రాశిని చూసి, స్నేహం చేయండి!! మీకు నచ్చిన విధంగా ఉంటారు...

By: Lakshmi Perumalla
Subscribe to Boldsky

ప్రతి రాశి చక్రానికి ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు మనల్ని మనం అర్ధం చేసుకోవటానికి సహాయపడతాయి.

మీ రాశిచక్రంలోని లక్షణాలు మీ వ్యక్తిత్వంలో బాగా స్థిరంగా ఉంటాయి. అవి ఒక వ్యక్తిగా మరియు మీ స్నేహితులపై ప్రభావాన్ని చూపుతాయి.

అత్యంత శక్తివంతమైన 5 రాశులు & వాటి అదృశ్య లక్షణాలు

కాబట్టి మీ రాశి చక్రం సంకేతాల ఆధారంగా ఒక స్నేహితుడిగా మీరు నిర్వచించే లక్షణాల్లో కొన్ని ఇక్కడ ఉన్నాయి. వాటిని ఒకసారి తనిఖీ చేయండి.

మేష రాశి

మేష రాశి

మీ ఉనికి ఎప్పుడు తెలిసేలా ఉండాలని కోరుకుంటారు. మీరు చాలా బలమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే చాలా ధైర్యంగా, సాహసోపేతంగా మరియు ఉత్సాహంగా ఉంటారు. మీరు చాలా చురుకుగా ఉంటారు. మీరు మీ చుట్టూ ఉన్న స్నేహితులకు సవాలు చేసే కొత్త మరియు ఆహ్లాదకరమైన పనులను చూపిస్తూ ఉంటారు.

వృషభ రాశి

వృషభ రాశి

మీకు ఓపిక ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏదైనా పనిని అంకిత భావంతో చేస్తారు. మీరు చాలా చాలా విశ్వసనీయతను కలిగి ఉంటారు. అలాగే మీ చుట్టూ ఉన్నవారు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. మీరు చాలా స్నేహంగా ఉంటారు మరియు మీ స్నేహితులకు నమ్మకంగా ఉంటారు.

మిధున రాశి

మిధున రాశి

మీరు సామాజిక,అనువర్తన యోగ్యమైన మరియు త్వరితగతిగా ఎవరి గురించి అయినా సంబాషణను ప్రారంభించేసారు. మీరు ఎల్లప్పుడూ మీ స్నేహితుల కోసం కొత్త మరియు ఆహ్లాదకరమైన పనులను చేస్తూ ఉంటారు. మీ ఆసక్తికరమైన స్వభావం మీ స్నేహితులు నిరాశ్రయులను చేస్తుంది. కాబట్టి మీరు చేయాల్సిన పని ఎదో ఉంది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి

మీరు ఇతరులను బాగా అర్ధం చేసుకుంటారు. మీరు తరచుగా సున్నితంగా మరియు బావోద్వేగంగా ఉంటారు. మీరు దానిని చూపించక పోయిన లేదా ఇతరులకు తెలియకపోయిన అలానే ఉంటారు. కానీ మీరు ఒక స్నేహితుడిగా స్నేహితుని వెనక సాయంగా ఉంటారు. మీకు బాగా దగ్గరైన వ్యక్తులకు విశ్వసనీయతను చూపిస్తారు. అయితే కష్టాలు ఎదురైనప్పుడు మీరు మూడిగా లేదా నిరాశావాదంగా మారిన సందర్భాలు కూడా ఉంటాయి.

సింహ రాశి

సింహ రాశి

మీరు గుర్తుండి పోయే వ్యక్తిగా ఉంటారు. మీరు మీ స్నేహితుల పట్ల ఉదారత కలిగి ఉండుట, విశ్వసనీయత కలిగి ఉండుట, స్నేహితులకు అవసరమైనప్పుడు సహాయపడే సమయాన్ని, శక్తిని కలిగి ఉంటారు. మీరు ఎప్పుడు బృంద నాయకుడిగా ఉండి చాలా ఆత్మవిశ్వాసంను కలిగి ఉంటారు. కొన్నిసార్లు ఇతరుల సమస్యల పట్ల అహంకారం మరియు నిర్లక్ష్యం ఉండవచ్చు.

కన్య

కన్య

మీరు చాలా నమ్మకంగా,దయగా మరియు దీర్ఘకాల స్నేహాలను కలిగి ఉంటారు. మీరు ఎప్పుడు ఒకేలా ఉండుట వలన జీవితంలో మార్గనిర్దేశం చేసే నైతిక దిక్సూచిగా ఉంటారు. మీరు మంచి కమ్యూనికేట్ చేస్తారు. మీకు ఎలా అన్పిస్తే ఆలా వ్యక్తపరుస్తారు.

మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ఉండాలంటే ఏ రెండు రాశులు కలవకూడదు ?

తుల

తుల

మీరు సామాజిక,దయ గల మరియు మద్దతు గల స్నేహితుడు. మీరు వ్యక్తులతో ఉన్నప్పుడు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడరు. ఎవరితోనైనా మీరు నిరంతరం చర్చలు మరియు చాట్ చేస్తూ ఉంటారు. మీరు చాలా శాంతియుతంగా ఉంటారు. అలాగే సాధ్యమైనప్పుడు సంఘర్షణలను నివారించడానికి ప్రయత్నిస్తారు.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి

మీరు నిజమైన స్నేహితుడిగా ఉంటారు. మీ స్నేహితులు కూడా అలాగే ఉండాలని కోరుకుంటారు. మీకు చాలా ఉద్రేకం,నిశ్చలం మరియు నిజాయితీ కలిగి ఉండటం వలన మీరు గొప్ప స్నేహితుడిగా ఉంటారు. మీరు స్నేహితులతో ఉండటానికి ఇష్టపడతారు. మీకు మీరే చాలా తెలివైనవారిగా భావిస్తూ ఉంటారు.

ధనుస్సు

ధనుస్సు

మీరు చాలా ఉదారంగా, ఓపెన్ మైండెడ్ మరియు ఉత్సాహభరితంగా ఉంటారు. మీరు మంచి హాస్య ప్రియులుగా ఉంటారు. మీ చుట్టూ మంచి స్నేహితులు ఉండాలని కోరుకుంటారు. మీరు ప్రయాణాల ద్వారా సంస్కృతి మరియు వైవిధ్యాన్ని కనుగొంటారు. అలాగే లోతైన ప్రేమ మరియు మెప్పును కూడా కలిగి ఉంటారు.ఒక వ్యక్తిగా మీరు సరదాగా,ప్రేమగా మరియు మీ రిలేషన్ లో అంకితభావాన్ని కలిగి ఉంటారు. ఇది మీ మధ్య పరస్పర అవగాహనకు సహాయపడుతుంది.

మకర రాశి

మకర రాశి

మీరు స్నేహితుని పట్ల బాధ్యత, విశ్వసనీయత మరియు నమ్మకంగా ఉంటారు. కొన్ని సార్లు చాలా గంబీరంగా ఉంటారు. మీ స్వంత మార్గాల్లో ఆలోచిస్తారు కానీ ప్రజలకు దగ్గరగా,సౌకర్యవంతముగా మరియు సహాయకారిగా ఉంటారు. ఇతరులు మిమ్మల్ని బాధపెట్టడానికి ప్రయత్నిస్తే, మీరు చాలా కూల్ గా మరియు తప్పు సహించని వ్యక్తిగా మారతారు.

కుంభ రాశి

కుంభ రాశి

మీరు ప్రపంచంలో అత్యంత అద్భుతమైన స్నేహితుల్లో ఒకరిగా ఉంటారు. మీ గురించి ఇతరులు తెలుసుకోవటానికి సమయాన్ని ఇవ్వాలి. మీరు పరిస్థితులను అర్ధం చేసుకొని ఆలోచిస్తూ సమస్యలను పరిష్కరిస్తారు. మీరు గొప్ప ప్రేరేపకుడు, మంచి సలహాదారునిగా ఉండి గొప్పగా సమస్య పరిష్కారం చేస్తారు.

మీన రాశి

మీన రాశి

మీరు చాలా స్నేహపూర్వకంగా మరియు కరుణతో ఉంటారు. మీకు ఉదారంగా ఉండటం, నిస్వార్థంగా ఉండటం అనేది ఒక నిర్మాణాత్మక విషయం చెప్పవచ్చు. మీరు మీ భావాలను కమ్యూనికేట్ చేయడానికి మరియు వ్యక్తం చేయడానికి చాలా మానసికంగా సిద్ధంగా ఉంటారు. గొప్ప దృక్పధాన్ని కలిగి ఉంటారు. ఏదైనా తప్పు జరిగితే మీరు పసిగట్టే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు.

English summary

How Exactly Are You As A Friend Based On Your Zodiac Sign

Does your zodiac sign define your personality or the kind of friend you can be? Know more here!
Subscribe Newsletter