For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Lunar Eclipse 2021:చంద్ర గ్రహణం వేళ రాశిచక్రాలపై ఎలాంటి ప్రభావమంటే...

|

Chandra Grahan 2021 Effects on Zodiac Signs in Telugu : నవంబరు మాసంలో ప్రపంచం మొత్తం చంద్రగ్రహణాన్ని చూడనుంది. నవంబర్ 19న రెండోది మరియు చివరి చంద్రగ్రహణం ఏర్పడనుంది. హిందూ పంచాంగం ప్రకారం, మీన రాశిలో కార్తీక మాసంలో పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడుతుంది.

ఈ ఏడాదికి ఇదే చివరి సంపూర్ణ చంద్రగ్రహణం. అయితే భారతదేశంలో ఇది పాక్షిక చంద్రగ్రహణం. ఇదిలా ఉండగా.. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, చంద్ర గ్రహణం సమయంలో రాశిచక్రాలపై కచ్చితంగా ఏదో ఒక ప్రభావం పడుతుంది.

సాధారణంగా చంద్ర గ్రహణాన్ని చాలా ప్రతికూలంగా భావిస్తారు. హిందూ ఆచారాల ప్రకారం చంద్ర గ్రహణం సమయంలో ఆలయాలను మూసివేస్తారు. తమ ఇళ్లలోనూ ఎలాంటి శుభకార్యాలను చేయరు. ఈ సందర్భంగా కార్తీక పౌర్ణమి రోజున ఏర్పడే చంద్ర గ్రహణం వల్ల ఏ రాశి వారికి సానుకూల ఫలితాలు రానున్నాయి.. ఏ రాశి వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Guru Rashi Parivartan 2021:గురుడు కుంభంలోకి ఆగమనం.. రాశిచక్రాలపై ఎలాంటి ప్రభావమంటే...!

మేషరాశి

మేషరాశి

నవంబరు నెలలో చివరి చంద్ర గ్రహణం కారణంగా ఈ రాశి వారికి ఆదాయ పరంగా అనేక మార్పులు వస్తాయి. ఈ సమయంలో మీరు తెలివైన నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగులకు ఈ కాలంలో మంచి అవకాశాలు రానున్నాయి. కాబట్టి వీటిని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే దీని వల్ల మీ కెరీర్ ముందుకు సాగుతుంది.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి వారు చంద్ర గ్రహణం సమయంలో ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటట్లయితే.. చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే అనవసరమైన విషయాలపై ఖర్చు చేయవచ్చు. కాబట్టి మీ ఖర్చులను ట్రాక్ చేయండి. ఆరోగ్య పరంగా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అయితే కొందరు వ్యక్తులు కడుపు సంబంధిత సమస్యలతో బాధపడొచ్చు.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి వారు చంద్ర గ్రహణ సమయంలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఎక్కువగా గడుపుతారు. ఇలా చేయడం వల్ల వీరు మనశ్శాంతి పొందుతారు. పని విషయానికొస్తే, ఈ కాలంలో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా మంచి జరుగుతుంది. అయితే అనారోగ్యకరమైన ఆహారపదార్థాలు తినకపోవడమే మంచిది.

12 రాశుల వారు బ్రేకప్ బాధ నుండి ఎలా బయటపడతారంటే...!

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి వారికి చంద్ర గ్రహణం కారణంగా సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈ సమయంలో మీరు మీ స్నేహితులతో నాణ్యమైన సమయాన్ని గడపాలని కోరుకుంటే, దానికి ఇదే సరైన రోజు. అంతేకాదు మీరు మీ స్నేహితులకు దూరంగా ఉంటే, సంబంధాలను పునరుద్దరించటానికి ఇది గొప్ప రోజు అవ్వొచ్చు.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి వారికి చంద్ర గ్రహణం రోజు చాలా అద్భుతమైన ఫలితాలు రావొచ్చు. అయితే నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పని విషయానికొస్తే, ఈరోజు సంతోషకరమైన రోజు అవుతుంది. మరోవైపు ఆర్థిక పరమైన విషయాలపై దృష్టి పెట్టండి. ఆరోగ్య పరంగా, మీరు సంతోషంగా మరియు తక్కువ ఒత్తిడితో ఉంటారు.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి వారు చంద్రగ్రహణం సమయంలో మంచి ఫలితాలను పొందుతారు. కాబట్టి మీరు ఏదైనా చేయాలని ప్లాన్ చేసుకుంటే, దీన్ని చేయడానికి ఇదే ఉత్తమ సమయం. మీరు ఈ కాలంలో చేసే ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి.

