For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Lata Mangeshkar:సంగీతంలో చెరగని ముద్ర వేసిన గాన కోకిల లతా మంగేష్కర్...

లతా మంగేష్కర్ గురించి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

|

Lata Mangeshkar Songs: ఈ ఏడాది ఫిబ్రవరి 6న సంగీతానికి చీకటి దినంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజే సంగీత ప్రపంచంలో ఓ శకం ముగిసిపోయింది. భారతీయ సినీ నేపథ్య సంగీతానికి చిరునామాగా మారిన గాన కోకిల లతా మంగేష్కర్ తుది శ్వాస విడిచారు. ఎవరి పేరు చేబితే పాట సైతం పరవశించిపోతుందో.. ఎవరి గొంతులో రాగం తుల్లిపడుతుందో.. పల్లవి పరి తపిస్తుందో.. ఆ గొంతే మూగబోయింది.

Lata Mangeshkar

భారతరత్న, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ 2022 సంవత్సరంలో ఫిబ్రవరి 6వ తేదీన ఉదయం ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఈ గాయని గత నెల రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొన్నిరోజుల క్రితమే తను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. అంతలోపే ఈ చేదు వార్త వినాల్సి వచ్చింది. గాన కోకిల స్వరం మూగబోయిందని తెలిసి దేశ వ్యాప్తంగా ప్రముఖులు సంతాపం చెబుతున్నారు. ఏడు దశాబ్దాలకు పైగా తన పాటలతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను తన స్వరంతో అలరించారు మెలోడీ క్వీన్ లతా మంగేష్కర్. వయసు పైబడినప్పటికీ.. తనతో పాటలు పాడించుకోవాలని ప్రతి ఒక్క సంగీత దర్శకుడు ఇప్పటికీ ఎంతో ఆశతో ఎదురుచూస్తుంటారనడంలో ఎలాంటి అతి శయోక్తి లేదు. ఈ గాన కోకిల మన దేశంలోని దాదాపు అన్ని భాషల్లోనూ పాటలు పాడారు.

Lata Mangeshkar

తన కెరీర్లో మొత్తం 20 భారతీయ భాషల్లో దాదాపు 26 వేలకు పైగా పాటలను పాడారు. అందులో ఎక్కువగా హిందీ భాషలోనే పాడారు. అయితే మన తెలుగులో మాత్రం కేవలం మూడు పాటలే పాడారు. అయిన అవి చెరగని ముద్ర వేసుకున్నాయి.

1955 సంవత్సరంలో నాగేశ్వరరావు, సావిత్రి నటించిన 'సంతానం' సినిమాలో తొలి తెలుగు పాటను పాడారు. ఆ తర్వాత 1965 సంవత్సరంలో ఎన్టీఆర్, జమున నటించిన 'దొరికితే దొంగలు' సినిమాలో 'శ్రీ వెంకటేశా' అనే పాటను పాడారు. ఇక చివరగా 1988 సంవత్సరంలో నాగార్జున, శ్రీదేవి జంటగా నటించిన, ఇళయరాజా సంగీత దర్శకత్వంలో 'ఆఖరి పోరాటం' సినిమాలో 'తెల్ల చీరకు' పాటను మన తెలుగు గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి పాడారు.

1947 సంవత్సరంలో 'మజ్ బూర్' సినిమాతో సింగర్ గా లతా మంగేష్కర్ ప్రస్థానం ప్రారంభించింది. ఆ తర్వాల మహల్ తో స్టార్ డమ్ సంపాదించుకున్నారు. ఈమె అతి తక్కువ కాలంలోనే తన ప్రతిభతో ఉన్నత శిఖరాల్ని అధిరోహించారు. అలా వేలాది పాటలు పాడిన ామె గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్నారు. అంతేకాదు గాన కోకిల(Nightingle Of India)గా పేరు దక్కించుకున్న లతా మంగేష్కర్ భారతీయ సినీ రంగానికి చేసిన విశిష్ట సేవలకు భారత అత్యున్నత పురస్కారమైన భారత రత్న అవార్డుతో సత్కరించింది. అలాగే పద్మ భూషన్, పద్మ విభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో పాటు జాతీయ అవార్డులు ఆమెను వరించాయి. ఎంఎస్ సుబ్బులక్ష్మీ తర్వాత భారత ప్రభుత్వం నుండి ఎక్కువ అత్యుత్తమ పురస్కారాలు అందుకున్న అరుదైన గాయకురాలిగా కీర్తి గడించారు.

FAQ's
  • లతా మంగేష్కర్ ను ఏయే అవార్డులు వరించాయి?

    గాన కోకిల(Nightingle Of India)గా పేరు దక్కించుకున్న లతా మంగేష్కర్ భారతీయ సినీ రంగానికి చేసిన విశిష్ట సేవలకు భారత అత్యున్నత పురస్కారమైన భారత రత్న అవార్డుతో సత్కరించింది. అలాగే పద్మ భూషన్, పద్మ విభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో పాటు జాతీయ అవార్డులు ఆమెను వరించాయి. ఎంఎస్ సుబ్బులక్ష్మీ తర్వాత భారత ప్రభుత్వం నుండి ఎక్కువ అత్యుత్తమ పురస్కారాలు అందుకున్న అరుదైన గాయకురాలిగా కీర్తి గడించారు.

  • సింగర్ లతా మంగేష్కర్ తుది శ్వాస విడిచారు?

    సింగర్ లతా మంగేష్కర్ 2022 సంవత్సరంలో ఫిబ్రవరి 6వ తేదీన ఉదయం ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఈ గాయని గత నెల రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొన్నిరోజుల క్రితమే తను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. అంతలోపే ఈ చేదు వార్త వినాల్సి వచ్చింది. గాన కోకిల స్వరం మూగబోయిందని తెలిసి దేశ వ్యాప్తంగా ప్రముఖులు సంతాపం చెబుతున్నారు.

English summary

Interesting Facts about Veteran Singer Lata Mangeshkar in Telugu

Here we are talking about the interesting facts about vetaran singer lata mangeshkar in Telugu. Read on
Story first published:Sunday, February 6, 2022, 13:44 [IST]
Desktop Bottom Promotion