భార్య నుంచి ప్రతి భర్త అదే కోరుకుంటాడు.. దాంపత్యం గురించి ద్రౌపది సుభద్రకు చెప్పిన మాటలివే

Posted By:
Subscribe to Boldsky

ఒక్క మొగుడి దగ్గర సంసారం చేయాలంటనే ఈ కాలంలో అమ్మాయిలు అల్లాడిపోతున్నారు. మరి ఆ కాలంలో ఐదుమంది భర్తల దగ్గర కాపురం చేసి భర్తలతో పాటు మెట్టినింటిలో సమాజంలో మంచి పేరు తెచ్చుకుంది ద్రౌపది. ద్రౌపదికి ఎంతో ఓర్పు, సహనంతో పాటు భర్తను ఎలా ఆనందింపజేయాలో కూడా తెలుసు కాబట్టే అలా కాపురం చేయగలిగింది.

ఐదుగురు భర్తలతో ప్రేమగా మెలుగుతూ, భర్తల ముందు ఏం చేయకూడదో తెలుసుకుని అలా మెలిగేది కాబట్టే ద్రౌపదికి అంత మంచి పేరు వచ్చింది.

సత్యభామకు చెప్పింది

సత్యభామకు చెప్పింది

భర్త ప్రేమను పొందాలంటే భార్య ఏం చేయాలనే విషయాలను అప్పట్లోనే ద్రౌపది చెప్పింది. సత్యభామ ద్రౌపదికి చాలా విషయాలు వివరించింది. ఒకసారి కృష్ణుడు సత్యభామ పాండవులు అరణ్యవాసం చేస్తున్న ప్రదేశానికి వెళ్లారు. కృష్ణుడు పాండువులను కలవగానే వాళ్ల మంచిచెడులను తెలుసుకున్నారు.

ద్రౌపది, సత్యభామ కలిసి వంట

ద్రౌపది, సత్యభామ కలిసి వంట

సత్యభామ ఆశ్రమం లోపలికి వెళ్లి వంట చేస్తున్న ద్రౌపదితో మాటలు కలిపింది. ఆమె వంట చేస్తుంటే సత్యభామ కాస్త సాయం కూడా చేసింది. ద్రౌపది, సత్యభామ కలిసి ఆ రోజు వంట చేశారు. వంట అయిపోయిన తర్వాత అందరు భోజనం చేశారు.

మాట్లాడుకోవడం మొదలు పెట్టారు

మాట్లాడుకోవడం మొదలు పెట్టారు

తర్వాత పాండవులతో కృష్ణుడు మాటల్లో నిమగ్నమయ్యాడు. సత్యభామ ద్రౌపదితో చాలా విషయాలు అడగాలని మనస్సులో అనుకుంది. సత్యభామ ద్రౌపది ఆశ్రమంలోని ఒక చెట్టు కింద కూర్చొని మాట్లాడుకోవడం మొదలు పెట్టారు.

ప్రతి ప్రశ్నకు సమాధానం

ప్రతి ప్రశ్నకు సమాధానం

సత్యభామ ద్రౌపదితో చాలా విషయాలపై చర్చ పెట్టింది. సత్యభామ ద్రౌపది దాంపత్య జీవితం గురించి తెలుసుకోవాలని అనేక ప్రశ్నలు అడిగింది. ద్రౌపది ఆమె అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతుంది.

మందు పెట్టావా ద్రౌపది

మందు పెట్టావా ద్రౌపది

అవును ద్రౌపది.. నీకు పాండవులతో వివాహం అయి ఇన్ని ఏళ్లు అవుతున్నా నీ భర్తలతో నీకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. వాళ్లు నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు. నిన్ను అస్సలు కోప్పడరు. నువ్వు చెప్పినట్లు వింటారు. అంత ప్రేమను నీపై చూపడానికి ఏం మందు పెట్టావేంటి నీ భర్తలకు అని అడుగుతుంది సత్యభామ.

కింగ్ లాంటి మగాడినైనా కొంగున చుట్టేసుకోవొచ్చు

కింగ్ లాంటి మగాడినైనా కొంగున చుట్టేసుకోవొచ్చు

మందు లేదు.. మంత్రం లేదు. కొన్ని సూచనలు పాటిస్తే కింగ్ లాంటి మగాడినైనా కొంగున చుట్టేసుకోవొచ్చు అంది ద్రౌపది. సరే అయితే ఆ సూచనలు ఏమిటో నాకూ చెప్పు మీ అన్నపై వాటిని ప్రయోగిస్తాను అని అంటుంది సుభద్ర.

మీ అన్న ఎవ్వరికి వశం కాడు

మీ అన్న ఎవ్వరికి వశం కాడు

అయినా మీ అన్నగారు సామాన్యుడు కాదు ఆయన ఎవ్వరికి వశం కాడు. నువ్వు పాటించే సూచనలు చెబితే నేను పాటిస్తా అని సత్యభామ అంటుంది. దాంతో ద్రౌపది భర్తల విషయంలో పాటించాల్సిన సూత్రాలు చెబుతుంది.

