For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2017 న్యూఇయర్ లో ఒక్కో రాశి వారు ఖచ్చితంగా చేయాల్సినవి..చేయకూడనవి.!!

By Sindhu
|

కొత్త సంవత్సరం వస్తోందంటే బోలెడన్ని ఆశలు చిగురిస్తాయి. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకోవడమే కాదు కొత్త సంవత్సరంలో మన గమనం ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న ఆసక్తి అందరిలో కలుగుతుంది. గతంలో ఉగాది పండుగకు ఇలాంటి ఆసక్తి ఉండేది. రానురాను నూతన ఆంగ్ల సంవత్సరం కూడా మనకు ఎలా ఉంటుందోనని అందరూ చూసుకునే పరిస్థితి వచ్చేసింది. నక్షత్రాల ఆధారంగా , రాశుల ఆధారంగా, పుట్టిన తేదీల ఆధారంగా కూడా జాతకాలు చెబుతున్నారు. అందుకే 2017 నూతన సంవత్సర శుభవేళ జన్మ నక్షత్ర ప్రకారం,12 రాశుల వారి నూతన సంవత్సర ఫలితాలు.. మన జాతకం ఎలావుంటుందో ఒకసారి తెలుసుకుందాం..

మేషరాశి : అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం.

మేషరాశి : అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం.

ఈ మాసం ఉత్సాహంగా గడుస్తుంది. పనులు సానుకూలమవుతాయి. సన్నిహితులకు తోడ్పాటు అందిస్తారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పెద్దలతో ఉల్లాసంగా గడుపుతారు. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ అవసరం. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. పరిచయాలు బలపడతాయి. ఆదాయం ఆశాజనకం. వేడుకలు, పండుగలకు బాగా వ్యయం చేస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. గృహంలో సందడి నెలకొంటుంది. నగదు చెల్లింపులు, స్వీకరణలో జాగ్రత్త. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలు, ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు ధనయోగం. అధికారులకు హోదా మార్పు, కొత్త బాధ్యతలు, ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్త్రీల ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులు పోటీల్లో విజయం సాధిస్తారు.

వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహణి, మృగశిర 1, 2 పాదాలు.

వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహణి, మృగశిర 1, 2 పాదాలు.

ఆకస్మికంగా కొన్ని వ్యవహారాలు సానుకూలమవుతాయి. స్థిరాస్తి మూలక ధనం అందుతుంది. మానసికంగా కుదుటపడతారు. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. పెద్దమొత్తం సహాయం క్షేమం కాదు. వస్త్రాలు, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. అత్యుత్సాహాన్ని అదుపు చేసుకోండి. సంతానం రాక సంతోషాన్నిస్తుంది. మీ శ్రీమతి సలహా పాటించండి. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. ఆశాదృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. వృత్తి వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. దైవదర్శనంలో ఒకింత ఇబ్బందులు తప్పవు. బెట్టింగ్‌లు, జూదాల జోలికి పోవద్దు.

మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు.

మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు.

ఈ మాసం ప్రథమార్థం ఏమంత అనుకూలం కాదు. ప్రతి వ్యవహారం స్వయంగా చూసుకోవాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ఆత్మీయుల సలహా పాటించండి. ఖర్చులు అంచనాలను మించుతాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు వాయిదా పడతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. శ్రమాధిక్యత మినహా ఆశించిన ఫలితం ఉండదు. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. దంపతుల మధ్య ఉత్సాహం నెలకొంటుంది. చిన్నారులకు విలువైన కానుకలందిస్తారు. ఉద్యోగయత్నంలో నిరుత్సాహం వీడండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉమ్మడి వ్యాపారాలు, నూతన పెట్టుబడులకు అనుకూలం. సేవ, సామాజిక, సన్మాన సభల్లో పాల్గొంటారు.

కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

స్థిరాస్తి మూలక ధనం అందుతుంది. ఖర్చులు విపరీతం. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆత్మీయులకు శుభాకాంక్షలు, కానుకలు అందిస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. శుభవార్తలు వింటారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను కచ్చితంగా తెలియజేయండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తుల వారికి అవకాశాలు కలిసివస్తాయి. అవకాశాలు అందినట్టే చేజారిపోతుంటాయి. నిరుద్యోగులకు ఓర్పు ప్రధానం. కళాత్మక పోటీల్లో స్త్రీలు విజయం సాధిస్తారు. విందులు, వేడుకల్లో మితంగా ఉండాలి. ద్విచక్ర వాహన చోదకులకు అత్యుత్సాహం తగదు.

సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం.

సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం.

ఈ మాసం మిశ్రమ ఫలితాల సమ్మేళనం. ఆత్మీయులకు శుభాకాంక్షలు, కానుకలు అందిస్తారు. మీ శ్రీమతి వైఖరి ఆశించిన మార్పు సంభవం. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. స్త్రీల ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక అంచనాలు ఫలించవు. ఊహించని ఖర్చుంటాయి. ధనం అతికష్టంమ్మీద సర్దుబాటు అవుతుంది. బంధుమిత్రులతో అకారణ కలహం, చికాకులు తలెత్తుతాయి. ఓర్పు, రాజీమార్గంలో సమస్యలు పరిష్కరించుకోవాలి. వ్యవహారాలు, బాధ్యతలు అప్పగించవద్దు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రముఖుల కలయిక వల్ల ఏమంత ప్రయోజనం ఉండదు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చిరు వ్యాపారులకు ఆశాజనకం. పెట్టుబడులకు తరుణం కాదు. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.

కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు.

కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు.

