నీళ్ల కంటే పెట్రోల్ చాలా చౌకగా దొరికే ఈ ప్రదేశాల గురించి మీకు తెలుసా

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

పెట్రోల్ ధరలు వివిధ దేశాల్లో వివిధ రకాలుగా ఉంటాయి. కువైట్ మరియు సౌదీ అరేబియా వంటి దేశాల్లో నీళ్ల కంటే పెట్రోల్ చాలా చౌకగా దొరుకుతుంది.

ఇంకో వైపు యు.కె, నెదర్లాండ్స్, స్వీడన్ మరియు టర్కీ వంటి దేశాల్లో పెట్రోల్ కొనడం అనేది చాలా ఖరీదుతో కూడుకున్న వ్యవహారం.

నిద్రలో వచ్చే కలలు.. రియాలిటీకి దగ్గరగా ఉంటాయా ?

భారత దేశం లో మాత్రం పెట్రోల్ ధరలు ఎప్పుడూ నిలకడగా ఉండవు. కానీ, మిగతా దేశాలతో పోల్చి చూసినప్పుడు మాత్రం ఈ వస్తువు మన దేశంలో ఖరీదైనది అని అనిపిస్తుంది. ఈ క్రింది దేశాల్లో పెట్రోల్ ఎంత చౌకగా దొరుకుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

ఇప్పుడు ఈ ప్రపంచంలో నీళ్ల కంటే చౌక ధరకు దొరికే పెట్రోల్ దేశాల గురించి తెలుసుకోబోతున్నాం. అక్కడి దేశాల ఆసక్తికర విషయాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

మగువల గురించి చెప్పే ఆసక్తికర అంశాలు

1. వెనిజులా :

1. వెనిజులా :

వెనిజులా దేశంలో పెట్రోల్ ధర చాలా చౌక. ఇక్కడ ఒక లీటరు పెట్రోల్ ధర 0.031 డాలర్ మాత్రమే. అంటే మన డబ్బులో రెండు రూపాయలు అని అర్ధం. దేశంలో 50% ఆర్ధిక వ్యవస్థ పెట్రోల్ ఎగుమతుల పైనే ఆధారపడి ఉంది. ఈ విధంగానే ఆ దేశానికి ఎంతో డబ్బు చేకూరుతుంది.

2. సౌదీ అరేబియా :

2. సౌదీ అరేబియా :

పెట్రోల్ చౌక గా దొరికే దేశాల్లో సౌదీ అరేబియా కూడా ఒకటి. ఈ ప్రపంచంలో అత్యధికంగా చమురు ఉత్పత్తి చేసే దేశాల్లో సౌదీ అరేబియా కూడా ఒకటి. పెట్రోల్ ని అత్యధికంగా ఎగుమతి చేస్తుంది. సౌదీ అరేబియాలో ఒక లీటర్ పెట్రోల్ ధర 0.096 డాలర్ అంటే మన డబ్బులో ఆరు రూపాయల ఇరవై పైసలు అని అర్ధం.

3. లిబియా :

3. లిబియా :

ప్రపంచంలో అత్యంత చౌకగా పెట్రోల్ దొరికే దేశాల్లో లిబియా మూడవ స్థానంలో ఉంది. ఈ ప్రపంచంలో తొమ్మిదవ అతిపెద్ద పెట్రోల్ ఉత్పాదక దేశంగా లిబియా నిలిచింది. ఇక్కడ ఒక్క లీటర్ పెట్రోల్ ధర 0.110 డాలర్ అంటే మన డబ్బులో ఏడు రూపాయల ఐదు పైసలు అనమాట.

4. తుర్క్మెనిస్తాన్ :

4. తుర్క్మెనిస్తాన్ :

తుర్క్మెనిస్తాన్ లో ఎవరైనా పెట్రోల్ ని నెలకు 120 లీటర్లు వరకు ఉచితంగా వాడుకోవచ్చు. ఈ కారణం వల్ల ఆ దేశంలో పెట్రోల్ ధరను నిర్దేశించలేదు. ఎవరైనా ఒకవేళ 120 లీటర్ల మించి పెట్రోల్ వాడితే వాళ్ళు లీటర్ కు 0.146 డాలర్ చెల్లించవలసి ఉంటుంది. అంటే మన డబ్బులో 9 రూపాయల 40 పైసలు అని అర్ధం.

5. బహరేన్ :

5. బహరేన్ :

బహరేన్ దేశానికి అత్యధిక ఆదాయం చమురు ఉత్పత్తి నుంచే వస్తుంది. ప్రపంచంలో అత్యంత చౌకగా పెట్రోల్ ని ఉత్పత్తి చేసే దేశాల్లో ఐదవ స్థానంలో ఈ దేశం నిలుస్తుంది. ఇక్కడ ఒక లీటర్ పెట్రోల్ ధర 0.158 డాలర్ మాత్రమే. అంటే మన డబ్బులో 10 రూపాయల 20 పైసలు.

