For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

#IAmABlueWarrior: కోవిడ్ వారియర్స్ మరియు ఫ్రంట్‌లైన్ వర్కర్ల కోసం జోష్ యాప్ నిధుల సేకరణ..

#IAmABlueWarrior: కోవిడ్ వారియర్స్ మరియు ఫ్రంట్‌లైన్ వర్కర్ల కోసం జోష్ యాప్ నిధుల సేకరణ..

|

భారతదేశ చరిత్రలోనే అత్యంత కష్టతరమైన సమయం COVID 19 సెకండ్ వేవ్, ఇది అన్ని వర్గాల ప్రజలను ప్రభావితం చేసింది. ఈ కష్ట సమయంలో, చాలా మంది వారియర్లు ప్రజలకు సాధ్యమైనంతవరకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. COVID-19 కి సంబంధించి సమాచారాన్ని విస్తరించడం నుండి, మహమ్మారి వైరస్‌ను అంతం చేయడానికి దేశం చేస్తున్న పోరాటానికి నిధులు విరాళం ఇవ్వడం వరకు, ప్రతి ఒక్కరూ తమ స్థాయిని బట్టి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.(ప్రజలు తమ వంతు కృషి చేస్తున్నారు.) మన దేశంలోని ప్రజలకు సహాయం చేయడానికి, జోష్ యాప్ షార్ట్ వీడియో చేసి జోష్ నిధుల సమీకరణ 'బ్లూ రిబ్బన్'ఇనిషియేటివ్ ద్వారా - #IAmABlueWarrior' (18 జూన్ 2021 వరకు మాత్రమే చెల్లుతుంది) అనే అవగాహన కార్యక్రమాన్ని, విరాళల సేకరణ కూడా ప్రారంభించింది.

జోష్ 'బ్లూ రిబ్బన్' ముఖ్య ఉద్ధేశ్యం, ఫ్రంట్‌లైన్ కార్మికులు మరియు COVID వారియర్లతో సహా కరోనా వైరస్ మహమ్మారి వల్ల బాధపడుతున్నవారిలో అవగాహన పెంచడం మరియు సహాయంగా నిధులు సేకరించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రచారానికి మద్దతు ఇవ్వడానికి జోష్ యాప్ ద్వారా సోషల్ మీడియాలో వినియోగదారుల కోసం సృష్టించిన వీడియోల ద్వారా నిధులను సేకరిస్తుంది, చిన్నచిన్న-వీడియోలను అన్నిసందర్భాల్లో చొరవచూపించడానికి ఈ యాప్ సృష్టికర్త అన్ని గ్రూపులను ప్రోత్సహిస్తుంది.

ఈ గ్రూపుల సహకారంతో, జోష్ పెద్ద ఎత్తున దీనికి దోహదం చేస్తుంది. 'బ్లూ రిబ్బన్' ద్వారా వచ్చే నిధులను జోష్, PM CARES ((Prime Minister's Citizen Assistance and Relief in Emergency Situations)ప్రధానమంత్రి పౌర సహాయం మరియు అత్యవసర పరిస్థితుల్లో ఉపశమనం నిధికి నిధులను సమకూర్చనున్నారు.

COVID-19 సమయంలో కష్ట పరిస్థితులను పరిష్కరించడంలో సోషల్ మీడియా ఎంతగా ప్రభావితం చేసిందో, ఎలా కీలకమైన పాత్ర పోషించిదో మనం చూశాము. వీటి ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని, జోష్ యాప్ తగిన కంటెంట్ ను రూపొందించడానికి, మీలోని సృజనాత్మక ప్రతిభను తెలియజేయడానికి జోస్ యాప్ ఇన్ అండ్ అవుట్ 'బ్లూ రిబ్బన్' చొరవను విస్తరించడానికి, COVID-19 సమయంలో సరైన సందేశాన్ని వ్యాప్తి చేయడానికి మీకు ఇష్టమైన ఇన్‌ఫ్లుయెన్సర్ లాంటి వీడియోలను తయారు చేసి వాటిని మాకు పంపవచ్చు .

ప్రముఖ సంగీత స్వరకర్త మరియు గాయకుడు క్లింటన్ సెరెజో కూడా 'బ్లూ రిబ్బన్' చొరవతో ప్రత్యేక మార్గంలో నిధులు సేకరించడానికి సహకరిస్తున్నారు. ప్రసిద్ధ కోక్ స్టూడియో పాట 'మదరి' మరియు అనేక ఇతర కంపోజిషన్లకు ప్రసిద్ది చెందిన సెరెజో, ఈ కోవిడ్ 19 క్లిష్ట సమయాల్లో కొంత కాంతిని నింపడానికి జోష్‌ ప్రత్యేక అవగాహన వీడియోను విడుదలచేశారు!

ఈ వీడియోను ఇక్కడ వీక్షించండి:

జోష్ యాప్ లో#IAmABlueWarrior ఛాలెంజ్ ఇక్కడ ఉంది

జోష్ యాప్ లో ఉన్న వినియోగదారులు అందరూ, మీరు కూడా, మీ ఇష్టమైన ప్రతిభావంతుల మాదిరిగానే ఈ మానవతా ప్రయోజనం కోసం మీ ప్రతిభను ఈ ఛానెల్లో చాటుకోవచ్చు. జోష్‌పై #IAmABlueWarrior ఛాలెంజ్‌లో ఎలా పాల్గొనాలో తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా?

కింది ఎనిమిది సబ్ థీమ్స్ ఆధారంగా వీడియోలను సృష్టించడం ద్వారా జోష్ యాప్ వినియోగదారులు 'బ్లూ రిబ్బన్ 'లో భాగస్వాములు కావడం ద్వారా ఈ అంశాలపై వీడియో చేయవచ్చు:

డబుల్ మాస్క్ అవసరం

టీకాపై అవగాహన

COVID-19 గురించి ఖచ్చితమైన వాస్తవాలు

సామాజిక దూరం పాటించడం

శానిటైజేషన్ ప్రాముఖ్యత/ప్రయోజనాలు/అవసరాలు

COVID-19 పరిశుభ్రత

ఇంట్లో ఉండండి, సురక్షితంగా ఉండండి

ఆక్సిజన్ గురించి అవగాహన.

వీడియోలలో ఉపయోగించాల్సిన హ్యాష్‌ట్యాగ్: #IAmABlueWarrior

ఈ హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించి సృష్టించబడిన వీడియోలు విరాళం ఇవ్వవలసిన మొత్తాన్ని సేకరించడంలో జోష్ యాప్ కి సహాయపడతాయి.

స్పెషల్ డిస్ప్లే పిక్చర్:

ఈ ఛాలెంజ్‌లో భాగంగా వీడియోగ్రాఫర్‌లు తమ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ డిపిని, అలాగే ప్రచార లోగోను ఉపయోగించమని అభ్యర్థించారు.

ఈ కష్ట సమయంలో సహాయం చేయడానికి భారతీయ పౌరులకు సహాయపడటానికి జోష్‌తో కలిసి #IAmABlueWarriorలో చేరడానికి మీకు ఇదే మంచి అవకాశం మరియు మీ స్నేహితులను ప్రోత్సహించడానికి ఇది సరైన సమయం. మరి మీరూ ఒక బ్లూ వారియర్ కావడానికి సిద్ధంగా ఉన్నారా?

English summary

IAmABlueWarrior: Josh App Launches Fundraiser To Help COVID Warriors And Frontline Workers

IAmABlueWarrior: Josh App Launches Fundraiser To Help COVID Warriors And Frontline Workers. Read on.
Desktop Bottom Promotion