For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

HBDAY Kohli : ట్రెండింగులో విరాట్ బర్త్ డే... ఎమోషనల్ విషెస్ చెప్పిన ఆర్సీబీ...

విరాట్ కోహ్లీ బర్త్ డే సందర్భంగా ట్విట్టర్లో వినూత్న రీతిలో అభినందనలు ఎలా ఉన్నాయో చూద్దాం రండి.

|

ప్రస్తుతం ఇంటర్నేషనల్ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో నెంబర్ వన్ క్రికెటర్ ఎవరంటే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు విరాట్ కోహ్లీ. ఈ టీమిండియా రన్ మెషిన్ నవంబర్ 5వ తేదీన 32వ వసంతంలోకి అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో విరాట్ అభిమానులు రెచ్చిపోతున్నారు.

Happy Birthday Virat trends on Twitter as fans wish the Indian skipper on his 32nd birthday

ఇప్పటికే #Happybirthdayvirat హ్యాష్ ట్యాగ్ ట్రెండింగులో ఉండేలా చేశారు. ఈ ప్రత్యేకమైన రోజున తమ అభిమాన క్రికెటర్ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడంలో తమకు తామే సాటి... తమకు ఎవరూ లేరు పోటీ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. దీంతో నిన్న రాత్రి నుండే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో విరాట్ హ్యాష్ ట్యాగ్ బర్త్ డే ట్రెండింగులో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులందరూ విరాట్ కోహ్లీకి శుభాకాంక్షలను తమదైన శైలిలో తెలుపుతున్నారు.

Happy Birthday Virat trends on Twitter as fans wish the Indian skipper on his 32nd birthday

దుబాయ్ లో మరి కొద్దిగంటల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో ప్లే ఆఫ్ మ్యాచ్ లో గెలిచేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్న విరాట్ కోహ్లీ ఈ పుట్టినరోజును తన భార్య అనుష్కశర్మతో కలిసి జరుపుకోనున్నాడు. విరుష్కా అభిమానులందరికీ మరో శుభవార్త ఏమిటంటే, ఈ జంట త్వరలోనే పేరేంట్ హుడ్ స్వీకరించబోతున్నారు. ఈ విషయాన్నే ఇటీవలే వారు సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా దుబాయ్ లో ఉన్న విరాట్ కోహ్లకీ ఆర్సీబీ టీమ్ ఎమోషనల్ బర్త్ డే విషెస్ చెప్పింది. రెడ్ అండ్ గోల్డ్ కు రక్తాన్ని, స్వేదాన్ని, కన్నీళ్లను ఇచ్చిన వ్యక్తికి అంటూ ఆర్సీబీ టీమ్ ట్వీట్ చేసింది. టు అవర్ లీడర్ అండ్ లెజెండ్ అని కొనియాడుతూ బర్త్ డే విషెస్ తెలిపింది.

ఇప్పటికీ నెంబర్ వన్..

ఇప్పటికీ నెంబర్ వన్..

అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటికీ భారతదేశం తరపున టెస్టులు, వన్డేల్లో నెంబర్ వన్ వన్ గా కొనసాగుతున్న ఏకైక క్రికెటర్ గా రికార్డు నెలకొల్పాడు. మరో విశేషమేమింటే.. విరాట్ కు మన దాయాది దేశమైనా పాకిస్థాన్ లో కూడా వీరాభిమానులున్నారు.

సునామీ వేగంతో..

సునామీ వేగంతో..

విరాట్ కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ తో పాటు ఇతర సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ సునామీ వేగంలా గంటగంటకూ పెరిగిపోయింది. కొందరు కోహ్లీ ఇప్పటివరకు సాధించిన రికార్డులను ట్వీట్ చేస్తే.. మరికొందరు #RRR వీడియోల రూపంలో విషెస్ తెలిపారు.

చిన్ననాటి ఫొటోలను..

చిన్ననాటి ఫొటోలను..

ఇంకా కొంతమంది అభిమానులు కోహ్లీ చిన్ననాటి ఫొటోలను షేర్ చేశారు. అంతర్జాతీయ క్రికెట్లో తను అడుగు పెట్టిన నాటి నుండి అండర్-19 కెప్టెన్ వరకు.. ఆర్సీబీ కెప్టెన్ గా ఉన్నప్పటి నుండి టీమిండియా కెప్టెన్ వరకు ఎదిగిన ఫోటీలను చేశారు.

