రియ‌ల్ స్టోరీ: 10ఏళ్ల బాలుడికి క్యాన్స‌ర్, ఫోటోలు చూస్తే మ‌న‌సు క‌ర‌గాల్సిందే!

Posted By: sujeeth kumar
Subscribe to Boldsky

క్యాలిఫోరియాకు చెందిన‌ డెరెక్ మాన్సెన్ కు న్యూరో బ్లాస్టోమా అనే క్యాన్స‌ర్ వ్యాధి చివ‌రి ద‌శ‌లో ఉన్న‌ట్టు క‌నుగొన్నారు. ఇది పిల్ల‌ల్లో వ‌చ్చే అరుదైన రుగ్మ‌త‌.

డెరెక్ స్నేహితులు, క‌జిన్స్ స‌మ్మ‌ర్ హాలిడేస్ కోసం ప్లాన్ చేస్తుంటే, డెరెక్ మాత్రం వాళ్ల త‌ల్లితో క‌లిసి క్యాన్స‌ర్‌ను పోరాడేందుకు సిద్ధ‌మ‌య్యాడు.

అత‌డి చివ‌రి ఘ‌డియ‌ల‌ను రెనీ సి బేయ‌ర్ అనే ఫొటోగ్రాఫ‌ర్ చిత్రీక‌రించాడు. చివ‌రి మ‌జిలీల‌ను అద్భుతంగా తీశాడు. అది చూస్తే ఎవ‌రి మ‌న‌సైనా క‌రిగిపోవాల్సిందే.

అత‌డి బాధ‌, పోరాటం, ఆనందం, సంతోష‌పు జ్ఞాప‌కాల‌ను చిత్త‌ర‌వుల్లో చూడండి.

అత‌డి సంతోషం..

అత‌డి సంతోషం..

ఈ చిత్రంలో డెరెక్ త‌ల్లి సిండీ అత‌డ్ని బ‌య‌ట చ‌ల్ల‌గాలికి తీసుకెళ్లింది. ఆ అబ్బాయి వెన్నెముక్క ప‌రీక్షల కోసం స్థానిక క్యాన్స‌ర్ ఆసుప‌త్రికి వెళ్లిన‌ప్పుడు తీసిన ఫొటో అని సంబంధిత వ‌ర్గాలు చెబుతున్నారు.

మ‌న‌సును ద‌హించే క్ష‌ణాలు

మ‌న‌సును ద‌హించే క్ష‌ణాలు

డెరెక్ త‌ల్లి అత‌డికి క్యాన్స‌ర్ వ్యాధి గురించి వివ‌రిస్తున్న వైనం. డాక్ట‌ర్లు అత‌డికి ప‌గ‌లు, రాత్రి సంర‌క్ష‌ణ అవ‌స‌ర‌మ‌ని చెబుతున్నారు. సిండీ ఆమె న‌డిపించే సెలూన్‌ను మూసివేసి కొడుకును చూసుకోవాల‌ని నిశ్చ‌యించుకుంది.

ప్రేమానురాగాలు ఇలా..

ప్రేమానురాగాలు ఇలా..

డెరెక్ త‌ల్లి అత‌డ్ని కౌగిలించుకొని ఆప‌రేష‌న్ కోసం క‌న్నీటీతో పంపిస్తున్న దృశ్యం. డెరెక్ పొత్త‌క‌డుపులో క‌ణ‌తిని డాక్ట‌ర్లు తొల‌గించాల్సి ఉంది.

స‌ర‌దా క్ష‌ణాలు

స‌ర‌దా క్ష‌ణాలు

డెరెక్ తాను చ‌నిపోతాన‌ని తెలిసినా... చిన్న పిల్లాడు క‌దా.. ఏం చేస్తాడు. త‌న త‌ల్లిని స‌ర్‌ప్రైజ్ చేసేందుకు ఇలా గోడ ఎక్కి నిల్చున్నాడు. అత‌డి త‌ల్లి కిందికి దించేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.

ఆప‌రేష‌న్ స‌మ‌యంలో...

ఆప‌రేష‌న్ స‌మ‌యంలో...

ఆప‌రేష‌న్ జ‌రిగేట‌ప్పుడు త‌ల్లి ప‌క్క‌నే ఉండాల‌నుకుంటాడు. మ‌త్తు మందు ఇచ్చి ఆప‌రేష‌న్ మొద‌లుపెట్టే స‌మ‌యానికి ఆమె బ‌య‌ట‌కు వెళ్లిపోయేది.

సోద‌రుడి స‌హ‌కారం

సోద‌రుడి స‌హ‌కారం

డెరెక్ సోద‌రుడు మికా అత‌డికి ఎప్పుడూ స‌హ‌కారంగా ఉండేవాడు. ఈ చిత్రంలో అత‌డు చేతులు ప‌ట్టుకొని ఉండ‌డాన్ని చూడ‌వ‌చ్చు. రేడియేష‌న్ ట్రీట్‌మెంట్ కోసం వెళ్లేట‌ప్పుడు అత‌డి బాధ‌ను స్ప‌ష్టంగా చూడ‌వ‌చ్చు.

బ‌ల‌హీన క్ష‌ణాల్లో

బ‌ల‌హీన క్ష‌ణాల్లో

అంత‌టి బాధాక‌ర‌మైన ట్రీట్‌మెంట్‌ను కొన‌సాగిస్తున్న‌ప్పుడు డెరెక్ బ‌ల‌హీన‌ప‌డేవాడు. అత‌డి త‌ల్లి స‌ముదాయించేది. అత‌డికి ఇంటికెళ్లాల‌ని అనిపించేది.

