మహిళలపై జరుగుతున్న అరాచకాలపై పోరాటం : మేకప్ కూడా ఒక అస్త్రం ఆవిడ చేతుల్లో

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

మహిళలపై జరుగున్న దాడులకు, అరాచకాలపై పోరాటానికి అనేకమంది నడుంబిగించారు. సామాజిక మాద్యమాలు, ధర్నాలు, రాలీలు , కొవ్వొత్తుల నిరసనలు ఇలా అనేక అంశాల ద్వారా అనేకమంది తమ తమ భావాలను వ్యక్తపరచి, సమాజంలో మార్పును తీసుకుని రావడానికి ప్రయత్నించారు. కానీ ఇలాంటి అంశాలలో మేకప్ కూడా ఉంటుందని ఊహించగలమా ...! తన భావాలను అస్త్రంగా చేసి సంధించడానికి 24 యేళ్ళ రాండ్ జరల్లా అనే ఒక కళాకారిణి ఉపయోగించిన మాద్యమం “మేకప్”.

రాండ్ జరల్లా పుట్టింది పెరిగింది పాలస్తీనాలో, భాధాకరంగా ఎన్నో సంఘర్షణల మద్య ఎన్నో అరాచకాలకు సాక్ష్యంగా పెరిగిన రాండ్, తన భావాలను ప్రపంచంతో పంచుకోవడానికి ఎన్నుకున్న మార్గం, తనకు తెలిసిన కళ “మేకప్” . ఈ మేకప్ ద్వారా ఎన్నో భావాలను , మహిళలపై జరుగుతున్న అరాచకాలను అద్దం పట్టేలా ప్రపంచం ముందు ఉంచగలిగింది రాండ్.

The Makeup From An Artist Shows The Different Ways Women Undergo Violence

రాండ్ పిన్నవయసులోనే తన లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఈ వృత్తిని ఎంచుకుంది. 24 యేళ్ళ వయసులోనే ప్రపంచంసైతం గుర్తించింది అంటేనే తన భావాలు ఎంత మేర ప్రభావితం చేశాయో తెలుస్తూనే ఉంది.

ఒక్కసారి ఆ మేకప్ తో కూడిన ఫోటోలను చూడండి- ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఎంత హీన స్థితిలో అరాచకాలకు, అకృత్యాలకు సమిధాలు అవుతున్నారో కళ్ళకు కట్టినట్లు భావాలు పలికిస్తున్నాయి కదూ..!

ఆమె నినాదం:

ఆమె నినాదం:

మహిళలపై జరుగున్న అకృత్యాలపై ప్రజలలో చైతన్యం తీసుకుని రావడం మరియు మహిళల అవసరం ప్రపంచానికి ఛాతీ చెప్పడం. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు, అనేక రకాల కష్టాలు ఎదురైనప్పుడు ప్రజలు ముందుకు వచ్చేలా ఉండాలి అన్నది ఆమె ఆశయం.

ఆమె స్పూర్తి:

ఆమె స్పూర్తి:

ఈమద్యనే ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో #metoo అనే సోషల్ మీడియా ఉద్యమం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని. ఆడవారి మీద జరుగుతున్న లైంగిక దాడులకు నిరసనగా చేసిన ఈఉద్యమం తనలో ఎన్నో ఆలోచనలను నిద్రలేపాయని. ఇలాంటి ఘోరాలను, వారి ఆరోగ్య మానసిక సమస్యలను ప్రజలకు తెలియజేసి వారిలో చైతన్యం తీసుకుని రావాలన్న లక్ష్యంతోనే ఈ కళను మాద్యమంగా ఎంచుకున్నట్లు తెలిపారు.

యాసిడ్ అటాక్ భాదితురాళ్ళ వేదన వర్ణనాతీతం:

యాసిడ్ అటాక్ భాదితురాళ్ళ వేదన వర్ణనాతీతం:

ఈమద్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దాడులలో యాసిడ్ అటాక్స్ సర్వ సాధారణమైపోయాయి అనడం సత్యం. ఆసిడ్ దాడి జరిగిన తర్వాత చర్మం ఎలా తగలబడి, కరిగిపోతుందో, తద్వారా ఎముకలు సైతం కనిపిస్తూ ఎంత అందవిహీనంగా మొహం తయారవుతుందో, క్రమంగా ఆ మచ్చలతో శారీరికంగా, మానసికంగా జీవితాంతం ఎంతటి నరకవేధనకు మహిళలు గురవుతున్నారో కళ్ళకు కట్టినట్లు తన కళ ద్వారా చూపగలిగింది రాండ్ .

పసిపిల్లలపై పాశవిక లైంగిక దాడి:

పసిపిల్లలపై పాశవిక లైంగిక దాడి:

వినడానికే హేయనీయమైన చర్యగా కనిపించే ఇలాంటి దాడులకు పూనుకునే వారు కూడా ఈ భూమి మీద ఉండడం విచారకరం. ఎవరికీ తమ భాధను చెప్పుకోలేక, అర్ధం చేసుకునే స్థాయి లేక ఆ పసిపిల్లలు మానసికంగా ఎలా నలిగిపోతున్నారో ఊహించుకుంటేనే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. కానీ చాలామంది పసిపిల్లలపైన భౌతికంగానే కాకుండా లైంగికదాడులు కూడా జరుగుతున్నాయి, ఇలాంటివి ఆపిల్లలను జీవితాంతం మానసికంగా ప్రభావితం చేస్తాయి కూడా. ఈభావాలను కూడా కళ్ళకు కట్టినట్టు చూపగలిగింది రాండ్.

మహిళల జననాoగలపై కోత:

మహిళల జననాoగలపై కోత:

వినడానికే జీర్ణించుకోలేని ఈభాధను తెలీకుండా ఆఫ్రికా,ఆసియా దేశాలలో చాలా తెగలలోని మహిళలు అనుభవిస్తున్నారు. వారి ఆచారాలప్రకారం జనానాంగాలపై కోతలు, లేదా తొలగించడాలు వంటివి పూనుకుంటున్నాయి. తన కళ ద్వారా 2030లోపు ఈఆచారాలకు చెక్ పెట్టాలని భావిస్తోంది రాండ్.

బహిష్టు సమస్యలు:

బహిష్టు సమస్యలు:

బహిష్టుస్రావం శరీరచర్యలలో భాగమే కానీ,మహిళలు చెప్పుకోడానికి కూడా ఇబ్బందిపడే సమస్యగా మారకూడదని తన కళ ద్వారా చెప్పే ప్రయత్నం చేసింది రాండ్.

చిత్రాలు:ఇన్స్టాగ్రామ్ నుండి సేకరణ

English summary

The Makeup From An Artist Shows The Different Ways Women Undergo Violence

The Makeup From An Artist Shows The Different Ways Women Undergo Violence.She is just 24 years old, born and raised in Palestine. Apparently, her life struggle of growing up with witnessing conflicts as a daily experience are depicted in her , మహిళలపై జరుగుతున్న అరాచకాలపై పోరాటం : మేకప్ కూడా ఒక అస్త్రం ఆవిడ చేతుల్లో