For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అయ్యో! ఫాఫం పంజాబ్.. అంబటి అదుర్స్ మీమ్స్ ట్వీట్లపై లుక్కేయండి...

|

దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐపిఎల్ మ్యాచులు అభిమానులను తెగ అలరిస్తున్నాయి. తొలి మ్యాచులో అంబటి, డూప్లెసిస్ అదరగొడితే.. రెండో మ్యాచ్ లో స్టాయినిస్, రబాడ, మయాంక్ అగర్వాల్, షమీ సత్తా చాటారు. అయితే ఈ రెండు మ్యాచులకు సంబంధించి నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోలింగులతో రెచ్చిపోయారు. మన తెలుగు వారితో పాటు ఇతర రాష్ట్రాల క్రికెట్ అభిమానులు ట్విట్టర్లో కొన్ని సినిమా సీన్లు, వీడియోలను ఎడిటింగ్ చేస్తున్న తీరు అందరికీ తెగ నవ్వు తెప్పిస్తోంది.

PC : Twitter

కొందరేమో ధోనీని కేజీఎఫ్ హీరోతో పోల్చగా.. మరికొందరు ధోనీ నిర్ణయాలు ఎవ్వరికీ అర్థం కావంటూ పోస్టులు చేశారు. మరోవైపు అంబటి విధ్వంసంతో ముంబై కకావికలం అయినట్లు, రోహిత్ పూర్తిగా డీలా పడిపోయినట్లు పోస్టులు పెడితే.. ముంబై అభిమానులు మాత్రం ఫస్ట్ మ్యాచ్ దేవుడికి ఇచ్చినట్లు పోస్టులు చేశారు. ఇక ఆదివారం జరిగిన రెండో మ్యాచ్ లో ఆఖరి బంతి వరకు విజయం ఇరు జట్లకు పరీక్ష పెట్టింది. అయితే అది సూపర్ ఓవర్ కు దారి తీసి విజయం ఢిల్లీనే వరించింది. వీటిని కూడా అభిమానులు విపరీతంగా ట్రోల్ చేశారు. సూపర్ ఓవర్ ద్వారా వచ్చిన ఫలితంపై అభిమానులు తెగ సైటైర్లు వేస్తున్నారు... ముఖ్యంగా పూరన్ ఈ మ్యాచ్ లో రెండుసార్లు డకౌట్ అవ్వడంతో తనపై సోషల్ మీడియాలో ట్రోలింగులు అమాంతం పెరిగిపోయాయి... వీటిపై మీరు కూడా ఓ లుక్కేయండి. ఇదిలా ఉండగా ఈరోజు ఆర్సీబీ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య తొలి మ్యాచ్ జరగనుండగా.. దీనిపైనా అప్పుడే ట్రోల్స్ స్టార్టయ్యాయి.. అవి ఎలా ఉన్నాయో మీరే చూడండి...

ఢీ సినిమా సీన్...

ఢీ సినిమాలో బ్రహ్మానందం, సునీల్, జయప్రకాష్ రెడ్డి తాగిన సమయంలో ఎంత నవ్విస్తారో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. దీన్ని అంబటిరాయుడు బ్యాటింగుకు లింక్ చేస్తూ ఎలా పోస్ట్ చేశారో చూడండి.. ఆ సినిమాలో బ్రహ్మనందం ఎంతలా ఏడుస్తున్నాడో.. రాయుడి బ్యాటింగ్ తర్వాత ముంబై ఫ్యాన్స్ కూడా అలాగే ఏడ్చింటారనే అర్థంలో పోస్ట్ చేశారు.

అంబటి విధ్వంసం అదుర్స్...

అంబటి రాయుడు ఆపదలో ఉన్న జట్టును కష్టాల నుండి గట్టెక్కించడమే కాదు... ముంబై బౌలర్లపై విధ్వంసకర రీతిలో చెలరేగాడు. దానికి లింక్ పెడుతూ ట్విట్టర్లో షేర్ చేసిన ఈ వీడియో అందరినీ తెగ ఆకట్టుకుంటోంది.

డూప్లెస్సిస్ సూపర్ క్యాచెస్...

బౌండరీ లైన్ వద్ద డూప్లెసిస్ రెండు సూపర్ క్యాచ్ లను ఎలా పట్టుకున్నాడో మనందరికీ తెలిసిందే. దానికి లింక్ పెడుతూ డూప్లెసిస్ కు ఎన్ని చేతులను జోడించారో మీరే చూడండి..

రవితేజ సినిమా సీన్..

