Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
సౌకర్యవంతమైన బెడ్ రూమ్ కి బెడ్ సెలక్షన్ ఎలా ఉండాలి..?

మాస్టర్ బెడ్‌రూమ్: బెడ్ లను ఎంచుకునే ముందు గది కొలతలు, థీమ్ ని దృష్టిలో పెట్టుకోవాలి. గది విశాలంగా ఉంటే.. కింగ్ సైజ్ బెడ్ ని సెలక్ట్ చేసుకోవచ్చు. అపార్ట్ మెంట్ ల కారణంగా ఇప్పుడు ఈ గదులు కొంచెం చిన్నగానే ఉంటున్నాయి. వాటికి తగ్గట్టు బెడ్స్ ను ఎంచుకోవాలి. ఈ చిన్న గదుల్లో అన్ని వస్తువులను సర్దడం చాలా కష్టం. స్టోరేజ్ కోసం బెడ్ కింద పుల్ అవుట్ లు వస్తాయి. అంటే సొరుగులలాగా ఉంటాయన్నమాట. వీటిలో బెడ్‌షీట్‌లు, మెత్తలను, ఇంకేవైనా సామాన్లను సర్దేయొచ్చు. ఈ బెడ్ హెడ్ బోర్డ్ లకు లెదర్ ఉపయోగిస్తే బాగుంటుంది. ఎందుకంటే.. కూర్చొని చదువుకోవడానికి అనువుగా ఉంటుంది.
గెస్ట్ రూమ్: ఈ గదిలో సింగిల్ బెడ్ వేస్తే సరిపోతుంది. ఒకవేళ చుట్టాలు ఎక్కువ వస్తారనుకుంటే పుల్ అవుట్ బెడ్ ఎంచుకోవాలి. సోఫా కమ్ బెడ్ తీసుకుంటే మరీ మంచిది.
చిల్డ్రన్స్ రూమ్: సంతానం ఒక్కరే అయితే సింగిల్ బెడ్ వేసుకుంటే సరిపోతుంది. ఇద్దరు, ముగ్గురు ఉంటే మాత్రం బంకర్ బెడ్స్ ని ఎంచుకోవాలి. దీనివల్ల స్థలం కూడా కలిసి వస్తుంది. అయితే ఇవి కూడా పలు ఆకారాల్లో దొరుకుతాయి. అబ్బాయిలకు అయితే కారు, జీపు షేపుల్లో, అమ్మాయిలకైతే.. పువ్వుల ఆకారంలో ఉన్న బెడ్స్ ఎంచుకుంటే వాళ్లు కూడా కొత్తదనంగా ఫీలవుతారు.



Click it and Unblock the Notifications