వర్కింగ్ మహిళలకు 10 ఉపయోగకరమైన వంట చిట్కాలు

Posted By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

ఈ రోజుల్లో ఎక్కువమంది మహిళలు పని చేయడం ప్రారంభించారు. ఇలాంటి మహిళలలకి సపోర్ట్ గా వారి తల్లిదండ్రులు లేదా అత్తగారు వారితో పాటువుంటూ వారికి సహాయం చేస్తున్న రోజులు ఇవి.

ఈ రోజుల్లో అనేకమంది ప్రజలు తమ ఉద్యోగాల కోసం విదేశాల్లో లేదా దూర ప్రదేశాల్లో వుండటం వలన పేరెంట్స్ దగ్గర నుండి ఎటువంటి సహాయం పొందలేకపోతున్నారు.

వేరే ఇతర కారణాలవలన ఇతరులనుండి సహాయాన్ని పొందలేకపోతున్నారు. కాబట్టి మీకోసం ప్రత్యేకంగా ఎంతో సులభంగా మీరు 15-30 నిమిషాలలోనే సిద్ధం చేసుకొనే కొన్ని రెసిపీ లిస్ట్ ఇక్కడ ఇవ్వబడింది.ఇది మార్నింగ్ టైమ్స్ లో వీక్ డేస్ లోఅలాగే సాయంత్రం వేళ అలసటతో వచ్చిన మీకు ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది.

10 Useful Cooking Tips For Working Women, ,

మీ బిజీ వీక్ డేస్ లో మీరు ఎక్కువగా శ్రమపడకుండా మీకు కాస్తంత రిలాక్స్ ని ఇవ్వడానికి మీతో

కొన్ని చిట్కాలను నేను పంచుకోవాలనుకుంటున్నాను. నేను కూడా మీలాగే పనిచేస్తు పూర్తి కుటుంబాన్ని చూసుకుంటున్న ఒక మహిళని. ప్రతి ఒక్కరూ వారి జీవితాన్ని సులభతరం చేయడానికి తమ స్వంత ఆలోచనలను కలిగి ఉంటారు. కుటుంబం మరియు కెరీర్ ని ఒకే విధంగా సమతుల్యం చేయడానికి ప్రయత్నిస్తున్న అందరి యువకుల కోసం ఇక్కడ కొన్ని విషయాలను నేను పంచుకోవాలనుకుంటున్నాను.

ప్రణాళికను... సిద్ధం చేసుకోండి....

ప్రణాళికను... సిద్ధం చేసుకోండి....

వీక్ డేస్ లో ప్రశాంతగా ఉండటానికి మీరు వీకెండ్స్ లోనే ప్లాన్ చేసుకోవాలి. ముందుగానే ఏం చేయాలని ఒక ప్లాన్ ని సిద్ధం చేసుకోవడం చాలా ముఖ్యమైనది మరియు అలాగే అవసరమైన కొన్ని పదార్ధాలను కూడా కొనడం చాలా మంచిది. ఇలా చేయడం వలన మీకు వారంలో చాలా సమయం ఆదా అవుతుంది.

బల్క్ లో బ్యాటర్ ...

బల్క్ లో బ్యాటర్ ...

వారాంతాల్లో నేను ఇడ్లి / దోస బాటర్ మరియు అప్పం బాటర్ ని రుబ్బి సిద్ధంగా ఉంచుకుంటాను . బ్రేక్ఫాస్ట్, విందు లేదా సాయంత్రం స్నాక్స్ కోసం మీరు త్వరగా ఇడ్లీ, దోస, అప్పం , కుజ్పీనియారామ్ మరియు ఊతప్పం తయారు చేసుకోవచ్చు. ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు చేయడానికి దానిలో కొంచం రాగి పిండి, వోట్స్ లేదా కొన్ని చిన్న వెజిటల్స్ ని ముక్కలుగా చేసుకొని కలపాలి.

ఆటా డౌ ....

ఆటా డౌ ....

మీరు చపతి / పూరి పిండి ని బాగా కలిపి తయారు చేసి రిఫ్రిజిరేటర్లో ఉంచవచ్చు. వారం రోజులలో మీరు చేయాల్సిందల్లా డౌ యొక్క భాగాన్ని తొలగించండి, పిండితో రోటిస్ లేదా పూరీలు చేయండి. మీరు చపాతీలను 10 సెకన్ల మైక్రోవేవ్ లో ఉంచి వేడిచేయడం ద్వారా వెంటనే పొందవచ్చు.

బ్రెడ్ ...

బ్రెడ్ ...

బ్రెడ్ ప్యాకెట్ ఇంట్లో ఎల్లప్పుడూ అందుబాటులో వుండటం వలన ఎంతో త్వరగా శాండ్విచ్, బ్రెడ్ ఆమ్లెట్ లేదా ఫ్రెంచ్ టోస్ట్ ని తయారు చేయడానికి ఉపయోగపడుతుంది.

కాండిమెంట్స్ చక్కగా ఉపయోగపడతాయి.

కాండిమెంట్స్ చక్కగా ఉపయోగపడతాయి.

