For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ గోర్ల ఆకారం మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందని మీకు తెలుసా ?

By R Vishnu Vardhan Reddy
|

ఎన్నో భౌతిక లక్షణాలు వ్యక్తి వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి. ముక్కు ఆకారం, వేళ్ళ ఆకారం దగ్గర నుండి గోర్ల ఆకారం వరకు ఇలా ఎన్నో మనిషి వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి.

భౌతిక లక్షణాలను క్షుణ్ణంగా పరిశీలించడం వల్ల వ్యక్తి వ్యక్తిత్వం గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. గోర్ల ఆకారం ఆధారంగా వ్యక్తి వ్యక్తిత్వాన్ని ఎలా తెలుసుకోవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు మనం సవివరంగా తెలుసుకోబోతున్నాం.

పొడవైన, దీర్ఘ చతురస్రాకారం దగ్గర నుండి ముక్కోణపు ఆకారం వరకు లేదా బాదం ఆకారంలో ఉన్న గోర్లు ఇలా వివిధరకాల ఆకారాలు కలిగిన గోర్లను బట్టి వ్యక్తి వ్యక్తిత్వాన్ని విశ్లేషించడం జరుగుతుంది.

మరిన్ని విషయాలు ఏమిటంటే :

పొడవైన, వెడల్పైన, దీర్ఘ చతురస్రాకార గోర్లు :

పొడవైన, వెడల్పైన, దీర్ఘ చతురస్రాకార గోర్లు :

ఏ వ్యక్తులకు అయితే, పొడవైన, వెడల్పైన, దీర్ఘ చతురస్రాకార గోర్లు ఉంటాయో అటువంటి వారు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఈ వ్యక్తులు చేసే ప్రతి పనిలోనూ ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తారు. సమతుల్యమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. శాంతంగా ఉంటారు, స్వతంత్రంగా వ్యవహరిస్తారు. కార్య సాధకులై ఉంటారు. అంతేకాకుండా ప్రతి విషయంలోనూ ఎంతో విశాల దృక్పధంతో ఆలోచనలు చేస్తారు.

పొడవైన, సన్నని గోర్లు :

పొడవైన, సన్నని గోర్లు :

ఏ వ్యక్తులకైతే, పొడవైన సన్నని గోర్లు ఉంటాయో అటువంటి వారు విశేష భోగాలను ఎక్కువగా ప్రేమిస్తారు. వారు కోరుకున్న దృష్టి వారి పై కేంద్రీకృతం కాకపోతే అటువంటప్పుడు తీవ్ర మనస్థాపానికి గురవుతారు. ఈ వ్యక్తులు ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తారు, అహంభావ స్వభావాన్ని కలిగి ఉంటారు.

చిన్నని చతురస్రం గోర్లు :

చిన్నని చతురస్రం గోర్లు :

ఏ వ్యక్తులకు అయితే చిన్నని చతురస్ర ఆకారంలో గోర్లు ఉంటాయో అటువంటి వారు మంచి వనరులుగా ఉపయోగపడతారు. పరిస్థితులకు తగినట్లు వ్యవహరిస్తారు. తీక్షణంగా ఆలోచించడంతో పాటు సమయస్ఫూర్తితో ప్రవర్తించగలరు. మరో వైపు ఈ వ్యక్తులు చాలా దూకుడుగా ఉంటారు. విపరీతమైన ఈర్ష్య అసూయను కలిగి ఉంటారు. డబ్బుకోసం అత్యాశకు లోనవుతారు.

చిన్న గోర్లు :

చిన్న గోర్లు :

ఏ వ్యక్తుల కు అయితే చిన్న గోర్లు ఉంటాయో, అటువంటి వారు అర్హమైన పరిపూర్ణవాదులుగా ఉంటారు. తమకు నచ్చినట్లు పనులు చేయించుకోవడం కోసం విపరీతంగా పోరాడవలసి వస్థుంది. ఈ వ్యక్తులు అసహనానికి లోనవుతారు. చాలా త్వరగా కోపం ప్రదర్శిస్తారు. మరో వైపు సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ఉన్నతంగా ఉంటారు. ఇవే కాకుండా ఈ వ్యక్తులు స్వభావ రీత్యా మిగతావారితో పోల్చి చూసినప్పుడు అధికారాన్ని లేదా కోరుకున్న విషయం పై ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని చూస్తారు.

బాదం ఆకారంలో ఉండే గోర్లు :

బాదం ఆకారంలో ఉండే గోర్లు :

వ్యక్తులకు ఎవరికైతే బాదం ఆకారంలో విభిన్నంగా గోర్లు ఉంటాయో, అటువంటి వారు సున్నిత స్వభావం కలిగి భావోద్వేగపరంగా వ్యవహరిస్తారు. చాలా సులభంగా మనస్థాపానికి లోనవుతారు. మరో వైపు ఎంతో గొప్ప సహాయకులుగా వీరిని చాలామంది అభివర్ణిస్తారు. అంతేకాకుండా వీరు ఎంతో దయాగుణం కలిగి ప్రేమగా వ్యవహరిస్తూ చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వారై ఉంటారు. వీరికి ఆదర్శవాద దృక్పధం ఎక్కువగా ఉంటుంది.

ముక్కోణపు గోర్లు :

ముక్కోణపు గోర్లు :

ఎవరికైతే ముక్కోణపు గోర్లు ఉంటాయో, అటువంటివారు ఏ విషయంలో అయినా ఓడిపోవడాన్ని విపరీతంగా ద్వేషిస్తారు . అందరూ తమని గుర్తించాలని, తాము చాలా ప్రసిద్ధి చెందాలని భావిస్తారు. వీరికి కళాత్మక ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా తరచూ వీరి ఆలోచనలు మారిపోతుంటాయి. వీటన్నింటి వల్ల వీరి వ్యక్తిత్వం కూడా మారుతూ ఉంటుంది. ఈ వ్యక్తులది చాలా సున్నితమైన మనస్తత్వం, అందుచేత వీరిని ఇతరులు ఎప్పడూ చూస్తూ ఉంటారు.


English summary

How Does The Shape Of Your Nail Define Your Personality

How Does The Shape Of Your Nail Define Your Personality,Quickly check your nail shape and find out about what type of a personality you have! We bet, this is something that you are not aware of!
Desktop Bottom Promotion