For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ ఇంటిలోని గోడలను పరిశుభ్రంగా ఉంచగల కొన్ని చిట్కాలు !

|

పరిశుభ్రత అనేది దైవత్వానికి ప్రతీక, ఆ విధంగా శుభ్రంగా ఉన్న మీ ఇంటిని శోభాయమానంగా ఉంచుతుందనేది నిర్ధారించబడే వాస్తవము. ఇప్పుడు, పరిశుభ్రమైన ఇంటి గురించి మాట్లాడేటప్పుడు ఆ ఇంటి ప్రధాన భాగమైన నాలుగు గోడలు గురించే అందరికీ ఆలోచన వస్తుంది. మీ ఇంటిని శుభ్రం చేసుకోగలా ఏకైక మార్గం దాని గోడలు ఎలాంటి మచ్చలను, మరకలను కలిగి లేనట్లుగా చూసుకోవడం చాలా ముఖ్యం.

అయితే ప్రతిరోజు గాలి ద్వారా వ్యాపించే దుమ్ము, ధూళి గోడలపైకి చేరడం, ఆ గోడలను శుభ్రం చేయడం కోసం సరైన సమయము & శారీరకశ్రమ అవసరమవుతాయి. కాబట్టి మనము తరచుగా గోడల పరిశుభ్రంగా ఉంచడంలో నిర్లక్ష్యం చేస్తున్నాం.

ఈ క్రింద తెలియపరిచిన చిట్కాలను పాటించడం వల్ల మీ గోడలను ఎల్లప్పుడు పరిశుభ్రంగా ఉంచవచ్చు.

1. గోడలపై ఉన్న దుమ్ము & ధూళి :

1. గోడలపై ఉన్న దుమ్ము & ధూళి :

మీరు ఒక మైక్రో ఫైబర్ బట్టను తీసుకుని దానితో గోడలపై ఉన్న బూజును, దుమ్ము, ధూళిని పూర్తిగా శుభ్రపరిచాలి. ఇలా శుభ్రం చేసేటప్పుడు గోడలకు తగిలించి ఉంచే వస్తువులను, క్యాలెండర్ వంటి ఇతర సామాన్లను ఏమాత్రం తీయనవసరం లేదు. గోడలను ఇలా ఎంత శుభ్రం చేసిన కూడా కంటికి కనిపించని రీతిలో దుమ్మును కలిగి ఉంటాయి కాబట్టి, గోడల మీద ఏ భాగంలో ఎక్కువ మరకలు దుమ్ములు ఉంటాయో దానిపైనే ప్రత్యేక శ్రద్ధను వహించాలి. దీనికోసం మీరు తెల్లని గుడ్డతో (లేదా)

సాఫ్ట్ బ్రష్తో వాక్యూమింగ్ చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.

2. మీ పిల్లలకు శుభ్రతను నేర్పించండి :

2. మీ పిల్లలకు శుభ్రతను నేర్పించండి :

పిల్లల జీవితాలు రంగులతో కూడిన హరివిల్లులా చాలా అందంగా ఉంటాయి, వారి జీవితాల్లో అదే అనుకూలతను కలిగి ఉండేటట్లుగా చూసుకోవడమే తల్లిదండ్రుల బాధ్యత అని పెద్దలందరూ తెలుసుకోవడం మంచిది. అయితే మీ ఇంటి గోడలు పిల్లలకు కాన్వాస్ కాకూడదు, అందుకోసం మీరు పిల్లలకు ఎల్లప్పుడూ గోడలపై రాయకూడదని చెప్పడం ద్వారా మీ గోడలు శుభ్రంగా ఉంటాయి అని మేము ఖచ్చితంగా భరోసా ఇవ్వడం లేదు కానీ, మీపిల్లల జీవిత ప్రయాణానికి ఇలాంటి విషయాలు చాలా దోహదపడతాయని మీకు గుర్తు చేస్తున్నాము.

