For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Today Rasi Phalalu: ఈరోజు ఆ రాశి వారిపై కనక వర్షమే

|

Today Rasi Phalalu: తమ జీవితంలో ఏం జరుగుతుంది.. ఏం జరగబోతోంది అని తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. తమ అదృష్టం, దురదృష్టం గురించి చాలా మంది తెలుసుకోవాలని అనుకుంటారు. రాశులను బట్టి, జన్మ నక్షత్రాలను బట్టి తమ జీవితంలో ఎలాంటి సంఘటనలు జరుగుతాయి.. వాటి ఫలితం జీవితంపై ఎలా ఉంటుంది.. మంచి, చెడు ఎలా వస్తాయనేది తెలుసుకోవాలని అనుకోవడంలో తప్పులేదు. ప్రతి మనిషిలోనూ కుతూహలం ఉంటుంది. ఈరోజు రెండో శ్రావణ శుక్రవారం. ఏ రాశుల వారికి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

05 ఆగస్టు 2022 శుక్రవారం రోజున చంద్రుడు తులరాశిలో సంచరించనున్నాడు. ఈ సమయంలో గ్రహణ యోగం ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఇవాళ స్వాతి నక్షత్ర ప్రభావం కూడా ద్వాదశ రాశులపై ఉండనుంది. ఈ రోజు కన్య రాశి, మిథున రాశి వారు ఏ పని చేపట్టిన శుభమే కలుగుతుంది. ఆర్థికంగానూ ప్రయోజనకరంగా ఉంటుందని రాశుల స్థితులను బట్టి పండితులు చెబుతున్నారు. ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉండనుంది. ప్రయాణాలు, శుభకార్యాలు, ఒప్పందాలు, వ్యాపార లావాదేవీలు, ఆస్తి పంచాయితీలు పెట్టుకోవచ్చా.. అదృష్ణ సంఖ్య, రంగు, శుభ సమయం ఏమిటి లాంటి వివరాలు తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను చదివి తెలుసుకోండి.

మేషం(Aries)(మార్చి 20 - ఏప్రిల్ 18):

మేషం(Aries)(మార్చి 20 - ఏప్రిల్ 18):

మేష రాశి వారికి ఈరోజు అద్భుతంగా ఉండనుంది. పట్టిందల్లా బంగారం కానుంది. అసాధ్యమైన పనులను సైతం సుసాధ్యం చేసేందుకు మేష రాశి వారు ప్రయత్నిస్తారు. వ్యాపారులు మాత్రం కొత్త కష్టపడక తప్పదు. ఇవాళ మీ కుటుంబంలోని వారికి అనారోగ్యం వల్ల ఎక్కువ డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. భవిష్యత్తు ఖర్చులపై జాగ్రత్తగా ఉండాలి. ఆచి తూచి ఖర్చు పెడుతూ సేవింగ్స్ పై దృష్టి పెట్టాలి.

లక్కీ కలర్ : ఎరుపు

లక్కీ నంబర్ : 9

అదృష్ట సమయం : 12.30PM నుండి 2PM

వృషభం(Taurus)(ఏప్రిల్ 19 - మే 19):

వృషభం(Taurus)(ఏప్రిల్ 19 - మే 19):

వృషభ రాశి వారు ఇవాళ చాలా బిజీగా గడపనున్నారు. విమర్శకుల నుండి అడ్డంకులు ఎదురు కానున్నాయి. మిమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నించే వారు తమ శాయశక్తులా ప్రయత్నిస్తారు. అవేవీ పట్టించుకోకుండా ముందుకు వెళ్తే మంచి ప్రయోజనం ఉంటుంది. విజయం సిద్ధించగలదు. ఇవాళ ఉద్యోగుకు చాలా మంచి రోజు. ఎందుకంటే వీరికి ఇవాళ జీతాలు పెరిగే అవకాశం ఉంది. వృషభ రాషి వారికి ఇవాళ ఎంతో లాభదాయకంగా ఉండనున్నాయి. మీ కుటుంబ జీవితంలో వివాహ కార్యక్రమాలను నిర్వహించే అవకాశం ఉంది.

లక్కీ కలర్ : ఎరుపు

లక్కీ నంబర్ : 8

అదృష్ట సమయం : 2PM నుండి 3PM

మిథునం(Gemini)(మే 20 - జూన్ 20 ):

మిథునం(Gemini)(మే 20 - జూన్ 20 ):

