మీరు ఎప్పడూ చూడని ఫొటోలను ఒక్కసారి చూడండి !

By: Y. Bharath Kumar Reddy
Subscribe to Boldsky

గత విషయాలను మనకు ఫొటోలే వివరిస్తాయి. అప్పటి సంఘటనలన్నీ మనకు ఫొటోల ద్వారా ఈజీగా తెలుస్తాయి. ఫొటోలు అప్పటి పరిస్థితులను మనకు కళ్ల ముందు చూపిస్తాయి. దుఃఖం, ఆవేశం, ఆక్రోశం, ఆనందం ఇలా ఏదైనా సరే మన కళ్ల ఎదుట కనపడుతుంది. గతాన్ని బంధించి భవిష్యత్తుకు అందించేదే ఫొటో.

గతించిన క్షణాల్ని... శాశ్వతంగా పదిలపరిచే కొన్ని ఫొటోలు ఎప్పటికీ ఆసక్తికరంగా ఉంటాయి. అలాంటి ఫొటోల్లో కొన్ని భయంకరంగా కూడా ఉంటాయి. కొన్ని ఫేక్ ఫొటోలుంటాయి. కొన్ని చరిత్ర గురించి తెలుపుతాయి. ఇలా పలు ఆసక్తికర విషయాలు తెలిపే ఫొటోల్లో కొన్నింటిని మీరూ చూడండి.

1. ముఖాలకు మాస్క్స్

1. ముఖాలకు మాస్క్స్

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో చాలామంది జనాలు ఇలా ముఖాలకు మాస్క్ ధరించి నిరసన తెలిపేవారు. యుద్ధం వల్ల జరిగిన బాంబుల దాడిలో అందరూ బతికున్నా అస్థిపంజరాలుగా మారుతున్నారని చెప్పడానికి నిదర్శనంగా ఇలా నిరసన చేపట్టేవారు.

2. శాంటా క్లాజా

2. శాంటా క్లాజా

శాంటా క్లాజా అంటే మనకు గుర్తొచ్చేది బోలేడన్నీ బహుమతులు. వాటిని తీసుకొచ్చి మనకిచ్చి ఆనందపరుస్తాడనే విషయం మనకు తెలిసిందే. అయితే ఈ శాంటా క్లాజా మాత్రం అప్పట్లో ఇలా పూర్ పీపుల్స్ కోసం విరాళాల సేకరణ చేపట్టారు. కాస్త డిఫరెంట్ శాంటా క్లాజా ఇతను.

3. ఫొటో బాగా తీయండి

3. ఫొటో బాగా తీయండి

ఇప్పడంటే ప్రతి ఒక్కరూ సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు. కానీ అప్పట్లో కూడా సెల్ఫీ తీసుకున్నట్లే ఫొటో దిగారు ఈ బామ్మ. మరి వెనుకాలా ఉన్న ముసలాయనేమో తనను బాగా ఫొటో దింపండి అన్నట్లుగా నిలపడ్డాడు.

4. వామ్మో.. దెయ్యం

4. వామ్మో.. దెయ్యం

చుట్టూ అంతటా గోడలే ఉన్నాయి. అయినా గోడల్లోంచి ఒక తల బయటకొచ్చింది. నిజంగానే ఇది దెయ్యమంటారా. ఏమో మరి.

5. మమ్మీ లేచి కూర్చొంది

5. మమ్మీ లేచి కూర్చొంది

రష్యాలో ఇలా ఒక ఈజిప్ట్ మమ్మీ లేచి కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు అప్పట్లో జోరుగా ప్రచారం సాగింది. కానీ ఇది నిజంగా మమ్మీ కాదని మరో రూమర్.

6. దెయ్యం బేబీ

6. దెయ్యం బేబీ

దాదాపు హారర్ సినిమాల్లో ఈ దెయ్యం బేబీ ఉంటుంది. మరి ఈ దెయ్యం బేబీ తన ఫ్రెండ్ తో కలిసి ఇలా ఫొటో దిగిందంట. దాన్ని అందరూ చూసి షాకయ్యారు.

7. నేను రాక్షసున్ని

7. నేను రాక్షసున్ని

అసురుడిగా జన్మించిన మానవుణ్ని నేనూ అంటూ ఫొటో దిగాడు ఓ మనిషి. సినిమాల్లో మాదిరిగా వేషధారణ వేసుకుని దిగిన ఈ ఫొటో అప్పట్లో బాగా హల్ చల్ చేసింది.

8. అమ్మడికి ఏమైందో

8. అమ్మడికి ఏమైందో

ఈ అమ్మడికి ఏమైందో ఎవరికీ తెలియదు. కానీ ఇలా షాపింగ్ మాల్ లోకి వచ్చి సడన్ గా ఇలా నిలపడి పోయింది. ఈ చిత్రం సీసీ కెమెరాలకు చిక్కింది. దెయ్యంగాన వచ్చి మెడలు వెనక్కి తిప్పిందేమో మరి.

