For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  నెలవారీ రాశిఫలాలు : కుంభ రాశి – జూన్

  |

  జూన్ మాసంలో కుంభ రాశి వారికి ఒక గంభీరమైన వాతావరణం నెలకొంటుంది, మంచిచెడుల మిశ్రమ ఫలితాలతో కాస్త మందకొడిగానే జీవితం సాగుతున్న అనుభూతి కలుగుతుంది. మీ పని మరియు వ్యాపారంలో మీ వ్యవహారాలకు అదనంగా మీ ప్రమేయం జోడవుతుంది, కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటారు. మీ పని యందు అజాగ్రత్త ఉండకూడదని తెలుసుకోండి, ఎందుకంటే ఈ అజాగ్రత్త మీకు ప్రతికూల ఫలితాలను కలిగిస్తుంది. మీ శ్రమ మరియు శ్రద్ధతో మీ లక్ష్యాలను నెరవేర్చగలుగుతారు, తద్వారా సహచరుల, మరియు కుటుంబ సభ్యుల ప్రశంసలు అందుతాయి. కానీ మీ ఏమరపాటు కొన్ని సమస్యలు తెస్తుంది, కావున జాగ్రత్త తప్పనిసరి.

  ఈ జూన్ మాసం మీ జీవితంలో అనేక మార్పులకు నాంది పలుకుతుంది. ఈ మార్పులు మీ జీవితాన్ని మరియు మీ చుట్టూ ప్రపంచాన్ని ప్రభావితం చేసేలా ఉంటాయి. ఆర్ధికాభివృద్ది, ఉద్యోగ విషయాల నందు మిశ్రమ ఫలితాలను చూసినా , ఆరోగ్యం పరంగా మాత్రం మంచి పురోగతిని గమనిస్తారు. ఈ కుంభ రాశి వారి సంతోషాలకు, విశ్రాంతికి వేదికగా ఈ నెల ఉంటుంది. మీ మానసిక స్థితి బాగున్నప్పుడు, మీజీవితంలోని వివిధ సమస్యలకు పరిష్కారాలను ఆలోచించగలుగుతారని మరవకండి.

  కుంభ రాశి వారి ఆరోగ్యం, ఉద్యోగం, ఆర్దికాభివృద్ది, ప్రేమ మొదలైన అంశాల నందు ఈ జూన్ మాసం ఎలా ఉండబోనుందో క్రింది విభాగాలలో తెలుసుకోండి.

  ఆరోగ్యం:

  ఆరోగ్యం:

  ఈ నెలలో ఆరోగ్యం పరంగా మీకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది, ఎటువంటి సమస్యలైనా తీవ్రరూపం దాల్చకుండా మీకు సహకరించేలా ఉంటాయి. మీరు శారీరిక బలం , సౌష్ఠవం మీద దృష్టిని కేంద్రీకరించగలుగుతారు. తద్వారా ఆరోగ్యకర జీవనశైలికి అలవడేలా ప్రయత్నాలు చేయగలుగుతారు. చిన్న పాటి రోగాలైన కోల్డ్ వంటి సాధారణ సమస్యలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే,కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టగలుగుతారు. మరియు మీకంటూ మీ ఆరోగ్యం పట్ల ఒక అవగాహన తెచ్చుకోవడానికి ఈ నెల అనువుగా ఉంటుంది. మీరు ఆరోగ్యంగా ఉండటానికి మరియు మంచి శారీరక దృఢత్వాన్ని పొందడానికి కొన్ని వ్యాయామ నియమాలను పాటించవలసి ఉంటుంది. కనీసం రోజులో అరగంట వ్యాయామం చేయడం వలన అనేక ఆరోగ్య సమస్యల నుండి స్వావలంబన పొందగలరు కూడా.

  మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా, కొన్ని ఆరోగ్య సమస్యలు మీ జీవనశైలికి అడ్డుగా అనిపించవచ్చు. చిన్న మరియు సాధారణ సమస్యలు అని మీరు భావించేవే, కొన్ని భవిష్యత్తులో తీవ్ర రూపం దాల్చవచ్చు. చిన్న రోగాల పట్ల అశ్రద్ద చేయడం కారణంగా, కొన్ని జఠిలమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి, అందువల్ల, మీరు అప్రమత్తంగా ఉండి, ఆ దీర్ఘకాలిక సమస్యల పట్ల దృష్టి సారించడం మంచిదిగా సూచించడమైనది. మీరు చేసే అశ్రద్ద భవిష్యత్ కార్యాచరణలకు అడ్డుగా పరిణమిస్తుంది అని మాత్రం మరచిపోకండి. కావున ఎటువంటి చిన్న సమస్య తలెత్తినా, వైద్యుని సంప్రదించి, సూచనల మేరకు తగు పరీక్షలు నిర్వహించి జాగ్రత్త పడవలసి ఉంటుంది. ఈ నెలలో మీకు పెద్దవైన ఆరోగ్య సమస్యలు ఏవీ లేనప్పటికీ, సరైన ఆహార ప్రణాళిక పట్ల దృష్టి సారించడం ఉత్తమంగా చెప్పబడింది. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మరియు మంచి ఫిట్నెస్ పాలనను పాటించడం వలన ఎన్నో సమస్యలకు ముందు జాగ్రత్త తీసుకున్న వారే అవుతారు. అనారోగ్యకర ఆహారపు, మరియు వ్యసనాలు మీకు భవిష్యత్ సమస్యలు తీసుకుని రాగలవు. నెల చివరిలో కండరాల సమస్యలు వచ్చే అవకాశo కూడా ఉన్నది. సరైన జాగ్రత్త తీసుకొనని పక్షాన, దీర్ఘకాలిక సమస్యలకు దారితీయవచ్చు.

  ఉద్యోగం:

  ఉద్యోగం:

  జూన్ మాసం నందు మీ కెరీర్ పరంగా అనుకూలంగా ఉండకపోవచ్చు. ఈ నెలలో మీ వృత్తిపరమైన జీవితంలో అనేక క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొనవలసి ఉంటుంది. మొదట, మీ ఉద్యోగం చుట్టూ ఉన్న ప్రభావాలు ఆశాజనకంగా లేవు. మీ నిర్వాహకులు, స్నేహితులు మరియు సహచరుల నుండి మీరు ఆశించిన మద్దతు కూడా మీకు లభించకపోవచ్చు, అందువల్ల మీపట్ల మీకే చులకన భావం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఆత్మస్థైర్యంతో ముందుకు నడవండి.

  మీరు ఈ నెలలో పాటించవలసిన ముఖ్యమైన అంశం, అన్నిటికీ ధైర్యంగా ఉండడమే. కష్టపడి పనిచేయండి మరియు వృత్తిపై దృష్టి పెట్టండి. మీరు ఎదురుచూస్తున్న లాభాలు మీకు చేరుకోలేకపోయే అవకాశమే ఎక్కువగా ఉంది, ఇది మీకు మరింత నిరాశ కలిగించేలా చేస్తుంది. సమస్య గురించి చింతించే బదులుగా ఎక్కడ లోపముందో గమనించి లోపాన్ని సవరించేలా ప్రణాళికలు చేయడం ద్వారా మీ సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు మార్గం సుగమం అవుతుంది.

  ఆర్ధిక వ్యవహారాలు :

  ఆర్ధిక వ్యవహారాలు :

  ఈ 2018 జూన్ మాసం నందు, కుంభ రాశి వారికి ఆర్ధికoగా అనుకున్న ఫలితాలు పొందలేకపోవచ్చు. ప్రభుత్వ సంస్థలు లేదా ఇతరత్రా ఏజన్సీల వ్యవహారాలతో సంబంధమైన వృత్తిలో ఉన్న ఎడల, ఈ నెల కాస్త గడ్డుకాలంగానే ఉంటుంది. కొన్ని విషయాలను అనాలోచితంగానే వాయిదా వేయడం మంచిదిగా సూచించడమైనది. సరైన సమయంలో కొన్ని నిర్ణయాలను తీసుకోకపోవడం వలన, కొన్ని అదనపు భారాలను భరించవలసి ఉంటుంది. కొన్ని విషయాలను వాయిదా వేయడం ద్వారా, అనేక వివాదాల నుండి బయటపడగలరు కూడా. ఉద్యోగరీత్యా ప్రయాణాలతో ఈ నెల కొంచం అసౌకర్యంగా ఉండే సూచనలు ఉన్నాయి. కానీ ఇవన్నీ తాత్కాలిక సమస్యలు మాత్రమే, ఆర్ధిక పతనం అని మాత్రం అనడానికి లేదు. కేవలం ఆశించిన ఫలితాలు మాత్రమే మిమ్మల్ని నిరాశ పరుస్తాయి. తద్వారా కొన్ని అంశాలనందు సవరణలు చేసుకుని భవిష్యత్ కార్యాచరణ మీద దృష్టి సారించడం మంచిది.