కోపాన్ని తగ్గించుకోవాలి

కోపాన్ని తగ్గించుకోవాలి

భర్తను తన వశం చేసుకోవాలనుకుంటే భార్య మొదట తన కోపాన్ని తగ్గించుకోవాలి. భర్తను ఆధీనంలో పెట్టుకోవాలని అనుకోకూడదు. భర్తను హృదయ పూర్వకంగా ఆరాధించాలి.

ప్రతి కోరికను తీర్చాలి

ప్రతి కోరికను తీర్చాలి

అతనికి ఏం కావాలో ముందే తెలుసుకుని దాన్ని అతన్ని అడగకముందే అతనికి ఇవ్వాలి. అది ఏదైనా సరే. అతని ప్రతి కోరికను అతను అడగక ముందే భార్య తీర్చాలి. అది ముద్దు అయినా శృంగారం అయినా ఇంకేదైనా సరే. అతనికి నచ్చిన విషయాల్లో అతన్ని సంతృప్తి పరచాలి.

భర్త భోజనం చేశాకే చేయాలి

భర్త భోజనం చేశాకే చేయాలి

భర్త భోజనం చేసిన తర్వాతే భార్య భోజనం చేయాలి. భోజనం చేస్తున్నప్పుడు అన్నం తింటూ నోరు తెరిచి పెద్దగా మాట్లాడకూడదు. అనాన్ని నమిలే అమ్మాయి చాలా అసహ్యంగా ఉంటుంది. అందుకే అన్నం నమిలేటప్పుడు భర్తతో మాట్లాడకూడదు.

కాలకృత్యాలు తీర్చుకోకుండా భర్త దగ్గరకు వెళ్లొద్దు

కాలకృత్యాలు తీర్చుకోకుండా భర్త దగ్గరకు వెళ్లొద్దు

ఉదయం పూట కాలకృత్యాలు తీర్చుకోకుండా భర్తతో మాట్లాడకూడదు. భర్తతో కలిసి ఏ పని చేయకూడదు. మొహం కడగకుండా భర్తతో మాట్లాడితే నోటి నుంచి దుర్వాసన వస్తుంది. అది భర్తకు ఇష్టం ఉండదు. అందువల్ల ఉదయం లేచిన వెంటనే కాలకృత్యాలు పూర్తి చేసుకుని భర్త దగ్గరకు వెళ్లాలి.

వ్యక్తిగత విషయాలు ఎవ్వరి వద్ద చెప్పకూడదు

వ్యక్తిగత విషయాలు ఎవ్వరి వద్ద చెప్పకూడదు

భర్తకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు ఎవ్వరి వద్ద కూడా భార్య చెప్పకూడదు. దాంపత్య రహస్యాలను కూడా వెల్లడించకూడదు. కొందరు భార్యలు భర్తలు తమకు లొంగాలని కోరుకుంటారు. అలా గర్వంగా భర్తను లొంగదీసుకోవాలంటే ఏ భర్త లొంగడు.

కమ్మని వంట చేయాలి

కమ్మని వంట చేయాలి

ఒక తల్లి కొడుకుకి ఎలా సేవ చేస్తుందో అలాగే భర్తకు కూడా చేయాలి. భర్త ప్రేమను సంపూర్ణంగా పొందాలంటే అతనికి ఇష్టమైన ఆహారం వండి పెట్టాలి. భర్తకు కమ్మని వంట చేసి పెడితే అతను భార్యపై చాలా ప్రేమ పెంచుకుంటాడు.

నోటికొచ్చినట్లు మాట్లాడకూడదు

నోటికొచ్చినట్లు మాట్లాడకూడదు

భర్తను ఎప్పుడు నోటికొచ్చినట్లు మాట్లాడకూడదు. ఇతరులు ముందైనా, ఇంట్లోనైనా పెద్దగా పగలబడి నవ్వకూడదు. అవి భర్తలకూ అస్సలు నచ్చవు.

అతడే తెలివిగలవాడు

అతడే తెలివిగలవాడు

భర్త తెలివితక్కువవాడయినప్పటికీ అతడే తెలివిగలవాడన్నట్లు ప్రవర్తించాలి. అలాకాకుండా నాకు తెలివి ఎక్కువ ఉంటుందని భార్య విర్రవీగితే తాట తీస్తాడు. అందుకే అతడి తెలివితక్కువతనాన్ని ఎప్పుడు కూడా బయటపెట్టకూడదు. ఇలాంటివన్నీ ఆచరిస్తే భార్యపై భర్త ప్రేమ పెరుగుతుంది. భార్య చెప్పినట్లు భర్త వింటాడని సుభద్ర ద్రౌపదికి వివరించింది.

All Images Source :https://www.speakingtree.in/

English summary

this is what draupadi told satyabhama about her martial arrangements with pandavas

this is what draupadi told satyabhama about her martial arrangements with pandavas
Subscribe Newsletter