దినఫలాలు: సోమవారం 4 డిసెంబర్ 2017

Posted By: DEEPTI
Subscribe to Boldsky

భారతదేశం లేదా పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన జీవిత గమనాలు అంతరిక్షంలోని నక్షత్ర సమూహాలతో ఏర్పడ్డ వివిధ జన్మరాశుల స్థితి, గమనం పై ఆధారపడి ఉంటాయి. మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి. ఈ పన్నెండు రాశుల జ్యోతిష్య ఫలితాలు ఆయా సమయాల్లో గోచార స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ఇవ్వటం జరుగుతుంది. ఈ ఫలితాలు సామాన్యంగా అన్ని వర్గాలకు కలిపి చెప్తారు. వ్యక్తిగతంగా మీ భవిష్యత్తు తెలుసుకోవాలనే ఆసక్తి వుంటే దగ్గరలో ఉన్న జ్యోతిష్య నిపుణుడి వద్ద సంప్రదించి , మీ జన్మ వివరాలను తీసుకువెళ్ళి జాతకాలను, వాటిలో దోషాలు, దానికి పరిష్కారాలు వివరంగా తెలుసుకోవచ్చు.

ఈ వారఫలాలు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయానికి చెందిన పెద్దలు బ్రహ్మశ్రీ శ్రీ నలమాటి కొండలరావు గారి నోటి మాటల్లోనే..

ఓం శ్రీ గురుభ్యోనమః

అఖిల భారత తెలుగు ప్రేక్షకులందరికీ అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమఃస్సుమాంజలి.

ది. 4-12-2017 వ తారీఖు, సోమవారం నాటి దినఫలాలు ఒకసారి పరిశీలిద్దాం. హేమలంబి నామ సంవత్సరం, దక్షిణాయణం, హేమంత రుతువు, మార్గశిర మాసం, బహుళ పాడ్యమి రాత్రి 7.53 నిమిషాల వరకు ఉంది. రోహిణి నక్షత్రం ఉదయం 8 గంటల 33 నిమిషాల వరకూ ఉంది. అమృత సమయం ఉదయం 7 గంటల 2 నిమిషాల నుండి 8 గంటల 32 నిమిషాల వరకూ ఉంది. తిరిగి అమృత సమయం రాత్రి 10 గంటల 43 నిమిషాల నుండి 12 గంటల 10 నిమిషాల వరకు ఉంది. వర్జ్యం మధ్యాహ్నం 1.45 నిమిషాల నుండి 3 గంటల 52 నిమిషాల వరకూ ఉంది. దుర్ముహర్తం మధ్యాహ్నం 12.10 నుండి 1 గంట వరకూ ఉంది. మళ్ళా దుర్ముహర్తం మధ్యాహ్నం 2.26 నిమిషాల నుండి 3.15 నిమిషాల వరకూ ఉంది. సూర్యోదయ సమయం 6.20 నిమిషాలకు. సూర్యాస్తమయ సమయం 5.13 నిమిషాలకి.

మేష రాశి వారికి ;

మేష రాశి వారికి ;

ధనపర పనులు కార్యరూపం దాలుస్తాయి. భార్య సహకారం పూర్తిగా ఉంటుంది. అడ్డంకులున్నా విజయం సాధిస్తారు. తండ్రి గారి ఆశీర్వాదం పొందండి. వృత్తి వ్యాపారాలు రాణిస్తాయి.

వృషభ రాశి వారికి ;

వృషభ రాశి వారికి ;

మనస్సు ఆనందంగా ఉంటుంది. భార్యతో అనుకూల దాంపత్యం కలదు. అడ్డంకులు ఉంటాయి. శ్రద్ధ వహించాలి. పనివారి, సహచరుల సహకారం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మిథున రాశి వారికి ;

మిథున రాశి వారికి ;

కార్యక్రమాలలో అడ్డంకులు ఉంటాయి. ధనానికి ఇబ్బందులు కలవు. పిల్లలతో ఆనందం ఉంటుంది. అధికారుల మన్ననలు పొందుతారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

కర్కాటక రాశి వారికి ;

కర్కాటక రాశి వారికి ;

వ్యవహారం అడ్డంకులు ఉన్నప్పటికీ విజయం సాధిస్తారు. ఇంటి పనులు వ్యక్తిగత శ్రద్ధతో పూర్తిచేస్తారు. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. దగ్గరి బంధువుల రాకపోకలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి.