ఈ రాశుల వారు జీవితంలో కొంచెం ఆలస్యమైనా గొప్ప విజయాలను సాధిస్తారు..

తులా రాశి

తులా రాశి

ఈ రాశి వారికి ఈ చంద్రగ్రహణం మంచి ప్రభావం చూపుతుంది. పని పరంగా, మీరు మీ కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. మీరు మీ వ్యాపారాన్ని వేగంగా వృద్ధి చేసుకునేలా పరపతి పొందుతారు. అయితే, మీ ప్రసంగాన్ని నియంత్రించడం మంచిది. లేకపోతే, మీరు మీ పనిలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి

2021లో చివరి చంద్ర గ్రహణం సమయంలో, ఈ రాశి వారు మంచి అనుభూతిని అనుభవిస్తారు. ముఖ్యంగా ఆరోగ్య పరంగా మంచి ఉపశమనం లభిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ధనుస్సు రాశి..

ధనుస్సు రాశి..

ఈ రాశి వారు చంద్ర గ్రహణం సమయంలో చురుగ్గా ఉండాలి. ముఖ్యంగా బద్ధకాన్ని వీడాలి. మీరు మీ గురించి జాగ్రత్తగా చూసుకుంటారు. మీరు ఒత్తిడిని బాగా అధిగమిస్తారు. పని విషయానికొస్తే, ఈరోజు మంచిగా ఉంటుంది.

మకర రాశి

మకర రాశి

ఈ రాశి వారికి చంద్ర గ్రహణం సృజనాత్మకంగా మరియు చురుకుగా మారుతుంది. కాబట్టి మీ ప్రేమ పోయిందని మీరు భావిస్తే, కోల్పోయిన ప్రేమను మళ్లీ పుంజుకోవడానికి ఇదే సరైన సమయం. పని విషయానికొస్తే, విషయాలు మధురంగా ​​ఉంటాయి. కానీ మీరు మీ ప్రసంగాన్ని నియంత్రించుకోవాలి.

కుంభ రాశి

కుంభ రాశి

ఈ రాశి వారికి చంద్రగ్రహణం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీకు ప్రత్యేకమైన రోజు అవుతుంది. ఆర్థిక పరమైన పనులు సజావుగా సాగుతాయి. పనిలో, మీరు కొన్ని కొత్త బాధ్యతలను అందుకుంటారు. మీ పనితీరుకు ప్రశంసలు అందుకుంటారు. అయితే, మీరు పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తే, మీ నిర్ణయాన్ని ఖరారు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి.

మీన రాశి

మీన రాశి

ఈ రాశి వారు చంద్ర గ్రహణం కారణంగా పనిలో మంచి ఫలితాలను పొందుతారు. మీరు మీ కృషికి మరియు అద్భుతమైన పనికి ప్రతిఫలం పొందుతారు. ప్రమోషన్ కూడా రావొచ్చు. అయితే, మీరు ఆరోగ్యం సరిగా లేకుంటే, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. మరోవైపు ఆర్థికంగా అప్పులు తీరుతాయి.

2021లో నవంబరు నెలలో ఎన్నో చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడనుంది?

2021 సంవవత్సరంలో నవంబరు నెలలో రెండోది, చివరి చంద్ర గ్రహణం ఏర్పడనుంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(NASA)ఈ శతాబ్దంలోనే అత్యంత ఎక్కువకాలం నిలిచే చంద్రగ్రహణం ఏర్పడనున్నట్లు ప్రకటించింది. నాసా అంచనాల ప్రకారం.. 18, 19వ తేదీల్లో ఈ అద్భుతం ఆకాశంలో కనిపిస్తుంది. ఈ రెండు రోజుల్లో దాదాపు మూడు గంటల 28 నిమిషాల పాటు పాక్షిక చంద్ర గ్రహణం ఏర్పడనుంది.

English summary

Lunar Eclipse 2021: Know Chandra Grahan Effects on 12 Zodiac Signs in Telugu

Lunar Eclipse 2021 Effects on Zodiac Signs in Telugu: This years longest lunar eclipse will take place on Kartik Poornima. know Chandra Grahan Effects on 12 Zodiac Signs in Telugu
Desktop Bottom Promotion