6. కువైట్ :

6. కువైట్ :

ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు కలిగిన దేశాల్లో కువైట్ ఐదవ స్థానంలో నిలుస్తుంది. కువైట్ లో సగటున లీటర్ పెట్రోల్ ధర 0.171 డాలర్లు, అంటే మన డబ్బులో 11 రూపాయలు. కువైట్ దేశంలో 104 బిలియన్ బ్యారెల్ల చమురు నిల్వలు ఉన్నాయని చెబుతారు.

7. కతర్ :

7. కతర్ :

ప్రపంచంలో చౌకగా పెట్రోల్ ఉత్పత్తి చేసే దేశాల్లో ఈ దేశం ఏడవ స్థానంలో ఉంది. కతర్ కు అత్యంత ఆదాయం చమురు ఉత్పత్తి ద్వారానే సమకూరుతుంది. ఈ దేశంలో 15 బిలియన్ బ్యారెల్ల చమురు నిల్వలు ఉన్నాయి. ఇక్కడ ఒక లీటర్ పెట్రోల్ ధర 0.182 డాలర్, అంటే మన డబ్బులో 11 రూపాయల 70 పైసలు అని అర్ధం.

8. ఈజిప్ట్ :

8. ఈజిప్ట్ :

సుయెజ్ జలమార్గం ఈ దేశానికి అతిముఖ్యమైన జీవనాడి. ఈ మార్గం గుండా ప్రతిరోజూ ఒక బిలియన్ లీటర్ల పెట్రోల్ రవాణా జరుగుతుంది. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర 0.232 డాలర్, అంటే మన డబ్బులో 15 రూపాయల 15 పైసలు. ఈ దేశంలో రాజకీయమార్పుల వల్ల పెట్రోల్ ధర అనిశ్చితి లో పడిపోయింది.

9. ఒమన్ :

9. ఒమన్ :

ఒమన్ దేశం ప్రతి రోజు 6 లక్షల బ్యారెల్ల పెట్రోల్ ఉత్పత్తి చేస్తుంది. దీంతో ఆ దేశం పెట్రోల్ ధరలను ఖచ్చితంగా తగ్గించవల్సి వస్తోంది. అక్కడ సగటున ఒక లీటర్ పెట్రోల్ ధర 0.243 డాలర్, అంటే మన డబ్బులో 15 రూపాయల 86 పైసలు.

10. అల్జీరియా :

10. అల్జీరియా :

ఆఫ్రికాలో అత్యధికంగా పెట్రోల్ ఉత్పత్తి చేసే దేశాల్లో ఈ దేశం కూడా ఒకటి.అంతే కాకుండా ప్రపంచంలో చౌకగా పెట్రోల్ ఉత్పత్తి చేసే దేశాల్లో ఈ దేశం స్థానం సంపాదించుకుంది. అల్జీరియా దేశం ఈ పట్టికలో 10 వ స్థానంలో నిలుస్తుంది. సగటున ఈ దేశం ఒక రోజుకు 1.2 మిలియన్ బ్యారెల్ల పెట్రోల్ ఉత్పత్తి చేస్తుంది. 60% ఆదాయం ఈ దేశానికి చమురు ఉత్పత్తి ద్వారానే లభిస్తుంది. అల్జీరియా చౌకగా పెట్రోల్ ఉత్పత్తి చేసే దేశాల్లో 10 వ స్థానంలో ఉంటడం తో, ఈ దేశంలో లీటర్ పెట్రోల్ ధర 0.244 డాలర్ మాత్రమే, అంటే మన డబ్బులో 15 రూపాయల 72 పైసలు.

పైన చెప్పబడిన దేశాల్లో పెట్రోల్ చాలా చౌకగా దొరుకుతుంది. ఈ దేశాల్లో పోల్చిచూసినప్పుడు మన భారత దేశంలో పెట్రోల్ ధర చాలా ఎక్కువగా, ఖరీదుగా ఉందని తెలుస్తోంది.

ముఖ్య గమనిక : పెట్రోల్ ధర అనేది వివిధ రకాల కారకాల పై ఆధారపడి ఉంటుంది. కావున అది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది.

English summary

Places Where Petrol Is Cheaper Than Water!

When it comes to India, the price of petrol is fluctuating; but it is still an expensive commodity as compared to other countries, which are as listed below. Today, we would speak about the places where petrol is cheaper than water. Go ahead and take a look.
Story first published: Saturday, October 14, 2017, 18:00 [IST]
Subscribe Newsletter