For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చీమలకు లక్షణ రేఖలా పనిచేసే.. హోం రెమిడీస్.. !

By Swathi
|

వంటగదిలో అన్నీ టేస్టీ ఐటమ్స్ ఉంటాయి. ముఖ్యంగా పంచదార, స్వీట్స్, మిక్చర్, స్కాక్స్ ఇలాంటి ఐటమ్స్ అన్నీ నిల్వ చేసుకుంటూ ఉంటారు. వీటిని ఎక్కడ పెట్టామా అన్న విషయం మనుషులైనా త్వరగా గుర్తించలేరేమో కానీ.. చీమలు మాత్రం ఇట్టే పసిగట్టేస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయో గానీ.. తీపి రుచి, వాసన గుర్తించగానే.. చటుక్కున చుట్టుముడతాయి.

చీమలు చేరాయంటే.. వాటిని తరిమికొట్టడం అంత తేలిక కాదు. సన్నగా ఉండే వాటిని చంపలేక, బయటకు పంపలేక ఇల్లాలు చాలా ఇబ్బందిపడుతూ ఉంటుంది. అయితే వీటిని తరిమికొట్టడానికి సింపుల్ హోం రెమిడీస్ ఉన్నాయి. వాటిని నిమిషాల్లో మీకు కనిపించకుండా మాయం చేసేస్తాయి.

ఈ హోం రెమిడీస్ లో ఎసిడిక్ గుణాలు ఉండటం వల్ల.. చీమలు వెళ్లిపోయేలా చేస్తాయి. సింపుల్ గా ఈ పదార్థాలను చీమలు ఉన్న ప్రాంతంలో చిలకరిస్తే చాలు.. నిమిషాల్లో చీమలు వెళ్లిపోతాయి. ఇవి చాలా పవర్ ఫుల్ గా పనిచేస్తాయి. మరి అవేంటో ఇప్పుడే చూడండి..

నిమ్మరసం

నిమ్మరసం

వంటింట్లో చీమలు నివారించడంలో నిమ్మరసం పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. ఒక నిమ్మకాయ రసానికి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కలిపి బాగా మిక్స్ చేయాలి. దీన్ని చీమలు ఉన్న ప్రాంతాల్లో స్ప్రే చేయాలి. అంతే.. సింపుల్ ఉదయానికల్లా చీమలు పారిపోతాయి.

దాల్చిన చెక్క పొడి

దాల్చిన చెక్క పొడి

స్పైసీగా ఉండే దాల్చిన చెక్క పొడి చీమలు నివారించడానికి పర్ఫెక్ట్ రెమెడీ. రాత్రి పడుకోవడానికి ముందు కొద్దిగా దాల్చిన చెక్క పొడిని చీమలు ఉన్న దగ్గర చల్లితే చాలు.. ఉదయానికి అవి దూరమవుతాయి.

మిరియాల పొడి

మిరియాల పొడి

దాల్చిన చెక్క పొడిలాగే.. మిరియాల పొడి చాలా పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడిని, ఒక కప్పు వేడినీటిలో కలపాలి. చీమలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో ఈ నీటిని స్ప్రే చేస్తే.. చీమలు మాయమవుతాయి.

మరుగుతున్న నీళ్లు

మరుగుతున్న నీళ్లు

ఒక కప్పు మరుగుతున్న నీటిలో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, కారం కలపాలి. నీళ్లు వేడిగా ఉన్నప్పుడే.. చీమలు ఉన్న దగ్గర చల్లాలి. అంతే.. క్షణాల్లో చీమలు మాయమవుతాయి.

వెనిగర్

వెనిగర్

బ్లాక్ వెనిగర్ చీమలు నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కొద్దిగా బ్లాక్ వెనిగర్ తీసుకుని చీమలు ఉన్న ప్రాంతంలో స్ప్రే చేస్తే చాలు.. అవి ఆ వానసకు బయటకు వెళ్లిపోతాయి.

వెల్లుల్లి

వెల్లుల్లి

కొన్ని వెల్లుల్లి రెబ్బలను నలిపి.. చీమలు ఉన్న ప్రాంతంలో పెట్టాలి. అంతే.. కాసేపటికే.. చీమలు కనిపించవు.

పుదీనా

పుదీనా

కొన్ని ఎండిన పుదీనా ఆకులను నలిపి.. చీమలు ఉన్న ప్రాంతంలో చల్లాలి. ఆ ఘాటు వాసన తట్టుకోలేక చీమలు.. కనిపించకుండా పోతాయి.

బొద్దింకలు కూడా

బొద్దింకలు కూడా

రాత్రిపడుకునే ముందు వీటిని ఉపయోగిస్తే.. చీమలే కాదు బొద్దింకలు, బల్లులు కూడా ఈ పదార్థాలు చల్లడం వల్ల.. నివారించబడతాయి.

English summary

5 Home Remedies That Get Rid Of Kitchen Ants

5 Home Remedies That Get Rid Of Kitchen Ants. On the other hand, since these ingredients are ever so powerful, they have the ability to also get rid of other pests in the kitchen.
Story first published:Wednesday, June 15, 2016, 16:02 [IST]
Desktop Bottom Promotion