3. వంటగది, బాత్రూం గోడలను శుభ్రపరుచుకోవాలి :

3. వంటగది, బాత్రూం గోడలను శుభ్రపరుచుకోవాలి :

ఇంటి వెలుపలి భాగంలో అనగా వంటగది & స్నానపు గదిలో వున్న గోడలు ఎక్కువగా (వంటలు వండేటప్పుడు విడుదలయ్యే నూనె, గ్రీజు వంటి అవశేషాల కారణంగా) పాడవడానికి ఆస్కారముందని గుర్తుంచుకోండి. అలా మీరు ఇంటిని పూర్తిగా శుభ్రం చేయాలనుకున్నప్పుడు మొదటిగా వంటగది, బాత్రూం గోడలను శుభ్రంగా ఉండేలాగా నిర్ధారించుకోండి. అలా గోడలను శుభ్రం చేసిన తర్వాత ఆ పాత టవల్ సాయంతో ఆ గోడలు పొడిగా ఉండేలా చూసుకోండి.

4. ఈ చిట్కాతో ఇంటి గోడలను శుభ్రం చేసుకోండి :

4. ఈ చిట్కాతో ఇంటి గోడలను శుభ్రం చేసుకోండి :

అందుకోసం, ఒక కప్పు బొరాక్స్ పౌడర్కి, 2 టేబుల్స్పూన్ల డిష్ వాష్ లిక్విడ్ను & అంతే మొత్తంలో గల నీటిని జోడించి వాటన్నింటినీ బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని పెయింటింగ్లను (లేదా) డిజైన్లను కలిగిన గోడలను శుభ్రం చేయడానికి ముఖ్యంగా వాడతారు. ఇలా తయారుచేసుకున్న ఈ మిశ్రమము మార్కెట్లో అందుబాటులో ఉన్న రెడీమేడ్ క్లీనింగ్ కంటే తక్కువ ధరను కలిగి, ప్రభావంతమైన పనితీరును కలిగి ఉండటంవల్ల గోడలపై మచ్చలను తొలగించి పూర్తిగా శుభ్రపరుస్తుంది.

5. పెయింటింగ్ ఉన్న గోడను శుభ్రపరిచే ముందు, పరీక్షించండి :

5. పెయింటింగ్ ఉన్న గోడను శుభ్రపరిచే ముందు, పరీక్షించండి :

ఈరోజుల్లో చాలామంది ఇళ్లలో ఉపయోగించబడే వాల్ పెయింటింగ్లు నీటితో శుభ్రంగా కడుక్కుని శుభ్రం చేసుకునే విధంగా ఉన్నాయి. అయినప్పటికీ మీరు జాగ్రత్త వహించడం చాలా మంచిది, పెయింటింగ్ ఉన్న గోడను శుభ్రపరిచే ముందు ఆల్వాల్ పెయింటింగ్లో ఉన్న నిర్దిష్టమైన ప్రదేశాలను పరీక్షించి చూడండి. ఆ వాల్ పెయింటింగ్లో ఉన్న నాణ్యత క్రమంగా తగ్గుతున్నట్లు గమనించినట్లయితే, ఆ గోడలను వాష్ చేయకూడదని నిర్ధారించుి నిర్ధారించుకోండి.

6. నష్టాన్ని నివారించండి :

6. నష్టాన్ని నివారించండి :

మీరు నివసిస్తున్న ఇంటి గది గోడలు చిన్నచిన్న నష్టాలకి గురవుతున్నప్పుడు, భవిష్యత్తులో అవి ఇంకా పెద్దవిగా అవడానికి ఆస్కారముంది. అలాంటప్పుడు దీర్ఘకాలంలో వాటిల్లే నష్టాలను నివారించడానికి ఉత్తమమైన మార్గం ఏమిటంటే, గోడలు నష్టానికి గురి కాబోతోందని మీరు గుర్తించిన వెంటనే ఆ ప్రాంతంలో ఉన్న ఆ పెయింటింగ్ను తీసేసి, అక్కడ ఏర్పడిన రంధ్రాలను పూరించండి. ఆ ప్రాంతం చుట్టూ ఉన్న పరిసరాలకు అనుగుణంగా సరిపోయే పెయింటింగ్ను వేయండి.

English summary

Tips to keep your wall clean

Tips to keep your wall clean,Here are the simple tips to keep your wall clean and neat all the time. Read to know more about the cleaning tips for wall.
Story first published: Thursday, April 26, 2018, 18:00 [IST]
Desktop Bottom Promotion