For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజుకు ఎన్నిసార్లు మూత్ర విసర్జన చేయవచ్చు? ఆ పరిస్థితిలో మీరు ఏమి చేయాలనుకుంటున్నారు?

|

మన దినచర్యలో కొన్ని సందర్భాలు, అలవాట్లు మరియు ప్రవర్తనలు వింతగా ఉంటాయి. అవి కొన్ని సమయాల్లో మనకు సందిగ్ధతలను కలిగిస్తాయి. వాటిలో ముఖ్యమైనది మూత్రవిసర్జన. ఎందుకంటే మన మూత్రాన్ని ఎప్పటికప్పుడు బయటకు విసర్జించకుండా మనం నిరోధించలేము. చాలా కొద్ది మంది మాత్రమే అత్యవసర పరిస్థితిని కంట్రోల్ చేయగలుగుతారు.

ఎక్కడో ప్రయాణించేటప్పుడు అత్యవసర పరిస్థితి గదిలో లేనప్పుడు, మీరు ట్రాఫిక్‌లో చిక్కుకుంటే ఏమి చేయస్తారు. ఏమీ చేయలేని పరిస్థితి. ఈ పరిస్థితిలో ఆందోళన చెందకుండా, మనస్సును మరో ప్రక్కకు మళ్లించండి. అలాంటి సమయంలో కంట్రోల్ చేసుకోవాలంటే చిన్న పాటి డాన్స్ చేయండి. జస్ట్ ఉన్న చోటో కాళ్లు, వేళ్ళు కదపండి చాలు, ఇది వెంటనే వెళ్ళాల్సిన అవసరాన్ని నిలుపుతుంది. ఈ రిథమిక్ డిస్ప్లేస్మెంట్ బిహేవియర్ వల్ల కొద్దిసేపటి వరకు యూరిన్ పాస్ చేయాలన్న ఆందోళన తగ్గిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే...అందుకు రెండు కారణాలున్నాయి..

అత్యవసరంగా మూత్రవిసర్జన చేయాలా

అత్యవసరంగా మూత్రవిసర్జన చేయాలా

సాధారణంగా మనం ఆరుబయట ఉన్నప్పుడు, అత్యవసరంగా మూత్రవిసర్జన చేయాలని అనుకుంటారు. అటువంటిప్పుడు కొద్దిసేపు కంట్రోల్ చేయాలంటే ముందుకు అడుగులు వేసుకుంటూ నడవడం వల్ల బ్లాడర్ పై ప్రజర్ తగ్గి రిలీవ్ అవుతుంది. దాంతో కొద్దిసేపటిలో మీకు అనుకూలమైన ప్రదేశం దొరుకుతుంది. అప్పుడు మీరు మీ అవసరాన్ని తీర్చుకోవచ్చు.

 ఈ సమయంలో డ్యాన్స్ చేయాలా?

ఈ సమయంలో డ్యాన్స్ చేయాలా?

అదేవిధంగా రెండు కాళ్ళను నొక్కిపట్టి నిలబడండి. ఇలా చేయడం వల్ల కొద్ది సేపటి వరకు మూత్ర విసర్జనను అణుచుకోవచ్చు. లేదా చిన్న పాటి డ్యాన్స్ చేయండి. అంటే కొంత మందికి కోపం రావచ్చు. ఈ సమయంలో డ్యాన్స్ చేయాలా? కోపగించుకోవడంతో అది చూడటానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది.

మూత్రవిసర్జన అనేది సహజంగా సంభవించే

మూత్రవిసర్జన అనేది సహజంగా సంభవించే

మూత్రవిసర్జన అనేది సహజంగా సంభవించే చర్య. మూత్రపిండాలలో సంకోచం వల్ల మన శరీరం నుండి అనవసరమైన టాక్సిన్స్ మరియు వ్యర్థాలను విసర్జించడం యూరినరీ ట్రాక్ట్. కాబట్టి మన శరీరం యొక్క అతి ముఖ్యమైన పని మూత్ర విసర్జన. కాబట్టి మీరు దానిని కొంత సమయం వరకు నియంత్రించలేరు.

