For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శృంగార సామ‌ర్థ్యాన్ని మెరుగుపరిచే శక్తి అశ్వగంధకు ఉన్నట్లు దేనికి ఉండదేమో.. ఇంకా చాలా లాభాలు

శృంగార సామ‌ర్థ్యాన్ని మెరుగుపరిచే శక్తి అశ్వగంధకు ఉన్నట్లు దేనికి ఉండదేమో.. ఇంకా చాలా లాభాలు.. అశ్వగంధ ఉపయోగాలు, అశ్వగంధ ప్రయోజనాలు

|

ప‌ని ఒత్తిడి, ఆందోళ‌న‌, దీర్ఘకాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు, స్థూల‌కాయం, హార్మోన్ స‌మ‌స్య‌లు వంటి ఎన్నో అంశాల కార‌ణంగా నేటి త‌రుణంలో చాలా మందికి సంతానం క‌ల‌గ‌డం లేదు. దీనికి తోడు రాను రాను అలాంటి వారిలో శృంగార సామ‌ర్థ్యం కూడా త‌గ్గిపోతున్న‌ది.

అయితే ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న వారికి అశ్వ‌గంధ చూర్ణం చాలా మేలు చేస్తుంది. దీంతో త‌యారు చేసే ప‌లు మిశ్ర‌మాల‌ను రోజూ వాడితే లైంగిక ప‌టుత్వం పెర‌గ‌డ‌మే కాదు, సంతానం క‌లిగేందుకు ఎక్కువగా అవ‌కాశం ఉంటుంది. న‌రాల బ‌ల‌హీన‌త స‌మ‌స్య పోతుంది. ఆ మిశ్ర‌మాల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

అశ్వగంధ నెయ్యి

అశ్వగంధ నెయ్యి

వంద గ్రాముల అశ్వ‌గంధ పొడి (మ‌న‌కు మార్కెట్‌లో దొరుకుతుంది)ని తీసుకుని దానికి పావు కిలో నెయ్యి క‌ల‌పాలి. ఆ మిశ్ర‌మానికి గాలి త‌గ‌ల‌కుండా జాగ్ర‌త్త‌ప‌డాలి. అందుకు గాను ఏదైనా ఓ డ‌బ్బాలో దాన్ని నిల్వ చేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని రోజూ 1 టీస్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ వేడి పాలు లేదా గోరు వెచ్చ‌ని నీటిలో క‌లిపి తాగాలి. దీంతో లైంగిక ప‌టుత్వం పెరుగుతుంది. పురుషుల్లో వీర్యం చ‌క్క‌గా ఉత్ప‌త్తి అవుతుంది. స్త్రీల‌కైతే రుతుక్ర‌మం స‌రిగ్గా అవుతుంది.

అర‌గ్లాస్ వేడి పాల‌లో క‌లిపి

అర‌గ్లాస్ వేడి పాల‌లో క‌లిపి

అశ్వ‌గంధ చూర్ణాన్ని 10 గ్రాముల మోతాదులో తీసుకుని దాన్ని అర‌గ్లాస్ వేడి పాల‌లో క‌లిపి స్త్రీలు తీసుకోవాలి. ప్ర‌ధానంగా వారు రుతుక్ర‌మం అయిన 4వ రోజు నుంచి ఇలా చేయాల్సి ఉంటుంది. దీంతో వారికి పిల్ల‌లు క‌లిగేందుకు అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. అదే పురుషులు ఇలా తీసుకుంటే వారిలో లైంగిక సామ‌ర్థ్యం పెరిగి వీర్యం కూడా ఉత్ప‌త్తి అవుతుంది.

శృంగార సామ‌ర్థ్యం మెరుగ‌వుతుంది

శృంగార సామ‌ర్థ్యం మెరుగ‌వుతుంది

అశ్వ‌గంధ చూర్ణాన్ని 3 లేదా 4 గ్రాముల మోతాదులో తీసుకుని, అదే ప‌రిమాణంలో చ‌క్కెర‌ను దానికి కల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని రోజూ గ్లాస్ వేడి పాల‌లో క‌లిపి తీసుకోవాలి. దీంతో శృంగార సామ‌ర్థ్యం మునుప‌టి క‌న్నా మెరుగ‌వుతుంది. అశ్వ‌గంధ చూర్ణం, నెయ్యి, చ‌క్కెర‌ల‌ను స‌మాన భాగాల్లో తీసుకుని బాగా క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని నిత్యం సేవిస్తుంటే త‌ద్వారా పురుషుల్లో వీర్య క‌ణాల ఉత్ప‌త్తి పెరుగుతుంది. వీర్యం నాణ్యంగా కూడా ఉంటుంది. అండం ద‌గ్గ‌ర‌కు ఆ వీర్య క‌ణాలు చురుగ్గా వెళ్తాయి కూడా. దీంతో సంతానం క‌లిగేందుకు అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది.

ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

అశ్వగంధ చూర్ణం ద్వారా ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి. ఈ చూర్ణం పాలతో కలిపి తీసుకుంటే ఒత్తిడి తగ్గి చక్కటి నిద్ర పడుతుంది. అంతేకాదు. ఒత్తిడి, ఆందోళనల ప్రభావం మూలంగా తలెత్తే ఆరోగ్య ఇబ్బందులను అధిగమించే శక్తిని సమకూరుస్తుంది.

