For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్ట్రాబెర్రీ మూన్ దర్శనం వల్ల ఈ రాశిచక్రాలపై తీవ్ర ప్రభావం...!

|

మనలో చాలా మంది చంద్రుని అనేక రూపాల గురించి వినే వింటారు. రకరకాల చంద్రుడిని కూడా చూసి ఉంటారు. అయితే మీరు స్ట్రాబెర్రీ మూన్ గురించి విన్నారా? చంద్రుడికి, స్ట్రాబెర్రీకి లింకేంటి అనుకుంటున్నారా? ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా వసంతకాలంలో వచ్చే చివరి పౌర్ణమిని మరియు వేసవిలో వచ్చే మొదటి పౌర్ణమిని స్ట్రాబెర్రీ అంటారు. దీన్నే సూపర్ మూన్ అని కూడా అంటారు. 2022 సంవత్సరంలో జూన్ మాసంలో 14వ తేదీన ఈ చంద్రుని రూపం మనకు ఆకాశంలో కనిపించనుంది. ఇదిలా ఉండగా జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆకాశంలో స్ట్రాబెర్రీ మూన్ దర్శనం ధనస్సు రాశిలో జరగడం వల్ల ద్వాదశ రాశులపై ప్రభావం పడనుంది. ముఖ్యంగా మూడు రాశుల వారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇంతకీ ఆ రాశులేవీ.. ఆ రాశుల జాబితాలో మీ రాశి ఉందా? వారికి శుభ ఫలితాలు రానున్నాయా? అదే అశుభ ఫలితాలు రానున్నాయా అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

వృషభ రాశి..

వృషభ రాశి..

జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి రోజున చంద్రుడు పరిపూర్ణంగా, ప్రకాశవంతంగా కనిపించడంతో ఈ రాశుల వారికి అశుభ ఫలితాలు రానున్నాయి. ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాల్లో సంక్షోభం ఎదురుకావొచ్చు. చిన్నపాటి ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ కాలంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరులపై ఏ విషయంలోనూ ఆధారపడకూడదు. ఆర్థిక పరమైన మార్పుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో క్లిష్ట పరిస్థితులు ఎదురుకానుందన, మీరు వాటిని నివారించడానికి కొంచెం ఎక్కువ సమయం శ్రద్ధ వహించాలి.

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి వారు ఈ కాలంలో ఆరోగ్యం మరియు ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఈ కాలంలో మీకు ఆరోగ్య పరంగా అనేక సవాళ్లు ఎదురవ్వొచ్చు. ధనస్సు రాశిలో చంద్రుని ప్రభావాన్ని తేలికగా తీసుకోకూడదు. ఈ కాలంలో ఎవ్వరిపైనా కోపం చూపొద్దు. మితిమీరిన కోపం మీకు ప్రమాదాలను తెచ్చి పెడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా ఆలోచించండి. లేదంటే రకరకాల సంక్షోభాలు వచ్చే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి వారు అభద్రత లేదా ఆందోళన చెందే సమయం ఇది. ఈ కాలంలో మీకు కొన్ని చిన్న చిన్న సంక్షోభాలుంటాయి. అయితే మీరు జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటే వాటిని అధిగమించొచ్చు. మరోవైపు ఈ కాలంలో మీరు దుఃఖాన్ని అదుపు చేసుకోలేదు. అలాగే ఆరోగ్యంపైనా ఎక్కువ శ్రద్ధ వహించాలి. లేదంటే మీరు ఆసుపత్రికి చేరాల్సి వస్తుంది. విద్యార్థులు విద్యను నిర్లక్ష్యం చేయకూడదు.

ఎప్పుడు కనిపిస్తాడంటే..

ఎప్పుడు కనిపిస్తాడంటే..

2022 సంవత్సరంలో జూన్ 14వ తేదీన అంటే మంగళవారం నాడు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత, ఆగ్నేయ దిశలో నెమ్మదిగా హోరిజోన్ పైకి లేచి, చాలా పెద్దదిగా మరియు బంగారం రంగులో కనిపిస్తుంది. అలాంటి పరిస్థితిలో, పౌర్ణమి రోజున చంద్రుడు మరింత పెద్దదిగా మరియు ప్రకాశవంతంగా కనిపిస్తాడు. సాయంత్రం 7:52 గంటల సమయం దాటాక గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారి కోరికలు నెరవేర్చుకునేందుకు గొప్ప సమయం.

భూమికి దగ్గరగా..

జూన్ 14వ తేదీన స్ట్రాబెర్రీ మూన్ భూమికి చాలా దగ్గరగా వస్తాడు. సాధారణ రోజుల్లో కనిపించే దాని కంటే చాలా పెద్దదిగా కనిపిస్తాడు. ఖగోళశాస్త్రం ప్రకారం, ఈ సమయంలో శుక్రుడు, అంగారక గ్రహాలు కూడా కనిపిస్తాయి. సూపర్ మూన్ లేదా స్ట్రాబెర్రీ మూన్ 1930 సంవత్సరం నుండి నిర్ణయించినట్లు చెబుతారు. ఈ సమయంలో సూపర్ మూన్ అనే పేరును మొదట ఫార్మర్ అల్మానెక్ నిర్ణయించారు. ఆ సమయంలో ఏప్రిల్ లో కనిపించే సూపర్ మూన్ కి పింక్ మూన్ అని పెట్టారు. ఆ సమయంలో అమెరికాలో కనిపించే ఒక మొక్క పేరును బట్టి సూపర్ మూన్ పేరును నిర్ణయించారు.

English summary

The June 2022 Full Strawberry Moon Will Affect These Zodiac Signs in Telugu

Here we are talking about the What is Strawberry Moon? Know How & Where to Watch on June 14th in Telugu. Have a look
Story first published: Tuesday, June 14, 2022, 8:21 [IST]
Desktop Bottom Promotion