మిథున రాశి ఉన్న ఉద్యోగులు ఇవాళ చాలా ఉత్సాహంగా ఉండనున్నారు. పనులను చాకచక్యంగా పూర్తి చేస్తారు. దాని వల్ల ఉద్యోగం చేసే చోట ఉన్నత అధికారుల ప్రశంసలు లభించనున్నాయి. దాని వల్ల అధికారులతో మంచి సంబంధాలు ఏర్పడనున్నాయి. ఇలాంటి వాటి వల్ల ఉద్యోగ జీవితంలో పురోగతి లభించే అవకాశం ఉంటుంది. రచయితలు, కళాకారులకు ఈ రోజు మంచి జరగనుంది. వారి ప్రతిభను నలుగురికి చూపించడానికి మంచి వేదిక దొరుకుతుంది. దానిని ఉపయోగించుకుని కళను ప్రదర్శించి ప్రశంసలు పొందుతారు. పిల్ల నుండి శుభవార్తలు వింటారు. సాయంకాలం మరింత ఆహ్లాదకరంగా ఉండనుంది. కొత్త వ్యక్తులతోనూ పరిచయాలు ఏర్పడతాయి. వారితో మంచి సంభాషణ సాగిస్తే అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది.

లక్కీ కలర్ : తెలుపు

లక్కీ నంబర్ : 2

అదృష్ట సమయం : 2PM నుండి 3PM

కర్కాటకం(Cancer)( జూన్ 21 - జులై 21):

కర్కాటకం(Cancer)( జూన్ 21 - జులై 21):

కర్కాటక రాశి వారు కొత్త జాగ్రత్తగా నడుచుకోవాలి. ఈ రోజు వీరికి కొత్త కష్టంగానే సాగనుంది. పనిలో అప్రమత్తత అవసరం. పనులు చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు గమనించుకోవడం ఎంతో ముఖ్యం. పనులు నెరవేరక పోవడంతో నిరాశ, నిస్పృహ ఆవహించే అవకాశం ఉంది. దీని వల్ల కోపం పెరుగుతుంది. ఈ రోజు ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలు లభించడం అంత సులువు కాదు. వాటికి ఎంతో శ్రమించాల్సి రావొచ్చు.

లక్కీ కలర్ : కాషాయం

లక్కీ నంబర్ : 22

అదృష్ట సమయం : 1.30PM నుండి 3PM

సింహం(Leo)( జులై 22 - ఆగస్టు 21 ):

సింహం(Leo)( జులై 22 - ఆగస్టు 21 ):

సింహ రాశి వారికి ఈ రోజు ఎంతో ఆనందదాయకంగా ఉండనుంది. చాలా సంతోషంగా గడపనున్నారు. వ్యాపారులకు ఈ రోజు ఎంతో బాగుంటుంది. వారికి మంచి లాభాలు వస్తాయి. మిగతా రోజుల కంటే కూడా ఈ రోజు వ్యాపారం ఎంతో లాభదాయకంగా ఉండనుంది. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ఎవరినీ నమ్మి రూపాయి కూడా ఇవ్వొద్దు. లేకుంటే నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. ఈ రోజు సింహ రాశి వారికి 80 శాతం అదృష్టం ఉండనుంది.

లక్కీ కలర్ : ఎరుపు

లక్కీ నంబర్ : 8

అదృష్ట సమయం : 11.15AM నుండి 12.30PM

కన్య(Virgo)( ఆగస్టు 22 - సెప్టెంబర్ 21 ):

కన్య(Virgo)( ఆగస్టు 22 - సెప్టెంబర్ 21 ):

ఈ రోజు కన్య రాశి వారికి ఎంతో శుభప్రదం. కన్య రాశి వారి మానసిక స్థితి ఎంతో మెరుగ్గా ఉండనుంది. ఈ రోజు చాలా ఆహ్లాదంగా గడపనున్నారు. కొన్ని కావాలనుకుంటే కొన్ని వదులుకోవాలన్న సూక్తిని మరచిపోవద్దు. ఇష్టమైన పనిని నేర్చుకోవడానికి అవసరమైన పనులు వదులుకోవాల్సి వస్తుంది. కన్య రాశి వారికి ఆకస్మాత్తుగా లాభించే అవకాశం ఉంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 5

అదృష్ట సమయం : 4.30PM నుండి 5.15PM

తుల(Libra)( సెప్టెంబర్ 22 - అక్టోబర్ 22):

తుల(Libra)( సెప్టెంబర్ 22 - అక్టోబర్ 22):

తుల రాశి ఉన్న వ్యాపారులు తమ బిజినెస్ లో మంచి విజయం సాధించనున్నారు. వారికి ఆ రోజు ఎంతో లాభదాయకంగా ఉండనుంది. అయితే కష్ట పడనిదే ఏదీ దక్కదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అయితే కోపం ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. దానిని అదుపులో పెట్టుకుంటే విజయం మీ సొంతమే. ఇవాళ తుల రాశి వారు తమ స్నేహితులతో దూర ప్రాంతాలకు పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. భాగస్వామితో ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లవద్దు.