క్షణక్షణం పెరుగుతూ..

క్షణక్షణం పెరుగుతూ..

ట్విట్టర్లో గతేడాది విరాట్ విషెస్ కు విశేష స్పందన ఎలా వచ్చిందో.. ఈ ఏడాది అంతకంటే ఎక్కువగా ట్వీట్లు వస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో విరాట్ బర్త్ డే ట్రెండ్ గా మారిపోయింది.

టాలీవుడ్ స్టార్ల విషెస్..

టాలీవుడ్ స్టార్ల విషెస్..

విరాట్ కోహ్లీకి కేవలం క్రికెట్లోనే కాదు.. సినిమా తారల్లోనూ అభిమానులు ఉన్నారు. అది కూడా మన టాలీవుడ్ లో ఉండటం విశేషం. విరాట్ బర్త్ డే సందర్భంగా ప్రిన్స్ మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్ ట్వీట్లు చేశారు. ‘టీమిండియా గర్వపడేలా మరిన్ని రికార్డులు నెలకొల్పాలని కోరుకుంటున్నా.. రాక్ ఆన్' అంటూ మహేష్ ట్వీట్ చేశాడు.

ప్రతి రికార్డులోనూ విరాట్..

ప్రతి రికార్డులోనూ విరాట్..

ప్రస్తుత ప్రపంచ క్రికెట్లోని టెస్టు, వన్డే, టి20 ఫార్మాట్లలో ఏ మ్యాచ్ అయినా విరాట్ పేరిట ఓ రికార్డు కచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి మ్యాచ్ లోనూ అంత అద్భుతంగా ఆడతాడు కాబట్టి.

సచిన్ తర్వాత..

సచిన్ తర్వాత..

ప్రపంచ క్రికెట్లో సచిన్ టెండూల్కర్ తర్వాత అత్యధిక సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా విరాట్ కొహ్లీ చరిత్ర స్రుష్టించాడు. ఇప్పటికీ అన్ని ఫార్మాట్లలో తన సగటు బ్యాటింగ్ 50కి పైగానే ఉండటం అంటే మాములు విషయం కాదు. అన్నిఫార్మాట్లలో కలిపి 20 వేలకు పైగా పరుగులు చేసిన ఏకైక క్రికెటర్ కూడా కోహ్లీనే కావడం విశేసం.

ఒక సంవత్సరంలో..

ఒక సంవత్సరంలో..

విరాట్ కోహ్లీ ఒక క్యాలెండర్ సంవత్సరంలో‘2017-2018)వన్డే మ్యాచుల్లో ఆరు సెంచరీలు చేసిన ఏకైక కెప్టెన్ గా రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ లోనూ ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.

సంపాదనలోనూ..

సంపాదనలోనూ..

విరాట్ కోహ్లీ కేవలం క్రికెట్లోనే కాదు.. డబ్బు సంపాదనలో కూడా అంతే ముందున్నాడు. తన ఆటతీరుతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న ఈ రన్ మెషిన్ చాలా ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్నాడు.

భారీగా ఫాలోయింగ్..

భారీగా ఫాలోయింగ్..

విరాట్ కోహ్లీకి కేవలం క్రికెట్లోనే కాదు.. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ తో పాటు ఇతర సోషల్ మీడియా సైట్లలో భారీగా ఫాలోయింగ్ ఉంది. ఐపిఎల్ లో అందరికంటే ఎక్కువగా సుమారు 17 కోట్ల రూపాయల వేతనం ఆర్జిస్తున్నాడు. ఈ ఏడాది ప్లేఆఫ్ కు చేరిన ఆర్సీబీ.. తొలిసారి ఐపిఎల్ టైటిల్ కొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు.

All Images Credited : Twitter

English summary

Happy Birthday Virat trends on Twitter as fans wish the Indian skipper on his 32nd birthday

Here we talking about Happy Birthday Virat trends on Twitter as fans wish the Indian skipper on his 32nd birthday. Read on
Desktop Bottom Promotion