For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

World Rabies Day 2021: కుక్క కాటు తర్వాత రేబీస్ రాకుండా ఉండాలంటే...

|

ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీన 'వరల్డ్ రేబీస్ డే' జరుపుకుంటారు. కుక్క కరిచినిప్పుడు రేబీస్ లైసావైరస్ వల్ల కలిగే వ్యాధి అయిన రేబీస్ వ్యాధికి వ్యాక్సిన్ ను తొలిసారి కనిపెట్టిన ప్రముఖ శాస్త్రవేత్త లూయిస్ పాశ్చర్(Louis Pasteur)ను స్మరించుకునేందుకు ఈ రోజును జరుపుకుంటారు. రేబీస్ వ్యాధిపై ప్రపంచంలోని ప్రజలందరికీ అవగాహన కల్పిచేందుకు పలు ఎన్ జిఓ, కొన్ని సంఘాలు పని చేస్తున్నాయి. ఈ వ్యాధి వైరస్ సోకిన జంతువులు మనుషులకు కాటు వేయడం ద్వారా సోకుతుంది.

మోర్పిడిటీ అండ్ మెర్జాలిటీ వీక్లీ నివేదిక ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు 59 వేల మంది రేబీస్ వ్యాధికి గురై చనిపోతున్నారు. ఇందులో రేబీస్ కారణంగా మన దేశంలో 36 శాతం వరకు మరణిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా రేబీస్ డే చరిత్ర.. ఈ ఏడాది థీమ్ ఏంటి.. దీని ప్రాముఖ్యత గురించి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ప్రాణాంతక రేబిస్ వ్యాధికి: కారణాలు, లక్షణాలు, రోగ నిర్ధారణ మరియు చికిత్సప్రాణాంతక రేబిస్ వ్యాధికి: కారణాలు, లక్షణాలు, రోగ నిర్ధారణ మరియు చికిత్స

వరల్డ్ రేబీస్ డే చరిత్ర..

వరల్డ్ రేబీస్ డే చరిత్ర..

ప్రపంచ రేబీస్ దినోత్సవాన్ని సెప్టెంబర్ 28వ తేదీన, 2007వ సంవత్సరంలో తొలిసారిగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)తో పాటు రేబీస్ కంట్రోల్ అండ్ ద సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ వారు ప్రారంభించారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం రేబీస్ వ్యాధికి గురికాకుండా అందరికీ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.

రేబీస్ డే ప్రాముఖ్యత..

రేబీస్ డే ప్రాముఖ్యత..

ప్రపంచ రేబీస్ దినోత్సవం సందర్భంగా ఒక ఈవెంట్ నిర్వహించడం.. మీడియాకు సమాచారాన్ని చేరవేయడం, పోస్టర్లు, కరప్రతాలు పంపిణీ చేయడం, కిట్లను పంపిణీ చేయడం.. రేబీస్ నివారణ సంఘంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్యూనిటీలు, ఆరోగ్య సంస్థతో సహా రేబీస్ నియంత్రణ మరియు నివారణకు సంబంధించిన కార్యకలాపాలను ప్రోత్సహించడం వంటివి జరుగుతాయి. అలాగే కుక్కలకు వ్యాక్సిన్లు వేయడం, కుక్క కాటుకు ఎలా చికిత్స చేయాలి మరియు రేబీస్ వైరస్ ను నివారించడానికి మందుల గురించి సమీప ఆసుపత్రులలో దీని లభ్యత గురించి సందేశాన్ని వ్యాప్తి చేయడమే ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

వరల్డ్ రేబీస్ డే థీమ్..

వరల్డ్ రేబీస్ డే థీమ్..

ఈ సంవత్సరం వరల్డ్ రేబీస్ డే థీమ్ ‘Rabies:Facts, Not Fear'ప్రజల నుండి భయాన్ని అంతం చేసేందుకు మరియు వాస్తవాలతో వారిని మరింత శక్తివంతం చేయడం మరియు రేబీస్ థీమ్ గురించి వాస్తవాలను షేర్ చేసుకోవడం మరియు అపొహలను తొలగించుకోవడం.. అవాస్తవాలు వ్యాప్తి చెందకుండా చూడటం.. ఈ థీమ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

రేబీస్ ఎలా సోకుతుందంటే..

రేబీస్ ఎలా సోకుతుందంటే..

ముఖ్యంగా వైరస్ ఉన్న కుక్కలు మనల్ని కరచినప్పుడు.. అదే సమయంలో మన శరీరంపై ఏదైనా గాయాలు ఉన్నప్పుడు.. వాటి మీద కుక్కలు నాలుకతో నాకినప్పుడు మన బాడీలోకి ఈ వైరస్ ప్రవేశిస్తుంది. అలాగే ఇతర జంతువుల నుండి కూడా ఈ వైరస్ సోకే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే నూటికి 99 శాతం కేవలం కుక్కల ద్వారా మాత్రమే ఈ వ్యాధి సోకుతుంది. అయితే కుక్క కరిచిన ప్రతిసారీ ఈ వ్యాధి రాదు. కేవలం ఏ కుక్కలో అయితే రేబీస్ వైరస్ ఉంటుందో అప్పుడే మనకు సోకుతుందని నిపుణులు చెబుతున్నారు.

వీధి కుక్కల్లో..

వీధి కుక్కల్లో..

మన కాలనీల్లో ఉండే వీధి కుక్కల్లో ఈ రేబీస్ మహమ్మారి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కుక్కల్లో ఉండే వైరస్ మన శరీరంలోని నాడులకు చేరుకుని మూడు మిల్లిమీటర్లకు చేరుకుని వ్యాపిస్తుంది. ఇది సోకిన వ్యక్తులు సమయానికి తగిన చికిత్స తీసుకోకపోయినా.. వ్యాక్సిన్ వేసుకోకపోయినా.. రెండు లేదా మూడు వారాల్లో ప్రాణాంతకంగా మారొచ్చు.

అవి పని చేయవు..

అవి పని చేయవు..

రేబీస్ వైరస్ ఉన్న కుక్క కరిచినప్పుడు మనం తగిన సమయంలో వ్యాక్సిన్ తీసుకోకపోతే.. మన గొంతులోని అవయవాలు పెరాలిసిస్ బారిన పడి పని చేయవు. కాబట్టి కుక్క కరిచిన వెంటనే వ్యాక్సిన్ వేసుకోవాలి. అలాగే కుక్క కరిచిన చోట మంచి సబ్బుతో వెంటనే శుభ్రంగా కడుక్కోవాలి. మీకు వీలైతే అయోడిన్ సొల్యూషన్ వేసి కడగాలి. ఇలా చేస్తే రేబీస్ బారిన పడకుండా తప్పించుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఇలా చేయొద్దు..

ఇలా చేయొద్దు..

కొందరు కుక్క కరిచిన ప్రాంతంలో యాసిడ్ వేయడం.. కాల్చడం వంటి పనులు చేస్తారు. అలా చేయడం వల్ల ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఎదురయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మీ చర్మంపై గాయాలను నేరుగా చేతులతో కడగకూడదు. అలాగే గాయం పెద్దగా ఉన్న సమయంలో కుట్లు వేయకూడదు. అవసరమైతే యాంటి సెప్టిక్ లోషన్ రాయండి. అలాగే టీటీ ఇంజెక్షన్ తప్పనిసరిగా తీసుకోండి.

English summary

World Rabies Day 2021: Date, History, Theme And Significance in Telugu

Here we are talking about the world rabies day 2021: date, history, theme and significance in Telugu. Have a look
Story first published: Tuesday, September 28, 2021, 13:21 [IST]