For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యువీ బర్త్ డే స్పెషల్ : సిక్సర్ల కింగ్.. యువరాజ్ సింగ్..

|

సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ తాను క్రికెటర్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదట. అయితే తన తండ్రికి క్రికెట్ పై ఉన్న ఇష్టంతోనే తాను ఈ ఆటలోకి ప్రవేశించాడట. అయితే క్రికెటర్ గా మంచి ఊపు మీదున్న యువీని క్యాన్సర్ భూతం వెంటాడింది. అయినా యువ'రాజు' కుంగిపోలేదు. క్యాన్సర్ పై పోరాటం చేశాడు.

చివరికి క్యాన్సర్ పై విజయం సాధించాడు. తర్వాత క్రికెట్లో పునరాగమనం చేసిన అతను ఎంత అద్భుతంగా రాణించాడో అందరికీ తెలిసిందే. డిసెంబర్ 12వ తేదీన యువరాజ్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా ఆ ఆటగాడి గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాము...

యువీ బాల్యం...

యువీ బాల్యం...

యువరాజ్ సింగ్ చండీఘడ్ లోని సిక్కు కుటుంబంలో 1981 డిసెంబర్ 12వ తేదీన జన్మించాడు. ఆయన తండ్రి పేరు యోగ్ రాజ్ సింగ్. ఆయన కూడా క్రికెటర్. ఆయన బాల నటుడిగా ఎన్నో పాత్రలను చేశారు. తను చంఢీఘర్ లోని డిఎవి స్కూల్ లోనే తన ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు. అయితే తన తండ్రి కోరికను నెరవేర్చడానికి తనకు ఇష్టం లేకపోయినా క్రికెట్లోకి అడుగు పెట్టాడు.

స్కేటింగ్ పై మక్కువ...

స్కేటింగ్ పై మక్కువ...

యువరాజ్ సింగ్ కు క్రికెట్ తో పాటు స్కేటింగ్ గేమ్ అంటే చాలా మక్కువ అంట. అంతేకాదు ఈ లైఫ్ట్ హ్యాండ్ స్టైలిష్ బ్యాట్స్ మెన్ నేషనల్ అండర్-14లో రోలర్ స్కేటింగ్ ఛాంపియన్ షిప్ టైటిల్ కూడా గెలుచుకున్నాడు. ఈ తర్వాత తన తండ్రికి అత్యంత ఇష్టమైన క్రికెట్ బ్యాటును పట్టుకున్నాడు. అంతే కాదండోయ్ టెన్నిస్ లో కూడా యువీ ఛాంపియన్. కేవలం క్రికెట్ కోసం వీటన్నింటిని త్యాగం చేసేశాడు.

ముంబై నుండి మొదలు..

ముంబై నుండి మొదలు..

PC : Twitter

యువీ క్రికెట్ గేమ్ లో ట్రైనింగ్ కోసం ముంబైలోని దిలీప్ వెంగ్ సర్కార్ అకాడమీలో చేరాడు. అంధేరీలో కొన్నిరోజులు క్రికెట్ రచయిత మకరంద్ బైంగాంకర్ తో కలిసి జీవించాడు. ముంబైలో జనాభాను చూసి ఆశ్చర్యపోయిన యువీ ఇలా అన్నాడు. ‘‘ముంబైలో జనాలు.. చండీఘడ్ లో చెట్లు చాలా ఎక్కువ‘ అని చమత్కారంగా చెప్పాడు.

లోకల్ ట్రైన్స్ అంటే భయం...

లోకల్ ట్రైన్స్ అంటే భయం...

యువీకి లోకల్ ట్రైన్స్ అంటే చాలా భయమట. ఎందుకంటే అతను రైలు ఎక్కిన సమయంలో అక్కడి తోపులాటలో రైలులో నుండి ఇద్దరు ప్యాసింజర్లు కిందపడ్డారట. అదే సమయంలో క్రికెట్ ప్రాక్టీస్ కోసం మధ్యాహ్నం మూడు గంటలకు చేరుకోవాల్సి ఉండగా సాయంత్రం ఐదు గంటల తర్వాత మైదానానికి చేరుకున్నాడు. అయితే రమేష్ పవార్ అతనికి లోకల్ ట్రైన్స్ లో ఎలా ట్రావెల్ చేయాలని చెప్పారట.

6 బాల్స్ లో 6 సిక్సర్లు..