రోజుకు ఎన్నిసార్లు?

రోజుకు ఎన్నిసార్లు?

రోజుకు ఆరు నుండి ఎనిమిది సార్లు మూత్ర విసర్జన చేయడం చాలా మంచిది. ఆరు రెట్లు అంటే మనం సాధారణంగా మూత్ర విసర్జన చేయవచ్చు. మీరు మామూలు కంటే కొంచెం ఎక్కువ నీరు త్రాగటం ప్రారంభిస్తే, అది ఎనిమిది సార్లు అయ్యే అవకాశం ఉంది. కొంతమందికి పదిసార్లు కూడా వెళ్ళే అవకాశం ఉంది. మూత్ర విసర్జన చేసే సంఖ్య పిల్లల్లో ఇంకా ఎక్కువ.

మూత్రం అణచివేత

మూత్రం అణచివేత

మూత్రాన్ని అణచివేయాలనే ఆలోచన కొంత సమయం వరకు సరైనదే. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా మనకు పరిశుభ్రమైన మరుగుదొడ్డి కనబడే వరకు దాన్ని బలవంతంగా అణచివేయడానికి ప్రయత్నిస్తాము. ఆ సమయంలో ఒక చిన్న డ్యాన్స్ చేయండి. అటువంటి పరిస్థితిలో ఎలా నృత్యం చేయాలో మీరు అడగవచ్చు. ఈవిషయంలో ఇది డ్యాన్సింగ్ మూడ్ కాకపోయినప్పటికీ ఈ పరిస్థితిలో డ్యాన్స్ చేయడం, మూవ్ అవ్వడం వల్ల కొంత సమయం మూత్రం అణుచుకోవచ్చని నిపుణులు అంటున్నారు. దానికి రెండు కారణాలు ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం.

అర్జెంట్ అయినప్పుడు డ్యాన్స్ చేయడం ఒక స్ట్రెస్ బస్టర్

అర్జెంట్ అయినప్పుడు డ్యాన్స్ చేయడం ఒక స్ట్రెస్ బస్టర్

కొన్ని పరిస్థితులలో మన ప్రవర్తనలో కొన్ని మార్పులను మనం చూడవచ్చు. ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా ఏదైనా మర్చిపోయినప్పుడు, టెన్షన్ వంటి ప్రతికూల సమయాల్లో మనము మన తలను గోక్కోవడం మరియు గోళ్ళను కొరకడం చేస్తుంటాము. ఇది కూడా ఒక రకమైన స్ట్రెస్ బస్టర్. అటువంటి వాతావరణం వల్ల మూత్రవిసర్జన కొంత సమయం నిపుదల చేసుకోవచ్చు.

చిన్న నృత్యం

చిన్న నృత్యం

రెండవ కారణం ఏమిటంటే, డ్యాన్స్ మన దృష్టిని ఒక విషయం నుండి మరో వైపు మళ్లించడానికి సహాయపడుతుంది. మూత్ర విసర్జన చేయాలనే ఆలోచన మెదడుకు చేరకుండా కొంత సమయం వరకు ఆలోచన మారుతుంది మరియు మిమ్మల్ని నృత్యం చేయిస్తుంది.

వెల్నెస్ అనుభవం

వెల్నెస్ అనుభవం

కానీ దీనికి ప్రత్యామ్నాయాలు ఏమునప్పటికీ చాలా మంది మూత్ర విసర్జన తర్వాత ఊపిరి పీల్చుకుంటారు. మూత్ర విసర్జన నుండి రిలీఫ్ అయిన తర్వాత, "వావ్" అని చెప్పే థ్రిల్ సంతోష పెడుతుంది. కాబట్టి వీలైనంతవరకు దాని నుండి బయటపడండి. లేదా అది చేయడానికి మీకు సరైన ఎంపిక(ప్రదేశం) లేనప్పుడు చిన్న నృత్యం చేయండి.

English summary

why do we dance when we need to pee?

here we are giving some tips to control urination while critical situation. try this.
Story first published: Friday, October 25, 2019, 19:30 [IST]