Just In
- 10 hrs ago
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- 13 hrs ago
కూల్ డ్రింక్స్ తాగితే పురుషుల్లో జుట్టు రాలుతుందా?
- 15 hrs ago
4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ అంటే ఏంటి? ఇది ఆందోళనను తగ్గిస్తుందా?
- 18 hrs ago
Chanakya Niti: చాణక్యుడు చెప్పినట్లు ఇలా చేస్తే విజయం దాసోహం అంటుంది
Yoga For Immunity: ఈ యోగాసనాలతో ఇమ్యూనిటీ పెరిగి ఏ రోగాన్నైనా ఎదుర్కోవచ్చు
Yoga For Immunity: వ్యాయామాలు చేయడం మంచి జీవనశైలి. క్రమం తప్పకుండా చేసే వ్యాయామం వల్ల శారీరాక, మానసిక ప్రయోజనాలు చాలా ఉన్నాయి. వ్యాయామం జీవక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
సరైన వ్యాయామాన్ని ఎంచుకునే సాధన చేస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇమ్యూనిటీ మెరుగుపడితే ఏ రోగాన్ని అయినా సులభంగా ఎదుర్కోవచ్చు. మంచి రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులను కరోనా కూడా ఏమీ చేయలేకపోయింది. ప్రాచీన కాలం నుండి సాధన చేస్తున్న యోగా ఆసనాల ద్వారా రోగనిరోధక బలోపేతం అవుతుంది. కొన్ని ఆసనాలు సులంభంగా ఉన్నప్పటికీ వాటి వల్ల మంచి ప్రయోజనం ఉంటుందని నిరూపించబడింది.
ఇక్కడ ఉన్న యోగాసనాలు సాధన చేయడం ద్వారా ఇమ్యూనిటీ మెరుగుపడుతుంది.

బాలాసనం
బాలాసనం ద్వారా చేకూరే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. బాలాసనం సాధన చేయడం ద్వారా బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. ఈ ఆసనం ఒత్తిడి, అలసటను కూడా తగ్గిస్తుంది. మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. మరీ ముఖ్యం రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది.
ఎలా చేయాలి:
* ఫ్లోర్ మీద లేదా బెడ్ మీద కూర్చొని, హిప్ బ్యాక్ పొజిషన్ లో ఫోటోలో చూపిన విధంగా కూర్చోవాలి.
* తర్వాత రెండు చేతులను ముందుకు పూర్తిగా చాపాలి. శరీరం పూర్తిగా విశ్రాంతి తీసుకోనివ్వాలి.
* శ్వాస మీద ఏకాగ్రత పెట్టి, శరీరం, మనస్సు ఫ్రీ చేసుకోవాలి.
* ఈ భంగిమను కొన్ని నిముషాలపాటు చేయాలి.

ధనురాసనం
ధనురాసనం సాధనం చేయడం ద్వారా శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఈ వ్యాయామం జీర్ణ వ్యవస్థనూ మెరుగుపరుస్తుంది. దీని వల్ల ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. మలబద్దకం సమస్యల రాదు.
ఎలా చేయాలి:
* మొదట బోర్లా పడుకోవాలి. తర్వాత కాళ్లను వెనక్కి మడవాలి.
నమీ చేతులతో ఫుట్ జాయింట్ పట్టుకోండి.
* కాళ్ళను గట్టిగా వెనక్కి లాగి, ఉదరం మాత్రమే నేలమీద పడేలా వాటిని పెంచండి.
* మీ కళ్ళు పైకిలేపి ఉంచండి. మీ శరీరం విల్లులా కనిపిస్తుంది.
* ఈ ఆసనం మీ వెన్నెముకను కూడా బలపరుస్తుంది. పునరుత్పత్తి అవయవాలను నిర్వహిస్తుంది. రుతు నొప్పికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది.

భుజంగాసనం
భుజంగాసనం ఊపిరితిత్తులను తెరుస్తుంది. అలాగే వెన్నెముకను బలపరుస్తుంది. ఈ ఆసనం ద్వారా జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. కాలేయంపై ఒత్తిడి తగ్గించడానికి సహాయపడుతుంది. తద్వారా రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది.
ఎలా చేయాలి:
* ముందుగా నేలమీద లేదంటే ఫ్లోర్ మీద క్లాత్ లేదంటే మ్యాట్ వేసుకోవాలి.
* దానిపై బోర్ల పడుకుని మీ గడ్డం నేలకు తాకేలా ఉంచండి. * తర్వాత మీ ఛాతీకి కాస్త పక్కకు మీ అరచేతుల్ని చాచండి.
* ఇక మీ మోచేతులు పైకి ఉండాలి.
* అలాగే మీ పాదాలు ఒక దాన్ని మరొకటి తాకుతూ ఉండాలి. తర్వాత మీరు నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి.
* ఆ సమయంలో మీ బరువు మొత్తాన్ని కూడా అరచేతులపై ఉంచి అరచేతుల సహాయంతో మీ బాడీని పైకి లేపాలి.
* మీ తలను పైకి ఎత్తాలి. మెడ, ముఖంపైకి ఉండేలా చూసుకోవాలి.

పశ్చిమొత్తనాసనం
పశ్చిమొత్తనాసనం లేదా ఫార్వర్డ్ బెండ్ భంగిమ వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. నాసికీ రద్దీ నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. అలాగే ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తుంది. ఇది ప్రశాంతతను చేకూరుస్తుంది. ఈ ఆసనం సాధన చేయడం ద్వారా ఇమ్యూనిటీ మెరుగుపడుతుంది. ఈ యోగా భంగిమ ఉదరంలో పేరుకొన్న కొవ్వును తగ్గిస్తుంది. మరియు వెన్ను నొప్పిని తగ్గిస్తుంది.
ఎలా చేయాలి:
* చక్కగా పడుకుని రెండు పాదాలు దగ్గరగా ఉంచి రెండు చేతులు తలపైకి లేపి నేలకానించి గాలి పీలుస్తూ లేచి కుర్చుని గాలి వదులుతూ ముందుకు వంగాలి.
* తల మోకాళ్ళ వైపు, చేతులు పాదాల వైపు పోనిచ్చి వాటిని అన్చాడానికి ప్రయత్నిచాలి.
* ప్రారంభంలో తల మోకాళ్ళకు తగలకపోవచ్చు, చేతులు పాదాలకు అందకపోవచ్చు, కాని రోజు సాదన వల్ల సాధ్యమవుతుంది.
* తిరిగి పడుకుని మళ్ళీ మళీళి లేస్తూ ఈ ఆసనం చేయాలి. * కనీసం 5 నుండి 20 సార్లు చేయాలి.

శవాసనం
శవాసనం చాలా సులభమైన అలాగే విశ్రాంతిని ఇచ్చే ఆసనం. ఈ భంగిమలో శ్వాస చక్కగా తీసుకోవడానికి వీలు ఉంటుంది. అలాగే మనస్సును ప్రశాంతంగా ఉంచుంది.
ఎలా చేయాలి:
* చేతులు, కాళ్లు చాపి వీపుపై హాయిగా పడుకోవాలి.
* కళ్లు మూసుకుని, ముక్కు ద్వారా నెమ్మదిగా గాలి పీల్చుకోవాలి.
* ఈ భంగిమలో 10 నిమిషాల పాటు ఉండాలి.