Latest Updates
-
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా..
మధ్యవర్తులు,మ్యారేజ్ బ్యూరోల గోల లేని చైనా ఫార్ములా: వధువరుల కోసం ఓ వింత సంత
ఏంటీ పెళ్లి కొడుకు..పెళ్లి కూతుర్ల కోసం సంతా ? అని నోరెళ్లబెడుతున్నారా ? కూరగాయల సంత..చేపల మార్కెట్.. స్టాక్‌మార్కెట్... ఇలాంటివి మనకి చాలానే తెలుసు.
ఏంటీ పెళ్లి కొడుకు..పెళ్లి కూతుర్ల కోసం సంతా ? అని నోరెళ్లబెడుతున్నారా ? కూరగాయల సంత..చేపల మార్కెట్.. స్టాక్‌మార్కెట్... ఇలాంటివి మనకి చాలానే తెలుసు.
ఇదేమీ సంత అని ఆశ్చర్యపోకండి..కానీ ఇది నిజం. భారతదేశంలో కాకుండా చైనాలో ఈ పరిస్థితి నెలకొంది. షాంఘై నగరంలో ప్రతి వారంతం సంత జరుగుతుంది. మధ్యవర్తులు, మ్యారేజ్ బ్యూరోల గోల లేని చైనా ఫార్ములా: వధువరుల ఎంపిక కోసం ఓ వింత సంత జరుగుతుంది.
ఈ విషయం వినడానికే వింతగా, ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా..మరి దీని గురించి మరి కొంచెం వివరంగా తెలుసుకుందాం..

వారాంతం సంత
పెళ్లీడుకొచ్చిన యువతీ యువకుల తల్లిదండ్రులు, బామ్మలు, అమ్మమ్మలు వందలమంది ప్రతి వారాంతం ఇక్కడ పోగవుతారు.

ప్లకార్డులు ప్రదర్శిస్తారు.
కొంత మంది తమ అమ్మాయి లేదా అబ్బాయి గుణగణాల్ని సూచిస్తూ పెడుతూ ప్లకార్డులు ప్రదర్శిస్తారు.

నోటీసుబోర్డులు, గొడుగులు, ఫ్లెక్సీలు.. అబ్బో చాలావాటిపై
నోటీసుబోర్డులు, గొడుగులు, ఫ్లెక్సీలు.. అబ్బో చాలావాటిపై తమ పిల్లల వివరాలు రాసి నిల్చుంటారు.

వివరాలను పరిశీలిస్తూ కొంత మంది రాసుకుంటారు
వివరాలను పరిశీలిస్తూ కొంత మంది రాసుకుంటారు. అబ్బాయి..అమ్మాయి ఫొటోలు..ఉద్యోగ వివరాలు..ఇష్టాలు..అయిష్టాలు..ఆస్తిపాస్తులు..జాతకం..ఎత్తు..బరువు ఇలా వివరాలు రాసి ఉంటాయి.

అవసరమైతే కెమేరాతో చిత్రాలను కూడా క్లిక్‌మనిపిస్తారు.
నచ్చినవాళ్లు కలం, కాగితం పట్టుకొని వచ్చి ఎంచక్కా ఇవన్నీ రాసేసుకుంటారు. అవసరమైతే కెమేరాతో చిత్రాలను కూడా క్లిక్‌మనిపిస్తారు.

ఇంట్లో వాళ్లందరికీ ఒకే అయితే తరువాత ఇంకేముంది..వారి వారి ఆచారాల ప్రకారం పెళ్లి
తమ గారాలపట్టికి ఓ చక్కని చుక్కనో, సక్కనయ్యనో కట్టబెట్టాలనే తాపత్రయం కోసమే పెద్దలు ఇలా చేస్తుంటారు. ఇంట్లో వాళ్లందరికీ ఒకే అయితే తరువాత ఇంకేముంది..వారి వారి ఆచారాల ప్రకారం పెళ్లి జరుగుతుంది.

అక్కడి యువతలో ఎక్కువమంది జై కొట్టడం గమనార్హం.
అన్నట్టు ఈ వింత యవ్వారానికి అక్కడి యువతలో ఎక్కువమంది జై కొట్టడం గమనార్హం.
ముఖ్యంగా బోయ్‌ఫ్రెండ్, గాళ్‌ఫ్రెండ్ లేని ఒంటరులు ఏదోరకంగా తమకు తోడు దొరికితే సరి అనుకుంటున్నారు.

చైనాలో అనుసరిస్తున్న ఒకే సంతానం విధానం కారణంగానే
చైనాలో అనుసరిస్తున్న ఒకే సంతానం విధానం కారణంగానే కుర్రకారు తోడు కోసం అల్లాడిపోయే పరిస్థితి వచ్చిందంటున్నారు.

మధ్యవర్తులు, మ్యారేజ్ బ్యూరోల గోల లేని ఈ చైనా ఫార్ములా బాగుంది
మధ్యవర్తులు, మ్యారేజ్ బ్యూరోల గోల లేని ఈ చైనా ఫార్ములా బాగుంది కదా! అమ్మాయి, అబ్బాయిలకు సంబంధం కుదిర్చే విషయంలో మనం సరదాగా అనుకునే ‘సంతలో బేరమాడినట్టు' అనే సామెత చైనాలో ఏమాత్రం చెల్లదన్నట్టే మరి.



Click it and Unblock the Notifications
