మీ నాలిక రూపు రేఖలు మీ వ్యక్తిత్వం చెప్పగలవా?

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

మీ నాలిక రూపురేఖలు కూడా మీ వ్యక్తిత్వాన్ని చెప్పగలదు అన్న విషయం ఊహకు కూడా అందదు. కానీ కొన్ని అద్యయనాల ప్రకారం నాలిక రూపురేఖలు కూడా మనిషి వ్యక్తిత్వాన్ని ఖచ్చితంగా చెప్పగలవని సూచిస్తున్నాయి.

అనేక అధ్యయనాలు, నివేదికల ప్రకారం నాలిక పలు రకాలుగా ఉంటుంది, మరియు నాలిక ఉండు రూపురేఖలను ఉద్దేశించి, మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు. ఇక్కడ నాలిక ఆకారం మీదనే ఆధారపడి ఉంటుంది .

Check What Your Tongue Shape Says About Your Personality!

పొడవైన నాలిక నుండి మందపాటి నాలిక వరకు అనేక రకాల ఆకారాలతో నాలికలను మనం గమనించవచ్చు. ఒక్కసారి ఆ నాలికల రకాల గురించి తెలుసుకోవడం ద్వారా మీ వ్యక్తిత్వం గురించిన కొన్ని విషయాలను గురించి పరిశీలన చేయవచ్చు.

సన్నని నాలిక:

సన్నని నాలిక:

సన్నని నాలిక కలిగిన వారు, సహృదయులై ఉంటారు. కానీ మరోకోణంలో మాటకారిగా ఉంటారు. వీరు ఒకరిని భాధపెట్టాలన్న ఆలోచనను కలిగి ఉండరు. కాకపోతే ముక్కుసూటి తత్వాన్ని ప్రదర్శిస్తుంటారు. తద్వారా తప్పుగా అర్ధమవుతుంటారు.

చిన్న నాలిక :

చిన్న నాలిక :

చిన్న నాలికను కలిగి ఉన్నవారు సాధారణంగానే తక్కువగా మాట్లాడేవారిలా ఉంటారు. కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో కూడా సహజ శైలిని కోల్పోకుండా ప్రవర్తిస్తుంటారు. కానీ మరో కోణంలో దీనికారణంగా కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. మరియు ఇతరులను వ్యతిరేకించే లక్షణాలు వీరికి పెద్దగా ఉండవు.

పొడవైన నాలిక:

పొడవైన నాలిక:

వీరు మిగిలిన వారి కంటే కొంచం తెలివైన వారిగా ఉంటారు, వీరు సరికొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తిని కుతూహలాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. వీరు ఎక్కువగా స్నేహసంబంధాలను కలిగి ఉంటారు. ఏదైనా ప్రణాళికలు రచించడంలో, అమలు చేయడంలో వీరికి వీరే సాటి అన్నట్లుగా వీరి ప్రవర్తన ఉంటుంది. ఉత్తమమైన వ్యక్తిత్వం అని చెప్పవచ్చు.

వంకర నాలిక:

వంకర నాలిక:

ఇది కొంచం అరుదుగా ఉంటుంది, కానీ వీరు సున్నితమైన మనసు కలిగిన వారిగా ఉంటారు మరియు భావోద్వేగాలను అధికంగా కలిగి ఉంటారు. వీరు వెన్నుపోటు తత్వాన్ని ఎప్పటికీ ఇష్టపడరు. కాకపోతే వీరిని ఒక కంట కనిపెట్టుకుని ఉండాలి , లేనిచో వీరు వెన్నుపోటుకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

మందపాటి నాలిక:

మందపాటి నాలిక:

మందపాటి నాలిక కలిగిన వారు సహజంగానే కోపోద్రేకాలాను, భావోద్వేగాలను అధికంగా కలిగి ఉంటారు. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దo లో చూస్తూ పెద్ద పెద్ద గొడవలకు దారితీసేలా పద్దతిని కనపరుస్తూ ఉంటారు. వీరికి తెలీదు ఆ గొడవలు పెద్దవి అవుతాయని. పరిస్థితులు చేయి దాటితే కానీ అంచనాకు రాలేని తత్వాన్ని కలిగి ఉంటారు.

Aerodynamic-shaped నాలిక (pointed type) :

Aerodynamic-shaped నాలిక (pointed type) :

ఈ రకమైన నాలిక కలిగినవారు చాలా తెలివి కలిగిన వారిగా ఉంటారు. ఎటువంటి పరిస్థితులనుండైనా తప్పించుకోగల సామర్ధ్యం వీరి సొంతంగా ఉంటుంది. వీరు గొడవలను సృష్టించడంలో మరియు ఇతరులను వ్యతిరేకించుటలో ఎల్లప్పుడు ముందుగా ఉంటారు. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు సమస్య పరిష్కారం అన్నది పక్కన పెట్టి, ఎలా తప్పించుకోవాలి అన్న మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు.

English summary

Check What Your Tongue Shape Says About Your Personality!

Check What Your Tongue Shape Says About Your Personality, The different researchers and statisticians have observed the different types of tongues over the period of time and have indeed come to a conclusion that a person's personality can be predicted, to some extent, by the shape of their tongue.
Story first published: Friday, April 6, 2018, 8:00 [IST]