  ప్రేమ మరియు వివాహ జీవితం:

  ప్రేమ మరియు వివాహ జీవితం:

  కుంభ రాశి వారికి ఈ జూన్ నెలలో అన్నిటా మిశ్రమ పోకడలే దర్శనమిస్తున్నాయి. ఆర్దిక మరియు వృత్తి వ్యవహారాల వలెనే ప్రేమ మరియు వివాహ జీవితంనందు కూడా కాస్త గడ్డుకాలాన్నే ఎదుర్కొనవలసి ఉంటుంది. మీరు ఈ సంబంధాలు మరియు బంధాలను బలోపేతం చేయడానికి శ్రద్ధ వహించవలసి ఉంటుంది. భాగస్వామితో సంబంధాలను పటిష్ట పరచుకోవలసిన సమయంగా ఈ జూన్ మాసం ఉంది. కొన్ని అసాధారణ నిర్ణయాలు, మీ జీవితాన్నే అల్లకల్లోలం చేసే అవకాశo ఉంది. తద్వారా వివాహ వ్యవహారాల నందు, లేదా భాగస్వామితో కూడిన నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిదిగా సూచించడమైనది. తెలివికి, లౌఖ్యానికి ఒక పరీక్షలా మీ సంబంధాలు గోచరిస్తున్నాయి. చిన్న చిన్న వాదనలు కూడా పెద్ద పరిస్థితులకు దారితీసే అవకాశాలు ఉంటాయి. కావున దేనినీ తెగేదాకా తీసుకుని రాకుండా, తెలివితో వ్యవహరించవలసి ఉంటుంది.

  ఈ నెలలో కుంభరాశి వారి ప్రేమ వ్యవహారాల నందు విజయావకాశాలు కాస్త మెండుగానే ఉన్నాయి. ఏమైనప్పటికీ, ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశo మీకు లభిస్తుంది. మరియు మీకు తగిన భాగస్వామిని ఎన్నుకునేలా అంతరాత్మతో చర్చలు జరుపుతుంటారు. ప్రేమ వ్యవహారాలలో ఎటువంటి భయమూ అవసరం లేదు, కానీ మీ రాశిచక్రం ప్రకారం మీరు తీసుకునే నిర్ణయాలు 17 వ తేదీ మీదట తీసుకోవలసినదిగా సూచించడమైనది.

  21 వ తేదీ తర్వాత, మీ భాగస్వామి మద్దతు కూడా పూర్తిగా ఉంటుంది, మరియు మీరు తీసుకునే ఎటువంటి సాహసాపేత నిర్ణయాలకైనా వారి మద్దతును కలిగి ఉంటారు.

  మీ అదృష్ట రంగు మరియు సంఖ్యలు :

  మీ అదృష్ట రంగు మరియు సంఖ్యలు :

  ఈ నెలలో మీ అదృష్ట సంఖ్యలు 4, 7, 11, 22 మరియు 29 మరియు మీ అదృష్ట రంగులుగా వెండి మరియు లేత నీలంగా సూచించబడినది.

  English summary

  Monthy Prediction - June Aquarius

  This long stretch of June will be loaded with high points and low points that would be quite serious in the first few days. Your involvement in your work environment and in addition to your dealings in your business will be a learning stage. Try not to become careless with your work, since it can cause adverse results. As far as your endeavors, you will be fulfilled as the outcomes for your diligent work, which will be quite appreciated.
  Story first published: Friday, June 1, 2018, 10:05 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more