శుభకార్యం చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. హామీలు, మధ్యవర్తిత్వాలు తగదు. వ్యవహార జయం, మానసిక ప్రశాంతత పొందుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. ఆత్మీయులకు సాయం అందిస్తారు. బంధుత్వాలు బలపడతాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. భాగస్వామిక ఒప్పందాలకు అనుకూలం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. ఆస్తి, కోర్టు వ్యవహారాలు చికాకుపరుస్తాయి.

తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు.

తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు.

ఈ మాసం శుభదాయకమే. గృహంలో సందడి నెలకొంటుంది. శ్రీమతితో ఉల్లాసంగా గడుపుతారు. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. దూర ప్రదేశం నుంచి సంతానం రాక సంతోషాన్నిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. అనుకున్న సాక్ష్యాలు సాధిస్తారు. ఆదాయం సంతృప్తికరం. వస్త్రాలు, వాహనం, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. ఇతరుల బాధ్యతలు చేపట్టి ఇబ్బందులెదుర్కుంటారు. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. ఉద్యోగస్తుల కృషి ఫలిస్తుంది. ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో పురోభివృద్ధి గడిస్తారు. నూతన పెట్టుబడులకు అనుకూలం. విందులు, వేడుకల్లో పాల్గొంటారు.

వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనురాధ, జ్యేష్టం.

వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనురాధ, జ్యేష్టం.

సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. స్త్రీలు, విద్యార్థులు పోటీల్లో రాణిస్తారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ధనానికి ఇబ్బంది ఉండదు. స్థిరాస్తి మూలక ధనం అందుతుంది. కుటుంబీకులతో ఉత్సాహంగా గడుపుతారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను సున్నితంగా తెలియజేయండి. నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఉపాధ్యాయుల కృషి ఫలిస్తుంది. ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు. మీ సాయంతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నూతన పెట్టుబడులు లాభిస్తాయి. ఉద్యోగస్తులకు ధన, ఉన్నత పదవీయోగం. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.

ధనస్సు : మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం

ధనస్సు : మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం

ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. ఆత్మీయులను వేడుకలకు ఆహ్వానిస్తారు. పనులు సానుకూలమవుతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాసాలు కలిసివస్తాయి. ఖర్చులు విపరీతం. సంప్రదింపులు అనుకూలం. సలహా కంటే సొంత నిర్ణయాలే అనుకూలం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహించండి. పదవులు, కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. స్థోమతకు మించి హామీలివ్వొద్దు. పొగిడేవారిలో జాగ్రత్త. స్త్రీలు ప్రతిభా పోటీల్లో రాణిస్తారు. వృత్తుల వారికి పురోభివృద్ధి. గృహ నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. నూతన పెట్టుబడులు, పొదుపు పథకాలకు అనుకూలం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి.

మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1, 2 పాదాలు.

మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1, 2 పాదాలు.

ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలబడదు. అయిన వారే సాయం చేసేందుకు వెనుకాడుతారు. ఆత్మీయుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. వేడుకల్లో చిన్నారులకు కానుకలు చదివించుకుంటారు. నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు. దూర ప్రాంతం నుంచి సంతానం రాక సంతోషం కలిగిస్తుంది. కళాత్మక పోటీల్లో స్త్రీలకు నిరుత్సాహం తప్పదు. వ్యాపారాల్లో నష్టాలు భర్తీ చేసుకుంటారు. పెట్టుబడులకు అనుకూలం. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. ఏకపక్ష నిర్ణయం తగదు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఉద్యోగస్తులకు ధనలాభం. అధికారులకు బాధ్యతల మార్పు, పనిభారం. ప్రయాణంలో చికాకులెదుర్కుంటారు.

కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభద్ర 1, 2, 4 పాదాలు.

కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభద్ర 1, 2, 4 పాదాలు.

ఈ మాసం శుభాశుభాల మిశ్రమం. ఆత్మీయులు, ప్రముఖులకు శుభాకాంక్షలు, విలువైన కానుకలు అందిస్తారు. ఆశించిన పదవులు రాకపోవచ్చు. సమర్థతకు ఏమంత గుర్తింపు ఉండదు. ఒక సంఘటన మీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. స్థిరాస్తి మూలక ధనం అందుతుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. కుటుంబీకుల కోసం బాగా వ్యయం చేస్తారు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం తగదు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. సంతానం భవిష్యత్తు పట్ల మరింత శ్రద్ధ అవసరం. ఉద్యోగ ప్రకటనలు, దళారులను విశ్వసించవద్దు. వృత్తుల వారికి ఆశాజనకం. ఉపాధి పథకాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు గడిస్తారు. గృహ నిర్మాణాలు వేగవంతమవుతాయి. దైవకార్యంలో పాల్గొంటారు.

మీనం : పూర్వాబద్ర 4వ పాదం. ఉత్తరాబాద్ర, రేవతి

మీనం : పూర్వాబద్ర 4వ పాదం. ఉత్తరాబాద్ర, రేవతి

ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు విపరీతం. విలాసాలకు బాగా వ్యయం చేస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభం. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. ఏకపక్ష నిర్ణయాలు తగలు. పెద్దల సలహా పాటించండి. గృహంలో సందడి నెలకొంటుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. చిరు వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలు, ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. మార్కెట్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. వృత్తి ఉపాధి పథకాల్లో రాణిస్తారు. విద్యార్థులకు క్రీడా పోటీలు, ప్రాంగణ ఎంపికల్లో నిరుత్సాహం తప్పదు. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు.

English summary

2017 horoscope for all zodiac signs: Find out what the stars have in store for you

The prospect of a new year, a fresh start always comes along with an anticipation and excitement about how the coming year will unfurl, and 2017 is no exception. With hopes of a better tomorrow and brighter future in all aspects of life – love, career, money and of course well-being here’s how the New Year has to offer.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more