థాయ్ ల్యాండ్ మహిళ 11 మంది పురుషులతో ఏమి చేసిందో తెలిసి ప్రపంచమే షాక్

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

ప్రతి ఒక్కరూ అందమైన జీవితం గడపాలని కళలు కంటారు. అది నిజం చేసుకోవడానికి చాలా మంది ఎన్నో పనులు చేస్తుంటారు. కొంత మంది తాము అనుకున్న లక్ష్యాలు చేరడానికి మరియు కన్న కళలను సాకారం చేసుకోవడానికి కష్టపడి పనిచేస్తుంటారు. మరి కొంతమంది సులువుగా ఎలా తమ లక్ష్యాలను చేరుకోవాలని ఆలోచిస్తుంటారు.

ఇప్పుడు మనం చూడబోయే నిజ జీవిత కథ ఎవరి గురించి అంటే, ఒక మహిళ పురుషులను పెళ్లి చేసుకొని తన స్వార్థం కోసం వారిని వెర్రివాళ్లను చేయాలని నిశ్చయించుకుంది. థాయ్ ల్యాండ్ దేశ ఆచారాల ప్రకారం పెళ్ళికూతురికి ఇచ్చే కట్నం డబ్బుని స్వీకరించి పెళ్లి అయిపోగానే ఆ మహిళ భర్తలను ఎలా వదిలేసి పారిపోయిందో తెలిసి ప్రపంచమే నివ్వెరపోయింది.

భార్య మోసం చేసిందని ఆమె మర్మాంగాలలో భర్త ఏమి పెట్టాడో తెలిస్తే ఒళ్ళు జలదరిస్తుంది!

ఒక వ్యక్తి ఈ మహిళ చేస్తున్న మోసం గురించి సామాజిక మాధ్యమాల్లో వివరిస్తూ అందుకు సంబంధించిన చిత్రాలను పోస్ట్ చేసాడు. అవి క్షణాల్లో వైరల్ గా మారాయి.

ఆ మహిళ ఏమి చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆమె 11 మందిని పెళ్లి చేసుకుంది :

ఆమె 11 మందిని పెళ్లి చేసుకుంది :

ఈమె 11 మందిని పెళ్లి చేసుకోవడమే కాకుండా, ప్రతి ఒక్క భర్త దగ్గర నుండి 6 వేల డాలర్ల నుండి 30 వేల డాలర్ల వరకు వారి దగ్గర నుండి వసూలు చేసి ఆ తర్వాత జారుకుంది. ప్రతి ఒక్కరిని వదిలించుకోవడానికి, దూరంగా వెళ్లిపోవడానికి ఏవేవో కారణాలను చెబుతూ ఉండేది, ఒకరి దగ్గర చెప్పే కారణం ఇంకొకరి దగ్గర చెప్పేది కాదు.

పురుషులను పెళ్లి చేసుకొని ఎందుకు విడిచిపెట్టి వెళ్లిపోయేదంటే :

పురుషులను పెళ్లి చేసుకొని ఎందుకు విడిచిపెట్టి వెళ్లిపోయేదంటే :

పురుషులతో శృంగారంలో పాల్గొని పెళ్లి చేసుకున్న తర్వాత రకరకాల కారణాలు చెప్పి వాళ్ళ దగ్గర నుండి వెళ్లిపోయేది. అందులో భాగంగానే వాళ్ళ కుటుంబ పండ్ల వ్యాపారాన్ని చూసుకోవాలని అందుకోసం ఇంటికి తిరిగి వెళ్లిపోవాలని చెప్పేది లేదా మన ఇద్దరి జాతకాలు కలవడం లేదని ఇలానే గనుక కొనసాగితే సంసారం జీవితం భవిష్యత్తులో బాగోదని చెప్పేది. అలా ఏవేవో చెత్త కారణాలు చెప్పి అక్కడ నుండి జారుకునేది. ఇంత మంది పురుషులు ఆమె వలలో చిక్కుకున్నారని తెలిసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు !

ఒక్క నెలలో 4 పురుషులను వెర్రి వాళ్ళను చేసింది :

ఒక్క నెలలో 4 పురుషులను వెర్రి వాళ్ళను చేసింది :

కొన్ని వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ మహిళ నలుగురు పురుషులను మోసం చేసింది. థాయ్ ల్యాండ్ ఆచారం ప్రకారం ప్రేమ మరియు గౌరవానికి చిహ్నంగా కొత్తగా పెళ్లైనప్పుడు భర్త, భార్యకు డబ్బు ఇవ్వవలసిన అవసరం ఉంది. ఈ ఆచారాన్ని ఆసరాగా చేసుకుని అందరి దగ్గర డబ్బులు లాక్కొని బాగా ధనవంతురాలిగా మారిపోదాం అని అనుకుంది. ఇలా మోసం చేయడాన్ని ఒక వ్యాపారంగా మార్చుకొంది.

మీ భర్త మిమ్మల్ని మోసగిస్తున్నారని తెలిపే లక్షణాలు

ఈమె చేతిలో మోసపోయిన ఒక పురుషుడు సామాజిక మాధ్యమాల్లో ఈమె బండారాన్ని బయటపెట్టాడు, అది వైరల్ గా మారింది :

ఈమె చేతిలో మోసపోయిన ఒక పురుషుడు సామాజిక మాధ్యమాల్లో ఈమె బండారాన్ని బయటపెట్టాడు, అది వైరల్ గా మారింది :

ఈమె చేతిలో మోసపోయిన ఒక పురుషుడు కడుపు మండి, ఈమె గురించిన నిజాలు ప్రపంచానికి తెలియాలి అనే ఉద్దేశ్యంతో, ఇంకెవ్వరూ మోసపోకూడదు అనే ముందుచూపుతో సామాజిక మాధ్యమాల్లో ఈమె గురించి రాసుకొచ్చి ఆమె చిత్రాలను పోస్ట్ చేసాడు. ఆ పోస్ట్ క్షణాల్లో వైరల్ గా మారింది. దీంతో ఆమె చేతిలో తామందరూ మోసపోయామని గ్రహించిన భాదితులు ఆమె పై పోలీసులకు పిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమె పై కేసు బుక్ చేసి అరెస్ట్ చేశారు.

Images Source

English summary

Thai Woman Who Married 11 Men And Conned Them!

She ran away with all the dowry money that she received as gift from her new husbands.
Subscribe Newsletter