మీ అందరికీ వెంకీ సినిమాలోని ట్రైన్ కామెడీ సీన్ గుర్తుండే ఉంటుంది. అందులో రవితేజ బ్రహ్మానందాన్ని, ఏవిఎస్ ను ఎంతలా ఆడుకుంటారో తెలిసిందే. అందులోని ఓ సీన్ పిక్ ను చెన్నై, ముంబై మ్యాచ్ కు ఎలా లింక్ చేశారో చూడండి...

సినిమా సీన్లు...

వెంకీ, బన్నీ, సునీల్, మహేష్ సినిమాల్లోని కొన్ని సీన్లను కట్ చేసి ఐపిఎల్ మ్యాచ్ కు ఎలా సింక్ చేశారో చూడండి...

కామెడీ వీడియో...

ఐపిఎల్ టోర్నమెంట్ లో ముంబై ఇండియన్స్, చెన్నైసూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ లో ధోనీ డెసిషన్స్ కు సంబంధించి కొన్ని కామెడీ వీడియోలను ట్విట్టర్లో ఫ్యాన్స్ షేర్ చేసుకున్నారు. అందులో ఈ కామెడీ వీడియో చూస్తే మీరు తెగ నవ్వేస్తారు.

7/G సినిమా సీన్..

మీ అందరికీ ఈ సీన్ బాగానే గుర్తు ఉంటుంది. ఈ సినిమాలో హీరో సునీల్ శెట్టికి బ్యాటింగ్ ఎంతగా ఏడిపిస్తాడో తెలిసిందే. దీన్ని కూడా ఐపిఎల్ 2020 మ్యాచ్ కు లింక్ ఎలా కామిడీ చేస్తున్నారో చూడండి...

ధోనీ DRS గురించి..

ధోనీ అవుటైనట్లు అంపైర్ సిగ్నల్ ఇవ్వగానే Dhoni Review System(DRS) అడిగాడు. అంతే ధోనీ నిర్ణయమే సరైందని, అది నాటౌట్ అని తేలింది. అయితే దీనికి, అంబానీకి లింక్ పెడుతూ ఎలాంటి ట్వీట్ పెట్టారో మీరే చూడండి...

ధోనీ టీవీకి పూలమాల..

మహేంద్ర సింగ్ ధోనీ టీవీలో ప్రత్యక్షమవ్వగానే వెంటనే ఆ టీవీకి పూలమాల వేసి తన అభిమానాన్ని చాటుకున్నారు కొందరు అభిమానులు. ధోనీ అంటే తమకెంత అభిమానమో నిరూపించారు. 437 రోజుల తర్వాత ధోనీనీ మైదానంలో చూస్తున్నట్లు గుర్తు చేసుకున్నారు.

ఫన్నీ బ్యాటింగ్..

ఓ భారీ మనిషి బ్యాటింగ్ చేస్తున్న ఫోటోను షేర్ చేసి, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లో చాలా అరుదైన అవకాశం దక్కినట్లు పోస్ట్ చేశారు.

దంగల్ పిక్...

దంగల్ సినిమాలో కుస్తీ గురించి మనందరికీ తెలిసిందే. అయితే వీరి ఫొటోలను మార్ఫింగ్ చేసి రోహిత్, పియూష్ చావ్లాల ముఖాలను అతికించారు.

పాపం షమీ...

ఆదివారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ తరపున అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ.. విజయం ఢిల్లీవైపే మొగ్గు చూపింది. దీంతో షమీ ఫొటోకు పక్కన డల్ గా ఉండే వ్యక్తి ఫొటోను జత చేసి ట్రోల్స్ చేస్తున్నారు.

ఇదెలా షార్ట్ రన్...

పంజాబ్ జట్టుకు ఒక్క పరుగు వల్ల ఏకంగా విజయమే చేజారింది. అయితే ఆ ఒక్క పరుగు అంపైర్ తప్పిదం వల్లే జరిగిందని, పంజాబ్ టీమ్, మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చూసిన పంజాబ్ అభిమానులు ఆ అంపైర్ ను తిడుతున్నారు. ఇక సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

నికోలస్ పూరన్ పరిస్థితి..

ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో పూరన్ రెండుసార్లు డకౌట్ అవ్వడాన్ని క్రికెట్ అభిమానులు ఇలా ట్రోల్ చేశారు...

English summary

Twitter welcomes IPL 2020 with some hilarious memes in telugu

Here are the welcomes ipl 2020 with some hilarious memes in telugu. Take a look