For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తన వృత్తిలో మొదటి రోజు, స్వాగత సుమాంజలిని ఆస్వాదించాడు… కానీ ..!

|

మన సోషల్ మీడియా ద్వారా అనేక విచిత్ర సంఘటనలను మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంటాం. అందులో కొన్ని ఆలోచనలని రేకెత్తిస్తే, కొన్ని భావోద్వేగాలకు పని చెప్తాయి. కొన్ని ఖండిచేవిగా ఉంటే, కొన్ని వింతగా తోచి నవ్వు తెప్పిస్తాయి. ఏదిఏమైనా చివరికి కూల్ అని సర్దిచెప్పుకుంటూ ఉంటాం. అవునా …

కానీ మీ అంచనా తప్పై, ఆ తప్పునే ప్రపంచంతో పంచుకుంటే ? తర్వాతి పరిస్థితులు ఎలా ఉంటాయి ?

ఇప్పుడు చెప్పబోయే వ్యక్తి విషయంలో కూడా అలాగే జరిగింది. అతను తన వృత్తిలో మొదటి రోజును పూల బొకేలతో ఆహ్వానింపబడ్డాడని అనుకున్నాడు, కానీ కొన్ని నెలల తర్వాత కానీ అర్ధం కాలేదు., ఆ పూలబొకేలు, బహుమతులు ప్రసవం కోసం సెలవుపై వెళ్తున్న సహోద్యోగిని కోసమని.

అసలేం జరిగింది …..

అసలేం జరిగింది …..

తెలీకుండానే పెద్ద తప్పిదం జరిగింది ... జాన్ కి-కి, తన కార్యాలయంలో మొదటి రోజున పూలబొకేలతో, బహుమతులతో ఆహ్వానింపబడ్డాడు. కానీ అదంతా తనకోసం కాదని తెలిసేసరికి చాలాకాలం దాటేసింది.సంఘటన గురించి పూర్తిగా తెలియని జాన్, క్రమంగా ఆ విషయాన్ని, ప్రపంచమంతటా ఉన్న తన స్నేహితులతో పంచుకున్నాడు ...

నిజమే ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులో ఉన్న కారణాన, తుమ్మినా దగ్గినా ప్రపంచమంతా తెలిసేలా సోషల్ నెట్వర్క్స్ అందుబాటులోకి వచ్చాయి. కొందరు నిజాయితీగా తమ సంతోషాలను, భావాలను నలుగురితో పంచుతూ ఉంటే, కొందరు తమ జీవితమే స్పాం పోస్టులకు అంకితం అన్నట్లుగా షేర్లు చేస్తుంటారు. ఎవరి ఆలోచనా దృక్పధం వారిది, కానీ ప్రపంచంలో ఏది కూడా అవసరం లేనిదిగా ఉండదు. తీసుకునే విధానం బట్టి ఉంటుంది. ఇది వాస్తవం.

క్రమంగా జాన్ కూడా, జరిగిన ఈ తతంగాన్నంతా తన స్నేహితులతో పంచుకోవడానికి ట్విట్టర్ అనుసరించాడు. అది తన సహోద్యోగులు తనకు చేసిన గౌరవంగా భావించాడు.

<3" అని తన ట్విట..." data-gal-src="telugu.boldsky.com/img/600x100/2019/02/x2-1549974469-jpg-pagespeed-ic-zxsxbuhjkq-1550212484.jpg">
అతని సహోద్యోగులు అతని ఉత్సుకతను గమనించారు ...

అతని సహోద్యోగులు అతని ఉత్సుకతను గమనించారు ...

అతని సహోద్యోగులు అతను ఎంతో సంతోషంగా, ఫ్లవర్ బొకేలతో పోజులిస్తూ, కార్యాలయంలో తాను పొందిన సంతోషాన్ని " మొదటిరోజు అనుభవం <3" అని తన ట్విట్టర్ ఖాతాలో పంచుకోవడం గమనించారు. వెంటనే జరిగిన విషయాన్ని జాన్ దృష్టికి తీసుకెళ్ళారు.

ఆ పువ్వులు తనకోసం కాదని తెలుసుకున్నాడు …

ఆ పువ్వులు తనకోసం కాదని తెలుసుకున్నాడు …

జాన్, ఈమధ్యనే తెలుసుకున్న విషయం ఏమిటి అంటే, ఆ పూల బొకేలు గిఫ్టులు పొరపాటున తన డెస్క్ మీదకు వచ్చాయని. నిజానికి ఈ తతంగమంతా, ప్రసవం కోసం వెళుతున్న ఒక మహిళ కోసం ఉద్దేశించబడింది. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా, తాను చేసిన తప్పిదాన్ని సరిదిద్దుకునే ప్రయత్నంలో భాగంగా ట్విట్టర్లో ఈ విషయాన్ని తెలియజేశాడు.

Most Read :తనని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకున్న అమ్మాయిపై అతను రివేంజ్ తీసకున్నాడు, చాట్ మొత్తం చూపించాడుMost Read :తనని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకున్న అమ్మాయిపై అతను రివేంజ్ తీసకున్నాడు, చాట్ మొత్తం చూపించాడు

కొందరు ట్రోల్స్ చేయడం

కొందరు ట్రోల్స్ చేయడం

కానీ నెటిజన్స్ ఊరుకుంటారా ? కొందరు ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేస్తే, మరికొందరు ఇటువంటి తప్పులు సహజమే, కానీ వెంటనే తన తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పాడు, అది గొప్ప విషయం అంటూ కితాబిస్తున్నారు.

నలుగురితో పంచుకునే ముందు

నలుగురితో పంచుకునే ముందు

సో, ఫ్రెండ్స్ మీ భావాలను నలుగురితో పంచుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించవలసి ఉంటుందని మరచిపోకండి. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను, క్రింది వ్యాఖ్యల విభాగంలో మాతో పంచుకోండి. ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆరోగ్య, జీవనశైలి, మాతృత్వ, శిశు సంబంధ, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి

English summary

He Realised the Fact About the Welcome Flowers He Received On His First Day at Work

There are many embarrassing things that we tend to post on our social media handles and think it to be cool at that very moment. But what happens when you misjudge something and then share the news with the world?