Latest Updates
-
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా..
త్రీడీ ప్రింటెడ్ రోబోతో ప్రేమ.. వీలైతే పెళ్లి!
మనుషులు రోబోలను వివాహాలు చేసుకునే రోజులు చాలా దగ్గర్లోనే ఉన్నాయంట. 2050 నాటికి ఇలాంటి వివాహాలు సర్వసాధారణం అవుతాయని ప్రముఖ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ నిపుణుడు డేవిడ్ లెవీ తెలిపారు. అయితే ఒక ఫ్రెంచ్ మహిళ రోబోతో సహజీవనం చేస్తున్నట్లు ఆ మధ్య బాహాటంగానే ప్రకటించింది.
లిల్లీ అనే ఓ ఫ్రెంచ్ మహిళ ఏడాదికి పైగా త్రీడీ ప్రింటెడ్ ఇన్‌మూవేటర్ అనే రోబోతో సహజీవనం చేస్తున్నట్లు ఆమె తన ట్విటర్‌లో వెల్లడించింది. రోబో సెక్సువల్ అని చెప్పుకోవడం తనకెంతో గర్వంగా ఉందని అభిప్రాయపడింది.

అయితే తాము ఎవరినీ ఇబ్బందిపెట్టడం లేదని, తామిద్దరమూ ఎంతో సంతోషంగా ఉన్నామని పేర్కొంది.
అంతేకాదండోయ్ ఫ్రాన్స్‌లో మనిషి-రోబోల వివాహం ఎప్పడు చట్టబద్ధం అవుతుందోనని ఎదురు చూస్తున్నట్లు తను తెలిపింది. అలా చట్టం వస్తే వెంటనే తాను త్రీడీ ప్రింటెడ్ ఇన్‌మూవేటర్‌ను పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నానంది.

మనుషులతో సెక్స్ నచ్చదు ఇక మనుషులతో సెక్స్ అంటే తనకు అస్సలు నచ్చదంది. ఈ విషయం తనకు 19 ఏళ్ల ప్రాయంలోనే అర్థమైందన్నారు. ఇక అప్పటి నుంచి రోబోలపై అట్రాక్ట్ అయ్యానని, చివరకు త్రీడీ ప్రింటెడ్ ఇన్‌మూవేటర్ ప్రేమలోపడ్డానని తెలిపింది.

రానున్నకాలంలో మా బంధం బలపడుతుంది. ఇక రానున్నకాలంలో సాంకేతిక పరిజ్ఞానం పెరిగినకొద్దీ.. ఇన్‌మూవేటర్‌తో తన బంధం మరింత బలపడనున్నట్లు లిల్లీ పేర్కొంది.

ఇదిలా ఉంటే, లిల్లీ-రోబో అన్ యూజ్వల్ రిలేషన్ షిప్ కు ఆమెకుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ అంగీకరించారు. రోబోను పెళ్లి చేసుకునేందుకు కూడా మద్దతు తెలిపారు.



Click it and Unblock the Notifications