లక్కీ కలర్ : నీలం

లక్కీ నంబర్ : 4

అదృష్ట సమయం : 10.15AM నుండి 12NN

వృశ్చికం(Scorpio)( అక్టోబర్ 23 - నవంబర్ 20 ):

వృశ్చికం(Scorpio)( అక్టోబర్ 23 - నవంబర్ 20 ):

వృశ్చికం రాశి వారికి ఇవాళ కొంత ఆందోళనకరమే. పలు సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇంటా బయటా సమస్యలు చుట్టు ముడతాయి. వాటిని నేర్పుగా పరిష్కరించుకుంటే లాభం మీ సొంతమే. అలాగే వృశ్చికం వారికి ఆదాయం కూడా పెరగనుంది. ఆదాయం పెరిగినా, ఖర్చులూ పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బలహీనంగా మారుతుంది. లాభాలు తక్కువే కాబట్టి జాగ్రత్త అవసరం.

లక్కీ కలర్ : గోల్డెన్ బ్రౌన్

లక్కీ నంబర్ : 9

అదృష్ట సమయం : 7PM తర్వాత

ధనస్సు(Sagittarius)( నవంబర్ 21 - డిసెంబర్ 20):

ధనస్సు(Sagittarius)( నవంబర్ 21 - డిసెంబర్ 20):

ఈరోజు ధనస్సు రాశి వారు పనులపే ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. లేకపోతే పని పూర్తి కాకపోయే ప్రమాదం ఉంటుంది. దాని వల్ల ఉన్నత అధికారులతో మాటలు పడాల్సి వస్తుంది. కొంత వాగ్వాదం కూడా జరిగే అవకాశం లేకపోలేదు. అయితే ఇంటికి అతిథులు అకస్మాత్తుగా రావొచ్చు. దీని వల్ల ప్రణాళిక లేని ఖర్చులు తడిసి మోపెడవుతాయి. అలాగే ఎదురైన సమస్యలకు పరిష్కారం సాధిస్తారు.

లక్కీ కలర్ : 15

లక్కీ నంబర్ : నీలం

అదృష్ట సమయం : 3PM నుండి 4.30PM

మకరం(Capricon)( డిసెంబర్ 21 - జనవరి 19 ):

మకరం(Capricon)( డిసెంబర్ 21 - జనవరి 19 ):

మకర రాశి వారి పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. ఈ రోజు అదృష్టం తలుపు తట్టినా.. గందరగోళం కారణంగా ఆ అదృష్టాన్ని ఆహ్వానించకపోవచ్చు. లాభాలు వచ్చే అవకాశం ఉన్నా.. వాటిని సద్వినియోగం చేసుకోలేక పోతారు. ఒక పని చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. పని చేపట్టే ముందు తల్లి, తండ్రిని లేదా భార్యను సంప్రదించి వారి సూచనలు పాటిస్తే మంచిది.

లక్కీ కలర్ : ఆకుపచ్చ

లక్కీ నంబర్ : 6

అదృష్ట సమయం : 2PM ముందు

కుంభం(Aquarius)( జనవరి 20 - ఫిబ్రవరి 18 ):

కుంభం(Aquarius)( జనవరి 20 - ఫిబ్రవరి 18 ):

కుంభ రాశి వారికి ఈ శుక్రవారం రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. పిల్లలకు ఎదురైన సమస్యలను మంచి ఆలోచనలతో పరిష్కారం కనుక్కొంటారు. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. విద్యార్థులకు చాలా మంచి జరగనుంది. చదువులో రాణించనున్నారు. పోటీల్లో విజయం సాధించే అవకాశం ఉంది. కుంభ రాశి వారు సామాజిక సేవకులు అయితే వారికి సమాజంలో ప్రశంసలు అందనున్నాయి. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ప్రత్యేకంగా గుర్తించనున్నారు.

లక్కీ కలర్ : ఎరుపు

లక్కీ నంబర్ : 8

అదృష్ట సమయం : 11AM నుండి 12NN

మీనం(Pisces)( ఫిబ్రవరి 19 - మార్చి 19 ):

మీనం(Pisces)( ఫిబ్రవరి 19 - మార్చి 19 ):

ఈరాశి వారు ప్రణాళిక ప్రకారం నడుచుకోవాలి. ముందుకు అనుకున్న సమయానికి పనులు చేపట్టడం ముఖ్యం. ముందస్తు ప్రణాళిక లేకపోతే మంచి సమయం కోసం ఓపిక పట్టడం ఉత్తమమైన మార్గం. లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడి పెట్టడానికి మీనం రాశి వారికి ఈరోజు అద్భుతంగా ఉంది. కానీ వాటి కష్టాలు, నష్టాలు బేరీజు వేసుకుని ముందు అడుగు వేయండి.

లక్కీ కలర్ : వైలెట్

లక్కీ నంబర్ : 17

అదృష్ట సమయం : 5PM నుండి 6PM

English summary

Today rasi phalalu 05 august 2022 daily horoscope in Telugu

read on to know Today rasi phalalu 05 august 2022 daily horoscope in Telugu
Story first published: Friday, August 5, 2022, 11:44 [IST]
Desktop Bottom Promotion