6 బాల్స్ లో 6 సిక్సర్లు..

2007 టి20 వరల్డ్ కప్ యువరాజ్ విధ్వంసానికి ఇంగ్లాండ్ బౌలర్లు విలవిలలాడిపోయారు. ఆ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ప్లేయర్ ప్లింటాఫ్ యువీని రెచ్చగొట్టాడు. దీంతో ఇద్దరి మధ్య మాటమాటా పెరిగింది. అయితే అందుకు యువీ బ్యాటుతో గట్టి సమాధానమే చెప్పాడు. తర్వాతి ఓవర్లో బ్రాడ్ ను లక్ష్యంగా చేసుకుని వరుసగా ఆరు సిక్సర్లు బాదేశాడు. అంతే 12 బంతుల్లోనే అర్థసెంచరీని పూర్తి చేసిన ఏకైక క్రీడాకారుడిగా కొత్త చరిత్ర స్రుష్టించాడు.

యువీ పేరుతో కంప్యూటర్ గేమ్....

యువీ పేరుతో కంప్యూటర్ గేమ్....

ఒకప్పుడు ‘బ్రియన్ లారా క్రికెట్‘ పేరిట ఒక వీడియో గేమ్ విడుదల అయ్యింది. దానికి మంచి క్రేజ్ లభించింది. అయితే ఇండియాలోనూ యువీ పేరిట ఓ వీడియో గేమ్ ను రూపొందించారు. ‘యువరాజ్ సింగ్ ఇంటర్నేషన్ క్రికెట్ 2007‘ పేరిట దాన్ని విడుదల చేశారు. అది కూడా బాగా పాపులర్ అయ్యింది.

క్యాన్సర్ పై అలుపెరుగని విజయం...

క్యాన్సర్ పై అలుపెరుగని విజయం...

యువీ జీవితంలో మరచిపోలేని బాధాకరమైన సంఘటన ఏదైనా ఉందంటే అది క్యాన్సరే. వరల్డ్ కప్ తర్వాత యువరాజ్ సింగ్ క్యాన్సర్ రోగంతో తీవ్రంగా పోరాడాడు. 2012లో చికిత్స కోసం అమెరికా వెళ్లి, కొన్ని నెలల తర్వాత ఆరోగ్యాన్ని కుదుటపర్చుకుని తిరిగి వచ్చాడు. ఆ తర్వాత క్యాన్సర్ రోగుల్లో స్ఫూర్తి నింపేందుకు స్వయంగా You We Can ఏర్పాటు చసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.

డబ్బింగ్ ఆర్టిస్టుగా..

డబ్బింగ్ ఆర్టిస్టుగా..

2008లో యువరాజ్ సింగ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గానూ ఓ సినిమాకు పని చేశాడు. ఆ చిత్రం పేరే ‘జుంబో‘. ఆ సినిమా ద్వారా తనలోని వాయిస్ ఓవర్ (డబ్బింగ్) మెళకువలను బయట పెట్టాడు. అందులో రాజ్ కుమార్ విక్రమ్ అనే పాత్రకు యువీనే వాయిస్ ఇచ్చాడు.

యువీ జెర్సీ 12 ఎందుకంటే...

యువీ జెర్సీ 12 ఎందుకంటే...

యువరాజ్ జెర్సీ 12వ నెంబర్ జెర్సీనే ఎందుకు ధరిస్తాడంటే అతని పుట్టినరోజు డిసెంబర్ 12వ తేదీ కాబట్టి. అది కూడా 12వ నెల కూడా కావడం విశేషం. దీంతో పాటు అతను ఆడటానికి వచ్చిన ప్రతిసారీ తన మణికట్టు మీద నల్లదారం కూడా ధరిస్తాడు.

సచిన్ కు వీరాభిమాని..

సచిన్ కు వీరాభిమాని..

యువరాజ్ సింగ్ చిన్నప్పటి నుండి సచిన్ టెండూల్కర్ కు వీరాభిమాని. సచిన్ తో కలిసి క్రీజులో గడిపిన క్షణాలను ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఓసారి తనతో కలిసి ఓ కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత మ్యాచ్ ను సైతం గెలిపించాడు.

English summary

Unknown facts about YuvRaj Singh

Here we talking about unknown facts about yuvraj singh. Read on
Story first published: Thursday, December 12, 2019, 15:40 [IST]