సింహ రాశి వారికి ;

సింహ రాశి వారికి ;

తలచిన కార్యక్రమాలు పూర్తి చేస్తారు. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. సోదరుల సహకారం ఉంటుంది. పిల్లల యెడల శ్రద్ధ వహించాలి. వృత్తి వ్యాపారాలు బావుంటాయి.

కన్యా రాశి వారికి ;

కన్యా రాశి వారికి ;

వాహన ప్రయాణాలలో ఆచితూచి వ్యవహరించాలి. సోదర సోదరీమణుల సహకారం ఉంటుంది. తల్లిదండ్రుల యెడల ప్రేమతో వ్యవహరించాలి. బంధువుల సహకారంతో వృత్తి వ్యాపారాలు బావుంటాయి.

తులా రాశి వారికి ;

తులా రాశి వారికి ;

ఈ రోజంతా ఆనందంగా గడుపుతారు. చేయు పనులు పట్టుదలతో పూర్తిచేస్తారు. ధనం కోసం చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. కొన్ని అవకాశాలు చేజారకుండా వ్యక్తిగత శ్రద్ధ వహించండి.

వృశ్చిక రాశి వారికి ;

వృశ్చిక రాశి వారికి ;

ఆలోచనలు చేస్తారు. వాటిని పూర్తిచేయటం కోసం శ్రద్ధగా శ్రమిస్తారు. ధనం కోసం శ్రద్ధగా వ్యాపారం చేయవలసి ఉంటుంది. దైవ దర్శన ప్రాప్తి కలదు. ఆధ్యాత్మిక ప్రసంగాలు వింటారు. చేయు పనులకు భార్య సహకారం పూర్తిగా ఉంటుంది.

ధనస్సు రాశి వారికి ;

ధనస్సు రాశి వారికి ;

తలచిన పనులు పూర్తి చేయడానికి శ్రమ పడవలసి ఉంటుంది. ధన ఇబ్బందులు కలవు. అప్పులు చేయవలసి ఉంటుంది. దుర్గా దేవి పూజ చేసిన యెడల అడ్డంకులు తీరగలవు.

మకర రాశి వారికి ;

మకర రాశి వారికి ;

అడ్డంకులు ఉంటాయి. భార్య సహకారంతో వాటిని జయించాల్సి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బావుంటాయి. అధికార లాభం కూడా కలదు. భూ సంబంధ లావాదేవీలు అనుకూలిస్తాయి.

కుంభ రాశి వారికి ;

కుంభ రాశి వారికి ;

అనుకున్న పనుల వలన లాభం పొందుతారు. కుటుంబ సౌఖ్యం చూస్తారు. తండ్రి సహకారం పూర్తిగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బావుంటాయి. తల్లి గారి సహకారం కూడా పూర్తిగా పొందుతారు.

మీన రాశి వారికి ;

మీన రాశి వారికి ;

అనుకున్న పనులు పూర్తి చేయటానికి పట్టుదల అవసరం. అడ్డంకులు కూడా ఉంటాయి. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. దైవ దర్శన ప్రాప్తి కలదు. వృత్తి వ్యాపారాలు బాధ్యతతో పూర్తి చేయవలసి ఉంటుంది.

ఇప్పటి వరకూ అన్ని రాశుల వారికీ ఏయే విధంగా ఉన్నాయో చూసారు కదా! మీకేమైనా సందేహాలు ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి.

సర్వేజనా సుఖినోఃభవంతు

సమస్త సన్మంగళానిభవంతు

అందరికీ నా నమస్కారం.

English summary

Daily Horoscope: 4th December 2017

Daily Horoscope: 4th December 2017,Here is your daily prediction for 4th December 2017 according to your zodiac houses.
Story first published: Monday, December 4, 2017, 7:00 [IST]