ.100 నోట్లు చెల్లవా? ప్రభుత్వం ఏమంటోంది
- Sports
India vs England: ప్రేక్షకుల మధ్య టీ20 సిరీస్?
- News
బీజేపీ-జనసేన పొత్తుకు సవాల్: ఇద్దరి టార్గెట్ అదొక్కటే: అయినా తొలి అడుగులోనే తడబాటు?
- Movies
శ్రీరాముడిపై మోనాల్ గజ్జర్ అనుచిత వ్యాఖ్యలు: అందుకే అలాంటోడిని చేసుకోనంటూ షాకింగ్‌గా!
- Automobiles
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మీకు ఘీ-కాఫీ (నెయ్యి కాఫీ) గురించి తెలుసా? ఇందులో ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కాదు..
ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ ప్రజలు కాఫీ మీద మక్కువను కలిగి ఉంటారు, తద్వారా కాఫీ అనేది ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం, మరియు ఆదరణ పొందిన పానీయంగా గుర్తింపుని కలిగి ఉంది. కాఫీ మీద అనేకమంది అనేక రకాల ప్రయోగాలు చేస్తూనే ఉంటారు., క్రమంగా ఎన్నో రకాల కాఫీ రెసిపీలు కూడా అందుబాటులోకి వచ్చాయి. అందులో బుల్లెట్ కాఫీ అనేది సుప్రసిద్ధ పానీయంగా చెప్పబడుతుంది. ఇది కీటో డైట్ అనుసరణలో ప్రసిద్ది చెందినది. అంతేకాకుండా.,ఘీ-కాఫీ(నెయ్యితో కాఫీ) అని పిలువబడే మరో రకమైన కాఫీ కూడా ప్రజాదరణ పొందుతోంది.
ఘీ-కాఫీ అంటే ఏమిటి?
వెన్నని కాచిన తర్వాత వచ్చే పదార్ధాన్ని నెయ్యిగా పరిగణిస్తారని మనందరికీ తెలుసు., ఇది పురాతన కాలం నుండి భారతీయ వంటకాలు మరియు ఆయుర్వేద ఔషధాలలో ఎక్కువగా ఉపయోగించబడుతూ ఉంది. నెయ్యి కొంత భాగాన్ని, కాఫీలో కలిపినప్పుడు, బరువు తగ్గడంలో సహాయపడటంతోపాటుగా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాల శ్రేణిని కలిగి ఉన్నట్లుగా చెప్పబడుతుంది. ఘీ- కాఫీ అనేది బట్టర్ కాఫీ కన్నా అత్యంత పోషకమైనదిగా మరియు తియ్యగా ఉంటుంది.

ఘీ-కాఫీ వలన చేకూరే ఆరోగ్య ప్రయోజనాలు :
1. కడుపులో ఆమ్ల ప్రభావాన్ని తగ్గిస్తుంది:
ఆమ్ల ప్రభావానికి గురవుతున్న కారణాన, అనేక మందికి ఖాళీ కడుపుతో కాఫీ తాగడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఈ కాఫీలో కొంత నెయ్యిని జోడించడం ద్వారా ఆమ్లతత్వం మరియు కడుపులో మంట తగ్గుతుంది. ఎందుకంటే ఇందులో బ్యుటిరిక్ యాసిడ్ మరియు ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ గట్ ఆరోగ్యానికి మంచివిగాను, మరియు సంపూర్ణ మద్దతును ఇచ్చేవిలా ఉంటూ, ఆరోగ్యకరమైన జీవక్రియలను ప్రోత్సహిస్తుంది.

2. బరువు తగ్గడానికి సహాయపడుతుంది:
మీరు కీటో డైట్ పాటిస్తూ, ఉదయాన్నే ఘీ - కాఫీ తీసుకోవడం ద్వారా, బరువు తగ్గే అవకాశాలు అధికంగా ఉన్నాయని చెప్పబడుతుంది. మీ శరీరం కీటోసిస్‌లో లేని పక్షంలో, మీరు నెయ్యి కాఫీ తాగుతుంటే మాత్రం మీరు బరువుని నియంత్రించగలుగుతారు. కాఫీ మానసిక సంతృప్తిని అదుపులో ఉంచుతుంది మరియు నియంత్రిస్తుంది. అంతేకాకుండా నెయ్యిలో కార్బోహైడ్రేట్లు ఉండవు., అదనంగా ఒమేగా 3, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి ఎక్కువగా ఉపకరిస్తాయి.

3. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది:
నెయ్యిలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉన్న కారణంగా, నాడీ కణజాలాల పెరుగుదలకు మరియు పనితీరుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా హార్మోన్ల ఉత్పత్తిని కూడా మెరుగుపరుస్తుంది, తద్వారా మీ మానసిక స్థితి స్థిరంగా మరియు సంతోషంగా ఉండేందుకు దోహదపడుతుంది.

4. లాక్టోస్- టోలరెన్స్(అసహనం) ఉన్నవారికి మంచిది :
లాక్టోస్ టోలరెన్స్ ఉన్నవారికి నెయ్యి ఒక అద్భుతమైన ఎంపికగా చెప్పబడుతుంది. ఎందుకంటే నెయ్యి పాలలోని ఘన పదార్థాలు మరియు ప్రోటీన్ల నుండి వేరు చేయబడిన పదార్ధంగా ఉంటుంది. మరియు వెన్నతో పోలిస్తే నెయ్యి కడుపులో ఆమ్ల ఘాడతను తక్కువగా కలిగి ఉంటుంది.

5. శక్తిని పెంచుతుంది:
కాఫీ శక్తిని పెంచుతుంది మరియు క్రమంగా, కాఫీని తీసుకున్నప్పుడు మీ ఏకాగ్రత కూడా పెరుగుతుంది., కాఫీకి నెయ్యిని అదనంగా జోడించడం ద్వారా, దాని శక్తిని పెంచే లక్షణాలను రెట్టింపు చేస్తుంది. కాఫీలో కెఫిన్ ఉంటుంది, ఇది మీ శక్తి స్థాయిలను ఉద్దీపన గావించడానికి కారణమయ్యే పదార్ధంగా ఉంటుంది.

ఘీ-కాఫీ రెసిపీ :
కాఫీ తయారు చేసి, కప్పులో పోసి, 1 లేదా 2 టీస్పూన్ల(మీరు తీసుకునే కాఫీ పరిమాణం ఆధారితం) నెయ్యిని జోడించి బాగుగా కలపండి.

చివరిగా …
కీటో డైట్‌లో ఉన్నవారికి నెయ్యి కాఫీ మంచిదిగా సూచించబడుతుంది. ముఖ్యమైన పోషకాలను మీ శరీరం కోల్పోకుండా చూసుకోవలసి ఉంటుందని మరువకండి. మరియు నెయ్యి కాఫీ నుండి ఎక్కువ లాభం పొందడానికి, ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళిక ఖచ్చితంగా అవసరంగా ఉంటుంది.
ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, మాతృత్వ, శిశు సంక్షేమ, జీవన శైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.