ఆనంద స‌మ‌యాలు

ఆనంద స‌మ‌యాలు

డెరెక్ ట్రీట్‌మెంట్ కొన‌సాగించేందుకు ఒప్పుకుంటే అత‌డి త‌ల్లి కారును న‌డిపేందుకు అనుమ‌తిస్తాను అని చెప్పేది. ఈ ఫొటో తీశాక సిండీకి డాక్ట‌ర్‌నుంచి ఫోన్ వ‌చ్చింది. డెరెక్ చాలా కొద్ది కాల‌మే బ‌తుకుతాడ‌ని.

క్యాన్స‌ర్ ముదిరిన‌ప్పుడు..

క్యాన్స‌ర్ ముదిరిన‌ప్పుడు..

క్యాన్స‌ర్ బాగా ముదిరిపోయి ఎడ‌మ కంటిలో క‌ణ‌తి ఏర్ప‌డింది. చిత్రం బ్యాక్ గ్రౌండ్‌లో ఒక వాల్‌పేప‌ర్ ఉంది. ఇది త‌న ఫేవ‌రేట్ రెస్టారెంట్‌లో తీసింద‌ని చెబుతారు.

త‌ల్లి భావోద్వేగం

త‌ల్లి భావోద్వేగం

సిండీ ప్రాణ‌స్నేహితురాలు కెల్లీ. డెరెక్ విష‌యంలో ఆమెను ఓదారుస్తూ వ‌చ్చేది. డెరెక్ రోజురోజుకూ బ‌ల‌హీన ప‌డుతుంటే త‌ల్లి త‌న భావోద్వేగాన్ని దాచుకోలేక‌పోయేది. అత‌డి ముందే రోదించేది.

అత‌డి బాధ వ‌ర్ణ‌నాతీతం

అత‌డి బాధ వ‌ర్ణ‌నాతీతం

డెరెక్ న‌డిచేందుకు చాలా క‌ష్ట‌ప‌డేవాడు. అత‌డి క‌డుపులోని క‌ణ‌తి విప‌రీతంగా పెరిగిపోయింది. ఈ పాటికి అత‌డి త‌ల‌లో మ‌రో క‌ణ‌తి ఏర్ప‌డింది. అది అత‌డి చూపును న‌శింప‌జేసింది.

రోజు రోజుకు బ‌ల‌హీనమైపోయాడు..

రోజు రోజుకు బ‌ల‌హీనమైపోయాడు..

క్యాన్స‌ర్ రోజురోజుకు బాగా ముదిరిపోయింది. త‌ల్లి 24 గంట‌లు అత‌డి ప‌క్క‌నే ఉండేది. ధైర్యం ఇచ్చేందుకు ఈ చిత్రంలో ముద్దు పెట్టుకున్న క్ష‌ణాన్ని చూడొచ్చు.

చివ‌రి క్ష‌ణాలు

చివ‌రి క్ష‌ణాలు

డెరెక్ చాలా బ‌ల‌హీన‌మైపోయాడు. క‌నీసం మాట్లాడేందుకు అత‌డి చేత‌న‌వ్వ‌డం లేదు. ఈ చిత్రంలో న‌ర్స్ అత‌డికి మ‌త్తు మందు ఇస్తుంది. దాని స‌హాయంతో అత‌డు కాస్త ప్ర‌శాంతంగా నిద్ర‌పోగ‌లుగుతాడు. అత‌డి త‌ల్లి ధైర్యాన్ని మెచ్చుకోలేకుండా ఉన్నాం. క‌ళ్ల ముందే కొడుకు చ‌నిపోతుంటే ఆమె చాలా ధైర్యంగా ఉంది.

గుడ్ బై

గుడ్ బై

మ‌త్తు మందు ఇచ్చాక అత‌డికి సన్నిహితులైన వారు చుట్టూ చేరారు. సిండీ త‌న కొడుకును క‌డ‌సారి బాగా చూసుకుంది. ఇష్ట‌మైన పాట‌ల‌ను పాడుతూ ముద్దుపెట్టుకొని గుడ్ చెప్పింది.

అంతిమ‌యాత్ర‌

అంతిమ‌యాత్ర‌

డెరెక్ కు అంతిమ‌యాత్ర మొద‌లుపెట్టిన ఫొటో ఇది. అత‌డి స‌మాధి వ‌ద్ద నేను ఎల్ల‌ప్పుడు నా మ‌న‌సులో నీ జ్ఞాప‌కాల‌ను నిలిపి ఉంచి దాన్ని ఇత‌రుల‌కు చెప్పి నీలాగా బాధ‌ప‌డిన‌వారికి వాళ్ల స‌మ‌యం, స‌హ‌కారం ఇవ్వ‌మ‌ని ప్రాధేయ‌ప‌డ‌తాను అని సిండీ రాసింది. ఈ చిత్రాల‌న్నీ చూస్తే నిజంగా ప్రేమ‌, ఆప్యాయ‌త క‌లిగిన మ‌నుషులు ఉంటే అంత కంటే పెద్ద ఆశీర్వాదం ఏముంటుంది అనిపిస్తుంది.

All Images: Source

English summary

Real-life Stories: The Journey Photos Of A 10-Year-Old Cancer Patient Will Melt Your Heart

Derek Mansen, from California, was diagnosed with last stage of neuroblastoma. This is a rare form of cancer that generally affects children. While his friends and cousins were planning on summer holidays, young Derek and his mother were planning to fight the deadly disease...
Story first published: Monday, December 25, 2017, 14:00 [IST]