9. బయటకు వదలండి

9. బయటకు వదలండి

నన్ను ఎందుకు ఇందులో బంధించారు? బయటకు వదలండి అన్నట్లుగా చూస్తంది ఈ విచిత్రజీవి.

10. ఫేసులు చూడాలనుకోవొద్దు

10. ఫేసులు చూడాలనుకోవొద్దు

మా ఫేసులు చూడాలనుకోవద్దండి. ఇది మా ఆచారం. మేము ఇలాగే ఉంటాం. మరి ఎలా కనపడుతుంది అని కదా మీ డౌట్. మా రూట్లు మాకు ఉంటాయి.

11. కాపలాగా ఉంటా

11. కాపలాగా ఉంటా

మీరు లోపలికి వెళ్లాక ఎవరూ రాకుండా నేను ఇలా కాపలాగా ఉంటా. సిన్సియర్ గా డ్యూటీ నిర్వహిస్తుంది ఈ విచిత్రజీవి.

12. బయటకు ఇలాగే వచ్చేవారు

12. బయటకు ఇలాగే వచ్చేవారు

రెండో ప్రపంచయుద్ధం సమయంలో అందరూ బయటకు ఇలాగే వచ్చేవారు. చిన్నపిల్లలకు కూడా ఇలాంటి మాస్క్ లే వేసేవారు.

13. ఐరన్ లంగ్

13. ఐరన్ లంగ్

అప్పట్లో బ్రీతింగ్ సమస్యతో బాధపడేవారిని ఇలాంటి వాటిలో ఉంచి చికిత్స అందించేవారు. లంగ్స్ సమస్యతో బాధపడేవారికి ఈ ట్రీట్మెంట్ ఇచ్చేవారు.

14. స్పైడర్

14. స్పైడర్

మామాలుగా చిన్నచిన్న సాలెపురుగులను మనం ఇంట్లో చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం ఒక ఇంట్లో పెద్ద సాలెపురుగు ఆవాసం ఏర్పరుచుకుంది. అంతేకాదు తన పిల్లాపాపలతో తన సామ్రజ్యాన్ని పటిష్టం చేసుకుంది.

15. ఫొటోలో దెయ్యం

15. ఫొటోలో దెయ్యం

వీళ్లు బర్త్ డే ఫంక్షన్ చేసుకున్నారు. అప్పుడు ఫొటో దిగారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరు. కానీ ఫొటో ప్రింట్ లో మాత్రం ఇలా ఒక అనామకుడు కిందకు వెళాడుతున్నట్లు కనిపించాడు. అయితే ఇందులో ఎంతమాత్రం నిజం ఉందో తెలీదు.

16. మాకు జతగా

16. మాకు జతగా

అడవిలో మాలాంటి జంతువులకు తోడుగా ఎవరో వచ్చాన్నట్లు బిక్కముఖం వేసుకుని చూస్తున్నాయి ఈ జింకలు. ఆవిడ కూడా వాటిని తదేకంగా చూస్తున్నారు.

17. బీరువాలో భద్రంగా

17. బీరువాలో భద్రంగా

చనిపోయిన వాళ్ల డ్యాడీని బీరువాలో ఇలా భద్రంగా ఉంచుకున్నట్టున్నారు వీరు. రోజూ ఇలా కాళ్లకు దండం పెట్టుకుని రోజూ ప్రారంభిస్తున్నట్లున్నారు.

18. కిడ్నాప్ అయ్యాడనుకుంటున్నారా?

18. కిడ్నాప్ అయ్యాడనుకుంటున్నారా?

ఈ బాలుడ్ని ఎవరో కిడ్నాప్ చేశారనుకుంటున్నారా? లేదు వాళ్ల అమ్మానాన్నే ఇలా వెరైటీగా ఫొటో దిగి హల్ చల్ చేశారు.

19. గాల్లో తేలిపోతున్నారు

19. గాల్లో తేలిపోతున్నారు

ఈ ఫొటోలో ఒక వంతెనైపై ఆరుమంది అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. అలా వెళ్లాలంటే చాలా ధైర్యమే ఉండాలి. వంతెను కింద ముసుగులో ఉన్న వ్యక్తులు వారికి ఎలాంటి భయం కలగకుండా అండగా ఉన్నట్లున్నారు.

20. ఫొటో తియ్యకుంటే దూకుతా

20. ఫొటో తియ్యకుంటే దూకుతా

ఒరేయ్ బాబు.. అంత చివరకు వెళ్లొద్దురా అంటున్నట్లున్నాడు ఫొటో తీసే వ్యక్తి. ఈయనేమో నన్ను ఇలాగే ఫొటో తీయండి..లేదంటే దూకుతా అన్నట్లుగా ముందుకెళ్తున్నాడు.

Read more about: pulse, insync
English summary

top 20 creepy photos that captured history

Can you handle the creepy pictures found in this list? Top 20 Creepy Photos That Captured in History!
Story first published: Friday, November 17, 2017, 17:00 [IST]
Subscribe Newsletter