బరువు తగ్గిస్తుంది

బరువు తగ్గిస్తుంది

ఇతర బరువు తగ్గించే మందులతో కలిపి ఈ చూర్ణాన్ని వాడితే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. స్ట్రెస్‌ మూలంగా హెచ్చుతగ్గులకు గురయ్యే మెటబాలిజంను సరిచేసే శక్తి ఈ చూర్ణానికి ఉంటుంది. కాబట్టి బరువు తగ్గే వేగం పెరుగుతుంది.

మధుమేహం అదుపు

మధుమేహం అదుపు

నోటి మాత్రలకంటే ప్రభావవంతంగా ఈ చూర్ణం రక్తంలోని గ్లూకోజ్‌ లెవెల్స్‌ను తగిస్తుంది. రక్తంలోని గ్లూకోజ్‌ లెవెల్స్‌ను సమం చేసి ఇన్సులిన్‌ సెన్సిటివిటీని పెంచుతుంది.అలాగే పెద్దపేగు, రొమ్ములు, ఊపిరితిత్తుల కేన్సర్‌ల నుంచి రక్షణ కల్పిస్తుంది.

బొల్లి

బొల్లి

అశ్వగంధ చూర్ణానికి బొల్లి మచ్చలు చక్కగా స్పందిస్తాయి. కెరటోసిస్‌ అనే చర్మ చికిత్సకు అశ్వగంధ చూర్ణంతో తయారుచేసిన పేస్ట్‌ వాడతారు. అశ్వగంధ అద్భుతమైన స్కిన్‌ టోనర్‌గా కూడా పని చేస్తుంది.

కీళ్ల నొప్పులు

కీళ్ల నొప్పులు

అశ్వగంధ వేళ్లను ముక్కలుగా చేసి, వాటిని నేతిలో వేసి కాచి, ఆ నేయిని పూటకు రెండు తులాల మోతాదులో ప్రతి రోజూ మూడు పూటలా తీసుకున్నా లేదా ఆ నేతిని అన్నంలో కలిపి తింటూ ఉన్నా, కీళ్ల నొప్పులు, నడుము నొప్పి తగ్గుతాయి. నరాలు శక్తివంతమవుతాయి.

ఉదయం, సాయంత్రం సేవిస్తే

ఉదయం, సాయంత్రం సేవిస్తే

అశ్వగంధ చూర్ణాన్ని వెన్నపూసలో కలిపి, ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం సేవిస్తూ ఉంటే, జుత్తుకు సంబంధించిన పలు సమస్యలు తొలగిపోతాయి. వెంట్రుకల్లోని పెళుసుదనం పోయి, మృదువుగా మారడంతో పాటు ఒత్తుగా పెరుగుతాయి.ప్రతి ఏటా రెండు మాసాల పాటు అశ్వగంధ చూర్ణాన్ని వాడితే, చక్కని ఆరోగ్యంతో పాటు, నిండు యవ్వనం వారి సొంతమవుతుంది.

చక్కని నిద్ర

చక్కని నిద్ర

అశ్వగంధ చూర్ణానికి సమానంగా దానిమ్మ చూర్ణం పొడిని సమానంగా కలిపి, భోజనం తర్వాత ఒక స్పూను పొడి తేనెతో కలిపి నెలరోజుల పాటు తీసుకుంటే వీర్యవృద్ధి కలుగుతుంది.4 గ్రాముల అశ్వగంధ చూర్ణాన్ని తేనె, నెయ్యితో క లిపి పాలతో తీసుకుంటూ ఉంటే వృద్ధాప్యంలో కూడా శరీరం పుష్టిని పొందుతుంది. ఒక తులం అశ్వగంధ చూర్ణాన్ని నెయ్యి, చక్కెరతో కలిపి సేవిస్తూ, ఆ పైన కప్పు పాలు తాగితే చక్కని నిద్ర పడుతుంది.

బలంగా తయారవుతారు

బలంగా తయారవుతారు

అశ్వగంధ చూర్ణాన్ని పాలు, నువ్వులనూనె, నెయ్యి, గోరువెచ్చని నీరు వీటిలో ఏదో ఒక దానితో సేవిస్తూ ఉంటే బాగా బక్కచిక్కిన పిల్లలు సైతం బలంగా తయారవుతారు.రెండు స్పూన్ల చూర్ణాన్ని పాలతో తీసుకుంటే, పసిపిల్ల తల్లులకు పాలు వృద్ధి అవుతాయి. అశ్వగంధ చూర్ణం, శుద్ధి చేసిన పటిక సమపాళ్లలో తీసుకుని కలిపి, ఒక స్పూను మోతాదులో రోజుకు రెండు సార్లు రుతు సమయంలో తీసుకుంటే తెల్లబట్ల తగ్గుతుంది.

English summary

Ashwagandha Powerful Health and Beauty Benefits You Didn't Know About

Ashwagandha Powerful Health and Beauty Benefits You Didn't Know About
Story first published:Thursday, June 14, 2018, 17:50 [IST]
Desktop Bottom Promotion