నేను కూడా కొన్ని పచ్చళ్ళు, ఇడ్లీ పొడి, కరివేపాకు పొడి ని అన్ని సమయాల్లో అందుబాటులో ఉండాలనుకుంటాను. వారాంతాల్లో టొమాటో చట్నీ లేదా ఆకుపచ్చ పచ్చడి, పెరుగు పచ్చడి మరియు కొన్ని పచ్చడిని సిద్ధం చేసి ఫ్రిజ్లో ఉంచుకుంటాను అవి ఇడ్లి, దోస, చపాతీస్ మొదలైన వాటిలో సైడ్ డిష్ గా ఉపయోగించవచ్చు. వీటిని సాండ్విచ్, చాట్స్ మొదలైన వాటికి కూడా ఉపయోగిస్తారు.

ఇన్స్టంట్ వంట ఉత్పత్తులు ...

ఇన్స్టంట్ వంట ఉత్పత్తులు ...

నూడుల్స్, వోట్స్, సేవి, పోహా తదితర ఉత్పత్తులను ఎల్లప్పుడూ వంటగదిలో కలిగి ఉండటం మంచిది. నాకు సాధారణంగా నూడుల్స్ ని తయారు చేసి ఆమ్లెట్ తో సర్వ్ చేయడం ఇష్టం లేదా ఎగ్ నూడుల్స్ ని తయారు చేస్తాను. వోట్స్ తో ఏ ఇతర పండ్లను జత చేయడం అనేది చాలా ఆరోగ్యకరమైన మరియు పొట్టను తొందరగా నింపడానికి ఒక మార్గం. ఇక్కడ ఇచ్చిన సూచనల ప్రకారం ఇతర ఇన్స్టంట్ ఉత్పత్తులను కూడా తయారు చేయవచ్చు.

తురిమిన కొబ్బరి.....

తురిమిన కొబ్బరి.....

దక్షిణ భారతీయుల వంటలలో కొబ్బరి ఒక భాగం. ఇది కొబ్బరి ని చిన్న చిన్న ముక్కలుగా లేదా తురిమి ఒక వారం వరకు ఫ్రిజ్లో గాలి చొరబడని కంటైనర్లో నిల్వ ఉంచితే మనకి అవసరమైనప్పుడు ఉపయోగపడుతుంది.

ఉల్లిపాయ-టమోటో మసాలా ...

ఉల్లిపాయ-టమోటో మసాలా ...

ఉత్తర భారతీయులకు ఉల్లిపాయ-టమోటా మసాలా అనేక రకాల వంటలలో భాగం. మీరు మసాలా ని ఎక్కువ మొత్తంలో తయారు చేసుకొని మరియు ఫ్రిడ్జ్ లో నిల్వ వుంచుకోవచ్చు.అవసరమైనప్పుడు, మసాలా ని కొన్ని స్పూన్లు తీసుకొని,వండిన కూరగాయలతో కలిపి సబ్జిలను తయారుచేయవచ్చు.

అల్లం-వెల్లుల్లి పేస్ట్ ...

అల్లం-వెల్లుల్లి పేస్ట్ ...

నేను ఎల్లప్పుడూ రిఫ్రిజిరేటర్ లో కొంచం అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వుంచుతాను, అలాగే అది వెల్లుల్లి, చిన్న ఉల్లిపాయల తొక్క ని తీసి ఫ్రిడ్జ్ లో ఉంచుకోవడం వలన మన వంట పని మరింత సులభతరమవుతుంది.. కరివేపాకు, కొత్తిమీర ఆకులను కడిగి, ఆరబెట్టి, సిద్ధంగా ఉంచుకోవడం ద్వారా వీక్ డేస్ లో మన సమయం ఆదా అవుతుంది.

నాన్-వెజ్ ని శుభ్రపరిచి నిల్వవుంచుకోండి...

నాన్-వెజ్ ని శుభ్రపరిచి నిల్వవుంచుకోండి...

ముఖ్యంగా మాంసాహారం తినేవాళ్ళు కోసం, ఎల్లప్పుడూ గుడ్లు, చేప మరియు కొన్ని మాంసాలు ఫ్రిజ్లో కలిగివుండటం వలన సహాయపడుతుంది. నేను సామాన్యంగా మాంసం మరియు చేపలను భారీగా కొనుగోలు చేసి వారం చివరలో శుభ్రం చేస్తాను. మీకు కలసిన పరిమాణం ప్రకారం చిన్న ప్యాక్లను తయారు చేయండి, మీ రుచి కోసం కొన్ని సుగంధ ద్రవ్యాలు జోడించండి మరియు ఫ్రిడ్జ్ లో ఉంచండి.అవసరమైనప్పుడు కేవలం ప్యాక్ ని తీసుకొని మరియు ఫ్రై చేసుకోండి లేదా సమయం ఉంటే ఉడికించాలి.

ఈ చిట్కాలను అనుసరించి మీ వృత్తిని మరియు వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసేందుకు ప్రయత్నించండి.

English summary

10 Useful Cooking Tips For Working Women

Here I would like to share a few tips to make your busy weekdays little relaxed. I am from a family full of working ladies. Each of them have their own tricks to make life easier. I would like to share a few of them here for all the youngsters who are trying to balance between family and career.
Story first published: Thursday, October 5, 2017, 15:05 [IST]